India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూటమి ప్రభుత్వం 30 రోజుల్లో 30 మంచి పనులు చేసిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంపీపీ కాలనీలో తన నివాసంలో ఆయన మాట్లాడారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, పోలవరం పనులు వేగవంతం అయ్యాయని తెలిపారు. కేంద్ర ఉక్కుశాఖా మంత్రి స్వయంగా వచ్చి ఉక్కు సమస్యపై సమీక్ష జరిపి కార్మికులకు భరోసా ఇచ్చేలా మాట్లాడారని గుర్తుచేశారు. విశాఖ అభివృద్ధిలో భాగంగా మెట్రో, బీచ్ రోడ్ అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో ఏపీ తీరానికి చేరువగా అల్పపీడనం రానుంది. దీని ప్రభావంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులకు నేటివరకు వేతనాలు అందలేదు. వర్సిటీ వీసీ రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఖాళీ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇన్చార్జి విసీ ని నియమించలేదు. దీంతో ఉద్యోగుల వేతనాలు మంజూరు ఆలస్యం అవుతోంది. ఉద్యోగులకు దాదాపు రూ.32 కోట్ల వరకు వేతనాలు, పెన్షన్ల రూపంలో ఇవ్వాల్సి ఉంది. ఇన్చార్జి వీసీ నియామకం జరిగితేనే ఈ ఫైల్ కు మోక్ష లభించి ఉద్యోగులకు వేతనాలు లభిస్తాయి.
విశాఖ నగరంలో ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. నగరంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే పైవంతెనలకు అనుసంధానంగా మెట్రో డిజైన్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ఎన్.హెచ్.ఏ.ఐ సమన్వయంతో ప్రణాళిక రచిస్తున్నారు.
విజయనగరం జిల్లా రామభద్రపురం మండలంలోని ఓ గిరిజన గ్రామంలో ఆరు నెలల చిన్నారిపై <<13625276>>అత్యాచారం<<>> చేసిన ఘటనపై హోమ్ మంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. జిల్లా ఎస్పీ, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడిన ఆమె.. ఘటనపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించారు.
విశాఖ <<13613533>>ముడసర్లోవ<<>> పార్కు పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే చర్యలు చేపట్టవద్దని జీవీఎంసీ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈ.ఏ.ఎస్ శర్మ లేఖపై స్పందించిన ఆయన.. జీవీఎంసీ అధికారులను వివరణ కోరారు. ముడసర్లోవ పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ముడి సరుకు కొరత ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఐరన్ లంప్స్ 3 రోజులకు, డొలమైట్ 3 రోజులకు, లైవ్ స్టోన్ 5 రోజులకు, ఎస్ఎంఎస్ లైవ్ స్టోన్ 5 రోజులకు ఇలా సగటున నాలుగు నుంచి ఐదు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎండీసీ నుంచి అవసరమైన ముడి సరుకు విశాఖకు సరఫరా కావలసిన అవసరం ఉంది.
స్నేహితుడు బర్త్ డేకి గంజాయి తీసుకొస్తున్న విద్యార్థిని పోలీసులు అగనంపూడి వద్ద అరెస్టు చేశారు. చోడవరంకు చెందిన ఓ విద్యార్థి గాజువాకలో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చోడవరం నుంచి సిటీ బస్సులో కొద్దిపాటి గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు అగనంపూడి వద్ద బస్సులో తనిఖీ చేశారు. విద్యార్థి బ్యాగును పరిశీలించగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
చింతపల్లి అదనపు ఎస్పీ కెపిఎస్.కిషోర్‌కు పదోన్నతి కల్పిస్తూ ఏలూరు ఎస్పీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చింతపల్లిలో మొదట ఏఎస్పీగా, తర్వాత అదనపు ఎస్పీగా రెండున్నర ఏళ్లపాటు చేశారు. కిషోర్ హయాంలో చింతపల్లి పరిసర నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాల కోసం ప్రేరణ పేరుతో జాబ్ మేళాలు నిర్వహించారు. మావోయిస్టు కార్యకలాపాలు అణిచివేతలో కీలకంగా పాల్గొన్నారు.
విశాఖకు కొత్తగా ఇద్దరు డీప్యూటీ కమిషనర్ ఆఫీ పోలీసు(డీసీపీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీసీపీగా అజిత వెజెండ్ల నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై విశాఖ రానున్నారు. అలాగే DCP-2గా తూహిన్ సిన్హా సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. సిన్హా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా ఉన్నారు. కాగా అజిత గతంలో విశాఖ SEB అధికారిణిగా పనిచేశారు.
Sorry, no posts matched your criteria.