India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 17వ తేదీన నీతి అయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం విశాఖ వస్తున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రాత్రి 10.15 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నగరానికి వెళ్లి బస చేస్తారు. 18వ తేదీన సీఈవో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే రోజు రాత్రి 11.10 గంటలకు తిరిగి ఢిల్లీ వెళతారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి కోట నుంచి సిరిమానును ఆయన తిలకించారు. వారితో పాటు రాజ కుటుంబీకులు, జిల్లా ప్రజాప్రతినిదులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నరవ సమీపంలోని మన్యం కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు. దసరా నుంచి మద్యం సేవిస్తూ గొడవ పడుతున్న గోపి.. తండ్రి దేముడును మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో పీక కోసేశాడు. సంఘటన స్థలములోనే దేముడు మృతి చెందగా.. స్థానికుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు ఘటనాస్థలంలో గోపిని అదుపులో తీసుకున్నారు.
అనకాపల్లి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కొల్లు రవీంద్రను ప్రభుత్వం నియమించింది. జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా బాల వీరాంజనేయులును ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన హోం మంత్రి అనితను విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా, అల్లూరి జిల్లాకు గుమ్మడి సంధ్యారాణిని ఇన్ ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం నియమించింది.
అనకాపల్లి పరవాడ మండలం ముత్యాలపాలెం బీచ్‌లో గుర్తుతెలియని మృతదేహం ఒకటి నేడు లభ్యమైంది. మృతదేహం పూర్తిగా అస్థిపంజరాలుగా మారింది. మృతుడి ఒంటిపై ఎటువంటి దుస్తులు లేకుండా, ఫ్లై ఈగల్ పచ్చబొట్టు చేతిపై ఉంది. సంఘటన స్థలానికి పరవాడ పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పచ్చబొట్టు ఆధారంగా మృతుని బంధువులు ఎవరైనా ఉంటే పోలీస్ వారిని సంప్రదించాలని కోరారు.
హైదరాబాద్‌లో వ్యభిచార ముఠాలో చిక్కుకున్న విశాఖ మహిళకు విముక్తి లభించింది. HYD రహ్మత్‌నగర్‌లోని ఓ భవనంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. వ్యభిచారాన్ని నడిపిస్తున్న వంశీని అరెస్ట్ చేశారు. ఇదే విషయంలో కీలకంగా ఉన్న మరో మహిళ పరారీలో ఉంది. ఈ వ్యభిచార ముఠాలో చిక్కుకున్న విశాఖ మహిళను పోలీసులు కాపాడారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ సింటర్ ప్లాంట్ వద్ద ఉన్న ఓ కాలువలో పడి అర్ధరాత్రి ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. మృతుడు పెద్దగంట్యాడకు చెందిన అశోక్ రెడ్డి(45)గా గుర్తించారు. అతను స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ సీఐ కేశవరావు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఆర్చరీ అండర్-14, 17 విభాగం బాలుర, బాలికల ఎంపికలను ఈనెల 16న అరకులోయలోని ఏపీ టీడబ్ల్యూఆర్ స్పోర్ట్స్ స్కూల్లో నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారి పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. ఈ ఎంపికలను హాజరయ్యే విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఎలిజిబులిటీ ఫామ్, మిడ్డే మీల్స్ ఎక్విటెన్స్ తీసుకురావాలని సూచించారు.
విశాఖ జిల్లాలో 31 మంది మహిళల పేరున మద్యం దుకాణాలకు లైసెన్స్ లభించింది. మొత్తం జిల్లాలో 155 మద్యం షాపులకు గాను అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందుకోసం సుమారు 4000 దరఖాస్తులు అందాయి. సోమవారం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియ ద్వారా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 31 మంది మహిళల పేరున మద్యం లైసెన్సులు మంజూరయ్యాయి.
గిరిజన సహకార సంస్థ 2024-25 సీజన్ కు గిరిజన రైతుల నుంచి సేకరిస్తున్న కాఫీ గింజలకు కొనుగోలు ధరలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం జీసీసీ వైస్ ఛైర్మన్ ఎండీ కల్పనా కుమారి అధ్యక్షతన అపెక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అరెబికా పార్చ్ మెంట్‌కు కిలో రూ.285, అరెబికా చెర్రీ రకానికి రూ.150, రోబస్టా చెర్రీ రకానికి రూ.80 చొప్పున ధర నిర్ణయించినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.