India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. గురువారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు. మాస్ కాపీయింగ్ లేదా ఇతర సంఘటనలు జరిగాయని పేర్కొంటూ ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు వార్తలను, సమాచారాన్ని చేరవేసే వారిపై నిఘా ఉంటుందన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఫిబ్రవరి 23న జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ -2 పరీక్ష జరగనుందని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టరేట్ వీసీ హాలులో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, పరీక్షా కేంద్రాల నిర్వాహకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

విశాఖ నుంచి హైదరాబాద్ స్నేహితులతో బర్త్డే సెలబ్రేషన్‌కు వచ్చిన యువకుడు ప్రమాదవశాత్తు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ విశాలాక్షి నగర్‌కు చెందిన ఓబ్బిలినేని సూర్య దేవ్(26) చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికి హైదరాబాద్ వచ్చాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చెరువు వద్ద పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తెల్లవారుజామున చెరువులో దిగి సూర్యదేవ్ మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై విశాఖ కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సమీక్షా నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏజెంట్‌లు, ఎన్నికల విధులు సన్నద్ధతపై ఉత్తరాంధ్ర జిల్లాల ఏఆర్వోలకు సూచనలు చేశారు. ఎన్నికలకు సంబంధించిన విధుల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు విశాఖ మీదుగా ప్రయాణించే హటియా-ఎర్నాకుళం(22837) రైలుకు అదనపు భోగి యాడ్ చేస్తామని వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ఈ రైలుకు ఫిబ్రవరి 24న థర్డ్ ఏసీ ఎకానమీ క్లాస్ భోగి అదనంగా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్లో 1140 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయనున్నారు. నెల రోజుల క్రితం ప్లాంట్ యాజమాన్యం వీఆర్ఎస్‌కు ప్రకటన ఇచ్చింది. ఈక్రమంలో 1600 మందికిపైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొందరి అప్లికేషన్లు రిజెక్టయ్యాయి. 1,140 వీఆర్‌ఎస్‌కు ఆమోదం లభించింది. రిటైర్మెంట్ తీసుకునే ప్రతి ఉద్యోగికి అత్యధికంగా రూ.50 లక్షల వరకు నగదు అందుతుంది. ఈ మేరకు కేంద్రం నిధులు విడుదల చేసింది.

ఇటీవల విశాఖలో గంజాయి కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి కీలక ఆదేశాలు ఇచ్చారు. గంజాయి రవాణా చేస్తున్న వారితోపాటు గంజాయి తాగే వారిపైనా రౌడీషీట్లు ఓపెన్ చేయాలని ఉత్తరాంధ్ర ఎస్పీలను ఆయన ఆదేశించారు. అలాగే ఇతర కేసులపై ఎస్పీలతో డీఐజీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇతర నేరాలపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ నుంచి తిరుపతికి వీక్లీ స్పెషల్ (08583/84)ప్రత్యేక రైళ్లను వేయడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 28 వరకు ప్రతి సోమవారం వీక్లీ ట్రైన్ ఉంటుందన్నారు. సోమవారం రాత్రి 7గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. తిరిగి మరుసటి రోజు తిరుపతి నుంచి విశాఖ బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ విషయం గమనించాలన్నారు.

☞ పెందుర్తి నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ☞మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ☞కాపులుప్పాడ వద్ద అస్తిపంజరం కలకలం ☞ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ ☞విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్ ☞మధురవాడలో ఉరేసుకుని మహిళ మృతి ☞నేటి నుంచే పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ జాతర ☞దువ్వాడలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెండ్

ఎన్.టి.ఆర్. కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.
Sorry, no posts matched your criteria.