India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 300 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందజేశారు. గంజాయి సీజ్ చేసిన పలు కేసులలో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువులను రికవరీ చేసి, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.

కంచరపాలెంలో శుక్రవారం మిస్సైన బాలుడు శనివారం చెరువులో శవమై కనిపించాడు. తరుణ్(9) రామ్మూర్తి పంతులుపేట జీవీఎంసీ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లిన తరుణ్ మధ్యలో బయటకు వెళ్లారు. జ్ఞానాపురం రైల్వే స్టేషన్ పక్కన ఉన్న కెనాల్లో దిగి తిరిగి రాలేదు. దీంతో విద్యార్థి తల్లి పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడు మృతదేహాన్ని గుర్తించారు.

వైసీపీ పాలనలో ఉపాధి హామీ నిధుల అస్తవ్యస్త వినియోగం జరిగిందని ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ అన్నారు. శనివారం ఆయన విశాఖ బీజేపీ కార్యాలయంలో మాట్లాడారు. 15జిల్లాలో పర్యటించి జిల్లాల అధికారులతో వివిధ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించామన్నారు. జగన్ పాలనలో ఉపాధిహామీ నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. గత ఐదేళ్ల అస్తవ్యస్థ విధ్వంస పాలన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే ప్రయత్నం జరుగుతుందన్నారు.

అనకాపల్లి గవరపాలెం సాగిదుర్గరాజు వీధిలో ఈనెల 19న ఆత్మహత్యకు ప్రయత్నించిన మంగారపు జ్యోతి(29) చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త షేక్ అబ్దుల్ ఘనితో కలిసి ఆమె తన పుట్టింటికి వెళ్లింది. 19న తనను బయటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. ఇప్పుడు బయటకు ఎందుకని ఆమె తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురై మేడపైకి వెళ్లి ఉరేసుకుంది. వెంటనే విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.

విశాఖ నగర మొదటి మేయర్ NSN రెడ్డి 95వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి శనివారం పూలమాలలు వేశారు. బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు తదితరులు పాల్గొని ఎన్.ఎస్.ఎన్.రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషిచేసిన ప్రజా నాయకుడు ఎన్.ఎస్.ఎన్.రెడ్డి అని కొనియాడారు.

విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం మెయిన్ రోడ్లో పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ను లారీ ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ నంబర్ AP40CS0114 ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

విశాఖ ఎన్ఐఏ కోర్టులో కోడి కత్తు కేసు విచారణ జరిగింది. జగన్పై హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కోర్టుకు వచ్చారు. వాదనల అనంతరం మార్చి 21కి ఈ కేసు పడింది. ప్రధాన సాక్షి అయిన జగన్ కోర్టుకు రాకుండా కాలయాపన చేయడం తగదని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. జగన్ తీరుతోనే కేసు విచారణ ఆలస్యం అవుతోందని ఆరోపించారు. పరామర్శలకు వెళ్లే జగన్కు.. కోర్టుకు వచ్చే సమయం దొరకలేదా అని ప్రశ్నించారు.

విశాఖ స్టీలుప్లాంట్ పోలీస్ స్టేషన్లో ఈనెల 25న బైకుల బహిరంగ వేలం వేయనున్నట్లు సీఐ కేశవరావు తెలిపారు. పలు రకాల కేసుల్లో స్వాధీనం చేసుకున్న 25 బైకులను వేలం వేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనాలని సీఐ కోరారు. మరిన్ని వివరాలకు తమ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.

విశాఖలో ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో శుక్రవారం PM-MKSSY పథకంపై మత్స్యకారులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మత్స్య అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్నవారు NFDP క్రింద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జోనల్ డైరెక్టర్ భామిరెడ్డి తెలిపారు. ఇందులో భాగాంగా కొంతమంది మత్స్యకారులకు NFDP, e-SHARM రిజిస్ట్రేషన్ కార్డులు అందజేశారు.
Sorry, no posts matched your criteria.