Visakhapatnam

News November 4, 2024

ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో చెప్పాలి: గండి బాబ్జి

image

చంద్రబాబు విశాఖ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి ఖండించారు. సోమవారం విశాఖ నగరం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో స్టార్ హోటల్స్‌లో సమావేశాలు నిర్వహించి ప్రజాధనాన్ని వృథా చేశారని విమర్శించారు. అమర్నాథ్ మంత్రిగా ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకువచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

News November 4, 2024

విశాఖ: ప్రాణాలు తీసిన ఈత సరదా

image

సీతపాలెం వద్ద సముద్రంలో మునిగి ఆదివారం అభిరామ్(21) మృతిచెందాడు. పెందుర్తికి చెందిన నలుగురు యువకులు రెండు బైకులపై సీతపాలెం తీరానికి వచ్చారు. వీరిలో సిరిగుడి అభిరామ్ ఒడ్డున రాళ్ల గుట్టలపై ఉండగా ఒక్కసారిగా ఎగిసిపడిన కెరటానికి సముద్రంలో పడిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో మత్స్యకారులు కాపాడారు. ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ నర్సింగరావు తెలిపారు.

News November 3, 2024

సిడ్నీ చేరుకున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

image

ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి చేరుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ పార్లమెంట్ ఆతిథ్యమిస్తున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ (సీపీసీ)లో పాల్గొనడానికి ఆయన సిడ్నీకి వెళ్లారు. ఆయనతో పాటు శాసనసభ కార్యదర్శి ప్రసన్న కుమార్ సూర్యదేవర ఉన్నారు. అయ్యన్నపాత్రుడును సిడ్నీ విమానాశ్రయంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు.

News November 3, 2024

విశాఖ: ‘అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించాం’

image

గత ప్రభుత్వం గతంలో ఎక్కడాలేని విధంగా రుషికొండపై అద్భుతమైన టూరిజం ప్రాజెక్టును నిర్మించినట్లు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆదివారం విశాఖలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంతంగా నిర్మించుకున్నట్లుగా చెప్పడంపై మాజీ మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు.

News November 3, 2024

‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా చంద్రబాబు’

image

సీఎం చంద్రబాబు నాయుడు విశాఖలోని రుషికొండపై ఉన్న భవనాలను శనివారం సందర్శించిన విషయం తెలిసిందే. విశాఖ ఎమ్మెల్యేలు దగ్గరుండి సీఎంకు భవనాలను చూపించారు. దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘రుషికొండ భవనాలు చూసి ఆశ్చర్యపోయావా!.. అమరావతిలో ఇలా కట్టలేదని సిగ్గుపడ్డావా?’ అంటూ ట్వీట్ చేశారు.

News November 3, 2024

ఏయూ పరిధిలో యూజీ రీ వాల్యుయేషన్ ఫలితాల విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ డిగ్రీ మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, 4వ సెమిస్టర్, 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. జూన్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను AU వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు అన్నారు.

News November 3, 2024

విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

image

విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు.

News November 2, 2024

విశాఖ కలెక్టరేట్‌లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష

image

విశాఖ పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టరేట్‌లో శనివారం అధికారులతో సమీక్షా నిర్వహించారు. రెండు మూడు రోజుల్లో రాష్ర్ట భవిష్యత్తును మార్చే కొత్త ప్రణాళిక ఆవిష్కరిస్తామన్నారు. 2047 నాటికి అన్నింటా ముందజలో ఉంటామ్మన్నారు. మెట్రో రైల్, జాతీయ రహదారులు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రి సుధీర్ఘ సమీక్ష చేశారు.

News November 2, 2024

పరవాడ: మహా యజ్ఞం మొదలైంది- హోంమంత్రి

image

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెంలో రహదారి మరమ్మతులకు శ్రీకారం చుట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. దీనిపై స్పందించిన ఆమె మహా యజ్ఞం మొదలైందని ఎక్స్‌లో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రహదారులను అభివృద్ధి చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.

News November 2, 2024

పరవాడ: రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టిన సీఎం

image

పరవాడ మండలం వెన్నెలపాలెం గ్రామంలో రహదారుల మరమ్మతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. సిమెంటు పిక్కతో కలిపిన కాంక్రీట్ మిక్చర్‌ను స్వయంగా పారతో తీసి గుంతల్లో వేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, కొణతాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.