India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్‌లో బాల శేఖర్ (19) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మొబైల్ షాప్‌లో పనిచేస్తున్న బాల శేఖర్ ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ప్రేమలేఖ లభ్యమయింది. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 117 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు.పిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.
దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాలను ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం తెలిపారు. దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 19న భీమిలి రెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ ఆవరణలో, 20న విశాఖ నీలమ్మ వేపచెట్టు వద్ద ఉన్న ఎం.జి.ఎం హైస్కూల్లో, 21న విశాఖ వెస్ట్ పరిధిలో క్వీన్ మేరీ హైస్కూల్ వద్ద ఈ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.
మాకవరపాలెం(M) జంగాలపల్లిలో కోళ్లఫారంలో పనిచేస్తున్న గిరిజన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాడేరు మండలం బడిమెలకు చెందిన గోల్లూరి సంతి(19) భర్త కొర్రా చరణ్‌తో కలసి జంగాలపల్లిలో కోళ్లఫారంలో పనిచేసేందుకు చేరారు. సోమవారం కోళ్లకు మేత వేసే విషయంలో ఇద్దరికీ వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురై ఆమె ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ దామోదర్ తెలిపారు.
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా ఎస్పీ నేరుగా ఫిర్యదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఏపీలో పర్యటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూ.300గా టిక్కెట్ ధరను నిర్ణయించారు. జల విన్యాసాలపై అసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్‌లో మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు పారా గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు.
ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 170 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను తొలగించారు. ఎంతోకాలంగా సేవలందిస్తూ వచ్చిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే కోర్టు తమను తొలగించిందని వారు పేర్కొన్నారు.
చీడికాడకు చెందిన వేచలపు మణికంఠ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ చెప్పారు. మణికంఠ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఎవరో అవమానించడంతో ఈనెల 11న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
భీమిలి పరిధిలో మంగమారిపేట తీరానికి గత మూడు రోజులుగా తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. శనివారం రాత్రి 10 తాబేళ్ల మృత కళేబరాలు కొట్టుకురాగా, 11వ తేదీన నాలుగు, 12న రెండు కొట్టుకువచ్చాయి. అవి గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు వస్తున్న సమయంలో శ్వాస అందక ఎక్కువ శాతం మృతి చెందుతున్నాయని జువాలజీ నిపుణులు తెలిపారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చేశాడా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ శనివారం ‘X’ ద్వారా స్పందించారు. మీ పోలీసులు చేసిన తప్పును సమర్థించ వద్దని బొలిశెట్టి కౌంటర్ ఇచ్చారు. తొక్కిసలాటలో రేవతి చనిపోతే మీ పోలీసులు అల్లు అర్జున్‌పై పెట్టిన సెక్షన్లు ఏమిటని సీఎంను ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.