Visakhapatnam

News July 13, 2024

అనకాపల్లి: కోడిపెట్ట తల కొరికిన డాన్సర్.. కేసు

image

అనకాపల్లిలో ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో పెటా సంస్థ (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సంస్థ ఫిర్యాదు చేసింది.

News July 13, 2024

విశాఖ: కేజీహెచ్‌కు ఎస్బీఐ రూ. 47 లక్షల ఆర్థిక సహాయం

image

కేజీహెచ్‌ను డిజిటలైజేషన్ చేయడంలో SBI రూ. 47 లక్షల సాయాన్ని అందించింది. సంస్థ సీఎస్సార్ నిధుల్లో వీటిని సమకూర్చింది. ఈ నిధులతో కేస్ సీట్లు, ల్యాబ్ పరీక్షలు నివేదికలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో రోగులకు సెల్ ఫోన్లకే ల్యాబ్ పరీక్షలు నివేదికలను పంపే విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ వి. శివానంద తెలిపారు.

News July 13, 2024

విశాఖ: ఏపీఎల్ టైటిల్ పోరుకు వైజాగ్ వారియర్స్

image

విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్-2 లో వైజాగ్ వారియర్స్ రాయలసీమ కింగ్స్ పై విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైజాగ్ వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. శనివారం ఉత్తరాంధ్ర లయన్స్ తో ఫైనల్ కు వైజాగ్ వారియర్స్ తలపడనుంది.

News July 13, 2024

అనకాపల్లి: ‘పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పాటించాలి’

image

అనకాపల్లి జిల్లాలో ఉన్న పరిశ్రమలలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

News July 12, 2024

వైజాగ్ వారియర్స్ ఫైనల్‌కు చేరేనా?

image

విశాఖలో ఏపీ ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్-2 మ్యాచ్ వైజాగ్ వారియర్స్, రాయలసీమ మధ్య జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 190 భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్‌కు దిగిన రాయలసీమ కింగ్స్‌ 13 ఓవర్లకు 98 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. రాయలసీమ గెలవాలి అంటే 60 బంతుల్లో 115 రన్స్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఉత్తరాంధ్ర లయన్స్‌తో ఫైనల్ ఆడనుంది.

News July 12, 2024

విశాఖ: ఎమ్మెల్యేను కలిసిన MSK.ప్రసాద్

image

విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును తన కార్యాలయంలో ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ చీఫ్ సెలెక్టర్ MSK.ప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజల అభిమానంతో వరుసగా గెలుస్తూ వస్తున్న వెలగపూడిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తను పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

News July 12, 2024

రాయితీపై విక్రయాలు ప్రారంభించిన విశాఖ జేసీ

image

ఎంవీపి కాలనీలోని రైతుబజారులో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం పంపిణీ కేంద్రాన్ని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ప్రారంభించారు. బియ్యం కిలో రూ.48, కిలో కందిపప్పు రూ.160 రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ధరల పెరుగుదల నియంత్రించడంతోపాటు, ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ చర్యలు చేపట్టింది.

News July 12, 2024

పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు: గుడివాడ

image

పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చెప్పినట్లు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ‌ చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును చేపట్టినట్లు ‌ విమర్శించారు. విశాఖ ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్నారు. ప్రజల తరఫున తాము పోరాటం చేస్తామన్నారు.

News July 12, 2024

విశాఖ: పవన్ కళ్యాణ్‌కు విశ్రాంత ఐఏఎస్ లేఖ

image

విశాఖ ముడసర్లోవ పార్కులో నిర్మాణాలు చేపట్టడం పర్యావరణానికి హానికరమని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. రిజర్వాయర్ ‌కు ఆనుకుని ఉన్న పార్కు ప్రదేశంలో 105 రకాల పక్షులను శాస్త్రవేత్తలు గుర్తించారని పేర్కొన్నారు. అలాంటి ప్రాంతంలో జీవీఎంసీ భవనాల నిర్మాణానికి 228 చెట్లను తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కట్టడాలు నిర్మించడం చట్ట విరుద్ధం అన్నారు.

News July 12, 2024

విశాఖ: నేటితో ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు

image

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల గడువు శుక్రవారంతో ముగియనుంది. శనివారం వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఈనెల 16న సీట్లు కేటాయిస్తారు. 17 నుంచి 22వ తేదీ వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ఆన్‌లైన్‌లో అందించి, కాలేజీలో రిపోర్టు సమర్పించాలి. 19 నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి.