India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వ్యవసాయ కూలీ స్నానం కోసం చెరువులో దిగి ఊబిలో కూరుకుపోయి శుక్రవారం మృతి చెందారు. నక్కపల్లి మండలం ఎన్.నరసాపురానికి చెందిన బాల సత్తిబాబు(56) ఉపమాక గ్రామానికి వ్యవసాయ పనులకు వెళ్లారు. పని ముగించుకుని వచ్చే సమయంలో పక్కనే ఉన్న చెరువులో స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఊబిలో కూరుకుపోయారు. గమనించిన తోటి కూలీలు బయటికి తీసి చూసేసరికి అప్పటికే మృతిచెందారు. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అగ్నివీర్ వాయు స్కీంలో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరేందుకు అవివాహితులైన పురుష, స్త్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కే.శాంతి తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 28వ తేదీ రాత్రి 11 గంటల వరకు https://agnipathvayu.cdac.inలో అర్హులైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
పాడేరు: కేంద్ర ప్రభుత్వం అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తులు చేసుకోవాలని అల్లూరి జిల్లా క్రీడాభివృద్ది అధికారి జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారు ఈ దరఖాస్తులకు అర్హులన్నారు. అర్హత గల క్రీడాకారులు ఆగష్టు 1వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని, విజయవాడలోని క్రీడా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
కల్కి సినిమాలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి వాహనాన్ని విశాఖలో సందర్శకులకు అందుబాటులో ఉంచారు. శుక్రవారం విశాఖ వ్యాలీ స్కూల్ ప్రాంగణంలో దీన్ని ఉంచారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వాహనం వద్ద నిలుచుని ఫొటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కల్కి సినిమాలో ఉపయోగించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనాన్ని దేశంలోని పలు ప్రాంతాల్లో నిర్వాహకులు సందర్శనకు వీలుగా ఉంచుతున్నారు.
గ్రామ సచివాలయానికి సంబంధించిన సేవల్లో గత వారం రోజులుగా జాప్యం జరుగుతోందని లబ్ధిదారులు అంటున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ వివిధ సర్టిఫికెట్ల జారీ, దరఖాస్తులు చేసుకునే ప్రక్రియలు సిబ్బంది నిలిపి వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అదే సమయంలో భూములకు సంబంధించిన మ్యుటేషన్ సంబంధించిన పనులు కూడా జరగడం లేదని సమాచారం.
ప్రతిష్ఠాత్మకమైన కొచ్చిన్ పోర్టు అథారిటీతో రూ. 156.50 కోట్ల విలువైన డ్రెడ్జింగ్ ఒప్పందం కుదిరినట్లు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఛైర్మెన్ అంగముత్తు తెలిపారు. డ్రెడ్జింగ్ పరిశ్రమల్లో డీసీఐ అగ్రగామిగా ఉందన్నారు. భారీస్థాయి డ్రెడ్జింగ్ ప్రాజెక్టులను అమలు చేయడంలో మంచి రికార్డు ఉందని వెల్లడించారు. ఈ ఒప్పందం డీసీఐ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నుంచి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్.చంద్రకళ తెలిపారు. ఆన్లైన్లో అర్హతలు, వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు గుజరాత్‌లోని జామ్‌నగర్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి గ్రీన్ వింగ్ మకావ్, స్క్విరెల్ మంకీస్ తదితర వాటిని జంతువులు వచ్చాయి. గురువారం సాయంత్రం 3 గంటల సమయంలో ఇవి విశాఖకు చేరుకున్నాయి. జంతువులను పరస్పరం మార్చుకునే విధానంలో ఇక్కడకు జంతువులను తీసుకువచ్చారు. కొత్త జంతువులను కొద్దికాలం క్వారంటైన్ అనంతరం సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు.
యూపీఎస్సీ ఈ నెల 7న నిర్వహించబోతున్న ఈపిఎఫ్ఓ, ఈఎస్ఐసి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని డీఆర్ఓ కె.మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. యూపీఎస్సి నియమించిన పరిశీలకులు విశాఖలో పరీక్షా కేంద్రాలను ఈనెల 6న పరిశీలిస్తారన్నారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా అధికారులు, సూపర్ వైజర్లు పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విశాఖ కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
సింహాచల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హారేంధిర ప్రసాద్ గురువారం పర్యవేక్షించారు. ఈనెల 20న గిరిప్రదక్షిణ జరగనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆరా తీశారు. సింహాచలం తొలి పావంచ వద్ద అధికారులతో మాట్లాడారు. పర్యటనలో ఆయన వెంట జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.