Visakhapatnam

News December 19, 2024

ఈ నెలాఖరున అరకు ఉత్సవం

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెలాఖరున అరకు ఉత్సవంను నిర్వహిస్తామని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. అరకు ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. మూడు రోజులుపాటు అరకు ఉత్సవాన్ని విజవంతంగా నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆధికారులకు సూచించారు. పట్టణాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.

News December 19, 2024

విశాఖలో విజయ్ హజారే ట్రోఫీ

image

విశాఖలోని ఈ నెల 21 నుంచి విజయ్ హజారే టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబు పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో మిజోరాం, జమ్మూ-కాశ్మీర్, విదర్భ, తమిళనాడు, చత్తీస్‌గఢ్ జట్లు తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

News December 19, 2024

విశాఖ: ‘అధికారులు చురుకైన పాత్ర పోషించాలి’

image

విశాఖ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులతో పంచాయతీరాజ్ కమీషనర్ వి.ఆర్ కృష్ణ తేజ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలులో 100% చురుకైన పాత్ర పోషించాలని, ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలని విశాఖ, అనకాపల్లి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగుల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రజాపరిషత్ కార్యనిర్వహణాధికారి, అధికారులు ఉన్నారు.

News December 19, 2024

జనవరి 4న విశాఖకు సీఎం చంద్రబాబు: కలెక్టర్

image

జనవరి 4న విశాఖలో నిర్వహించనున్న నావికాదళ విన్యాసాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు భాగస్వామ్యం కానున్నారన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించి పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

News December 19, 2024

విశాఖ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో విశాఖ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ ప్రసాద్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్‌తో పాటు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసరమైతే ప్రజలు 0891-2590102కు ఫోన్ చేయాలని సూచించారు.

News December 19, 2024

విశాఖలో రూ.4 కోట్లతో మహిళ పరార్

image

ఎక్కువ వడ్డీలకు ఆశ పడిన ప్రజలు మోసపోయిన ఘటన విశాఖ నగరంలో జరిగింది. విశాఖ 2వ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారి వీధికి చెందిన మజ్జి ముత్యాలు సొంత ఇంట్లో భర్త, పిల్లలతో నివసిస్తోంది. అధిక వడ్డీ ఆశ చూపి రెండేళ్లుగా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.4 కోట్లు వసూలు చేసింది. భర్త, పిల్లలను వదిలి మరో వ్యక్తితో పరారైనట్లు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News December 19, 2024

చింతపల్లి: కాఫీ తోటలను పరిశీలించిన ఐటీడీఏ పీవో

image

కాఫీ పళ్ళను దళారులకు విక్రయించి మోసపోవద్దని పాడేరు ఐటిడిఏ పీవో వి.అభిషేక్ అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ పరిధి గాదిగొయ్యి గ్రామంలో ఉన్న కాఫీ తోటాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ..పూర్తిగా పండిన కాఫీ పళ్ళు మాత్రమే సేకరించాలన్నారు. నాణ్యమైన పళ్ళు సేకరించడం వల్ల మంచి ధరలు వస్తాయన్నారు. దళారులు తూనికల్లో మోసం చేస్తారని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News December 19, 2024

విశాఖ: పాల సరఫరాను అడ్డుకున్న మహిళా కార్మికులు

image

అక్కిరెడ్డిపాలెం విశాఖ డెయిరీ గెట్ వద్ద మహిళా కార్మికులు వర్షంలో సైతం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బుధవారం రాత్రి పాల సరఫరాను అడ్డుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చి న్యాయం చేసే వరకు పాల సరఫరాను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. కాగా యాజమాన్యం స్పందించి వారితో మాట్లాడటంతో తాత్కాలికంగా నిరసనను విరమించారు.

News December 18, 2024

కెనడాలో గాజువాక యువకుడి మృతి

image

చదువుకోవడానికి కెనడా వెళ్లిన గాజువాక యువకుడు అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగప్రసాద్ కుమారుడు ఫణికుమార్ 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళారు. శనివారం తన రూమ్మేట్ ఫణి కుమార్ చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో వారు ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకున్నారు. కాగా ఫణి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 18, 2024

కెనడాలో గాజువాక యువకుడి మృతి

image

చదువుకోవడానికి కెనడా వెళ్లిన గాజువాక యువకుడు అక్కడ ఆకస్మికంగా మృతి చెందాడు. డ్రైవర్స్ కాలనీకి చెందిన నాగప్రసాద్ కుమారుడు ఫణికుమార్ 4 నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు కెనడా వెళ్ళారు. శనివారం తన రూమ్మేట్ ఫణి కుమార్ చనిపోయినట్లుగా తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో వారు ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌ను కలిసి తమ కుమారుడి మృతదేహాన్ని తీసుకురావాలని వేడుకున్నారు. కాగా ఫణి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.