India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒప్పంద ప్రాతిపదికపై పని చేస్తున్న అధ్యాపకులు సర్వీస్ రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవాలని వి.ఎస్.కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐవి జయబాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నగరం జోన్-1,2 పరిధిలో 174 పోస్టులకు రెన్యువల్ చేస్తారని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో 2024 మార్చి 31 నాటికి కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు.
విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో గోదావరి టైటాన్స్ బెజవాడ టైగర్స్ జట్లు శనివారం తలపడ్డాయి. ఒక్క పరుగు తేడాతో గోదావరి టైటాన్స్ విజయం సాధించింది. టాస్ గెలిచి బెజవాడ టైగర్స్ బౌలింగ్ ఎంచుకుంది. గోదావరి టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 225 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బెజవాడ టైగర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
జీకేవీధి మండలం వంచుల పంచాయతీ సిరిబాల గ్రామానికి చెందిన జోరంగి టైసన్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వీధి దీపాలు అమర్చేందుకు శనివారం విద్యుత్ స్తంబం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆర్వీ నగర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
జీకేవీధి మండలం వంచుల పంచాయతీ సిరిబాల గ్రామానికి చెందిన జోరంగి టైసన్ అనే యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వీధి దీపాలు అమర్చేందుకు శనివారం విద్యుత్ స్తంబం ఎక్కాడు. ఈక్రమంలో విద్యుత్ వైర్ తగిలి షాక్‌కు గురై కింద పడ్డాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆర్వీ నగర్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
పాడేరులో జరిగే మోదకొండమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి తెలుగు పాఠ్యాంశంలో చేర్చింది. ప్రతి ఏటా మే నెలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 2014లో దీనిని రాష్ట్ర జాతరగా గుర్తించింది. ప్రభుత్వం మోదకొండమ్మ జాతరను పదో తరగతి పాఠ్యాంశంలో పెట్టడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చింతపల్లిలో ఓ పార్టీకి చెందిన నేత బైక్‌ను దొంగలించి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్ఐ అరుణ్ తెలిపారు. నిందితుడు షేక్ మీరా ఇటీవలె స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని చేపట్టారు. ఎన్నికల తర్వాత ఈ నామినేటెడ్ పోస్టులు రద్దు కావడంతో ఆయన దొంగతనాల బాట పట్టారు. ఈ క్రమంలో శుక్రవారం చింతపల్లిలో బైక్‌ను దొంగలించి విక్రయిస్తుండగా పట్టుకున్నామని ఎస్ఐ తెలిపారు.
ఎలమంచిలిలోని నాగేంద్ర కాలనికి చెందిన లక్ష్మణ్ రావు(40)రెండు రోజుల క్రితం స్థానిక మురికికాలువలో ప్రమాదవశాత్తు పడిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం నీటి ప్రవాహం తగ్గటంతో కాలువలో ఆయన మృతదేహం లభ్యమైనట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ చెల్లారావు పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య లక్ష్మి, ఓ కుమారుడు ఉన్నాడు.
వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో కె.కె.లైనులో భద్రతకు సంబంధించి ఆధునీకరణ పనులు జరుగుతున్న కారణంగా విశాఖ-కిరండూల్-విశాఖ రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. 8న విశాఖ-కిరండూల్, 9న కిరండూల్-విశాఖ రైలును రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం పాడేరు మండలంలోని 75 స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రూ.3 కోట్ల ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ చెక్కు రూపంలో అందజేశారు. ఆర్థిక సాయాన్ని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. వారపు సంతల్లో కూరగాయలు, బట్టల వ్యాపారం చేసుకుంటామని స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు.
ఈనెల 8న ఇసుక విక్రయాలు ప్రారంభించాలని కలెక్టర్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చింతూరు డివిజన్ గుండాల-1 రీచ్‌లో 87,800 టన్నులు, గుండాల-2 రీచ్‌లో 79,026 టన్నుల ఇసుక అందుబాటులో ఉందన్నారు. సీనరేజ్ టన్నుకు రూ.88 మాత్రమేనని, మిగిలినవి లోడింగ్, పరిపాలనా ఛార్జీలు, జీఎస్టీ ఛార్జీలు నిబంధనల మేరకు చెల్లించాలన్నారు.
Sorry, no posts matched your criteria.