India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా విమ్స్‌లో బుధవారం ఉచిత న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, పక్షవాతం, చిన్నపిల్లలకు మానసిక వైకల్యం తదితర రోగాలను నిర్ధారించే వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. >Share it
మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల్లో ప్రత్యామ్నాయంగా ఇథనాల్ తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తెలిపారు. అనకాపల్లిలో నిర్వహించిన కూటమి ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో జగన్ విధ్వంసకర పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రలో ఐదు ప్రాజెక్టుల కోసం టెండర్లను పిలిచినట్లు తెలిపారు.
విశాఖ డెయిరీ యాజమాన్యం గాజువాక మండలం మింది గ్రామ పరిధిలో రూ.100 కోట్ల విలువచేసే మూడు ఎకరాల భూమిని కబ్జా చేసిందని జీవీఎంసీ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం విశాఖ కలెక్టర్ హరీంద్ర ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అదే గ్రామ పరిధిలో ఏపీఐఐసీ నుంచి పాల ఉత్పత్తి పరిశ్రమకు మరో 19.36 ఎకరాల భూమిని అక్రమంగా పొందినట్లు వివరించారు. ఈ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
అనకాపల్లిలో సోమవారం రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద అధ్యక్షతన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేశ్ హాజరయ్యారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తాతయ్య బాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొల్లు రవీంద్రకు విశాఖ ఎయిర్పోర్ట్‌లో అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలి సారి జిల్లాకు వస్తున్న మంత్రికి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని అన్నారు. ఆయనతో పాటు దాడి రత్నాకర్ ఉన్నారు.
విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆంధ్ర vs హిమాచల్ రంజీ మ్యాచ్‌లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసేసరికి హిమాచల్ ప్రదేశ్ 198 పరుగులు చేసింది. ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ 65 ఓవర్లలో 198 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆంధ్ర జట్టు బౌలర్ శశికాంత్ అద్భుతమైన బౌలింగ్ చేశారు.
ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయినట్లు మెరైన్ ఏఎస్ఐ కృష్ణ తెలిపారు. కోరుప్రోలు గ్రామానికి వివాహ వేడుకలో పాల్గొనేందుకు విజయనగరం నుంచి వచ్చిన 11 మంది విద్యార్థులు తీరంలో విహారయాత్రకు వెళ్లారు. వారిలో టి.అర్జున్, బి.బబ్లు సముద్రంలో స్నానం చేస్తుండగా గల్లంతయినట్లు పేర్కొన్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని బీబీఏ-ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సు నాలుగవ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ తెలిపారు. జూలై నెలలో జరిగిన ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు నవంబర్ 9వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చు.
ఏయూలో 5, 3 సంవత్సరాల న్యాయ విద్య సెల్ఫ్ సపోర్ట్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ డీ.ఏ నాయుడు తెలిపారు. ఏపీ లా సెట్, క్లాట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు నవంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
భీమిలి మండలం చినగదిలి పరిధిలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేసిన విశాఖ డెయిరీకి శనివారం జీవీఎంసీ సహాయ ప్రణాళిక అధికారి శాస్త్రి నోటీసులు జారీ చేశారు. జీవీఎంసీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ ప్రాంతంలో వసతి గృహాలు, పశువుల షెడ్లు, ఇతర భవనాలు ఉన్నట్లు గుర్తించామని నోటీసులో పేర్కొన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు వారంలోగా సమర్పించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.