India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్రంలో పలువురిపై PD యాక్ట్ అమలు చేస్తూ స్టేట్ గవర్నమెంట్ ఆదివారం రాత్రి GO విడుదల చేసింది. వారిలో విశాఖకు చెందిన రావాడ జగదీశ్, రావాడ ఉదయ్ భాస్కర్, ఈతలపాక రాజ్ కుమార్, కొలగాన పవన్ రాజ్ కుమార్, నక్కా లోకేశ్, కాండ్రేగుల లోక్ నాథ్ వీర సాయి శ్రీనివాస్ ఉన్నారు. ఎయిర్ పోర్టు, పీఎం పాలెం, ఆరిలోవ, దువ్వాడ పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగించారు.

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కనిమెల్ల జంక్షన్ సమీపంలో హైవేపై ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పీఎం పాలెంకు చెందిన సౌజన్య అనే ఉపాధ్యాయురాలు మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. సౌజన్య భోగాపురం మండలం పోలిపల్లి ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని షాలిమార్ ప్రాంతంలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రచారం చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించారు.

జీవిఎంసీలో టీడీఆర్‌ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో వందల కోట్లు అక్రమ టీడీఆర్‌లు పొందిన వారు.. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కూటమి నేతలను ప్రలోభాలు పెట్టి.. జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎన్నికల సందర్భంగా GVMCలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 29 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

భువనేశ్వర్‌లో జరుగుతున్న రైల్వే 69వ వార్షికోత్సవాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్‌కు విశిష్ట రైలు సేవా పురస్కారం లభించింది. ఈమేరకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ పంక్వాల్ ఈ అవార్డును అందించారు. ప్రయాణికులకు అందిస్తున్న మెరుగైన సేవలకు వాల్తేర్ డివిజన్‌కు మరో ఆరు ప్రత్యేక పురస్కారాలు దక్కాయి. అత్యుత్తమ పని తీరు కనబర్చిన 49 మంది సిబ్బందికి పురస్కారాలు అందించారు.

గాజువాకలో విజయనగరం యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫార్మాసిటీలో పనిచేస్తున్న భాస్కరరావు శ్రీనగర్లో అద్దెకు ఉంటున్నాడు. పక్కింట్లో ఉన్న అమ్మాయి స్నానం చేస్తుండగా వీడియో తీశాడని ఆమె బందువులు దాడి చేసి ఇంట్లో బంధించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్టి చంపారని యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాజువాక పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెందుర్తి నుంచి ఆనందపురం వైపు వస్తున్న బైక్ లారీని ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

విశాఖ సీపీ ఆదేశాలు మేరకు పెద్దవాల్తేర్‌లో శనివారం టాస్క్ ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు రైడ్ నిర్వహించారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాలో ప్రధాన నిందితుని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ ముద్దాయి ద్వారా బెట్టింగ్ బుకీల సమాచారం వెలుగులోకి వచ్చిందన్నారు. త్వరలో వారిని పట్టుకుని అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ బెట్టింగ్ ద్వారా 178 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.

శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయుల నియోజకవర్గం ఎన్నికల నేపథ్యంలో జనవరి 29నుంచి మార్చ్ 8వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ శనివారం తెలిపారు. ఈ విషయమై విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వం కార్యాలయలలో జరిగే పీజీఆర్ఎస్ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు.
Sorry, no posts matched your criteria.