Visakhapatnam

News October 5, 2024

బుచ్చియ్యపేట: కరెంట్ షాక్.. బాలుడు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుచ్చియ్యపేట మండలంలోని పి.భీమవరంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేపాడ అప్పారావు కుమారుడు భువన్ శంకర్ శనివారం పొలంలోకి వెళ్లాడు. అక్కడ గెడ్డ దాటుతుండగా అప్పటికే నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చోడవరం ఆసుపత్రికి  తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News October 5, 2024

విశాఖ: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి

image

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుంగనూరులో అదృశ్యమైన బాలిక మృతిచెందిందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. కాలిన కాగితాలకున్న విలువ ఆడబిడ్డల ప్రాణాలకు లేదని విమర్శించారు. బాలిక మృతి సంఘటనను దర్యాప్తు లేకుండానే నీరు గార్చాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిపారు.

News October 5, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

News October 5, 2024

విశాఖలో అర్ధరాత్రి దారుణ హత్య

image

విశాఖలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. మల్కాపురంలోని యువకుడు వాసుకు తన సోదరులతో వివాదం చోటు చేసుకోగా ఈ ఘటన జరిగింది. వాసు తలపై రాడ్డుతో కొట్టడంతో కుటుంబీకులు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 4, 2024

ఏయూకి ఐఎస్ఓ సర్టిఫికేషన్

image

ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్ 2027 వరకు ఈ గుర్తింపు అందించింది. ఇటీవల ఏయూను సందర్శించిన ఐఎస్ఓ నిపుణుల బృందం ఏయూలో వివిధ అంశాలను పరిశీలించి ఈ గుర్తింపును కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన ధ్రువపత్రాలు ఏయూ ఐక్యూ ఏసీ సమన్వయకర్త ఆచార్య జి.గిరిజా శంకర్ స్వయంగా ఏయూ వీసీ ఆచార్య జి.శశిభూషణ రావుకు కార్యాలయంలో శుక్రవారం అందజేశారు.

News October 4, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై వైఎస్ షర్మిల కీలక ప్రకటన

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో త్వరలో సీఎంను కలుస్తామన్నారు. రాహుల్ గాంధీని విమర్శించే అర్హత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేదన్నారు.
.

News October 4, 2024

విశాఖలో రెండో రోజు టెట్ పరీక్షకు 1662 మంది హాజరు

image

జిల్లాలో నిర్వహిస్తున్న టెట్ పరీక్షకు రెండో రోజు శుక్రవారం 1662 మంది హాజరైనట్లు డీఈవో చంద్రకళ వెల్లడించారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో రోజు 1852 మంది విద్యార్థుల పరీక్ష రాయాల్సి ఉందన్నారు. తాను ఒక పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేయగా ఫ్లయింగ్ స్క్వేర్ మూడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిందని వివరించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అవి వెల్లడించారు.

News October 4, 2024

మిస్సెస్ ఇండియా-2024గా విశాఖ మహిళ

image

మలేషియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిస్సెస్ ఇండియా-2024 విజేతగా విశాఖకు చెందిన హేమలతా రెడ్డి నిలిచారు. 300 మంది పాల్గొన్న ఈ పోటీల్లో విజేతగా నిలిచి విశాఖ ఖ్యాతిని పెంచారు. ఆమె ఇంతకముందు యాంకర్‌గా పనిచేశారు. త్వరలో పారిస్ ఫ్యాషన్ వీక్‌కి కూడా వెళ్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హేమలతా రెడ్డిని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, పలువురు పాత్రికేయులు సత్కరించారు.

News October 4, 2024

యలమంచిలి: రూ.100 కోసం బ్లేడ్‌తో దాడి

image

అప్పుగా ఇచ్చిన రూ.100 కోసం ఓ వ్యక్తిపై పదునైన బ్లేడ్‌తో దాడి చేశాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం కొత్తలిలో ఈ దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నూకిరెడ్డి శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన బంగారి వెంకటరమణకు రూ.100 అప్పుగా ఇచ్చాడు. డబ్బు ఇవ్వాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తర్వాత రామాలయం వద్ద కూర్చున్న శ్రీనివాస్‌పై వెంకటరమణ బ్లేడ్‌తో దాడి చేశాడు.

News October 4, 2024

విశాఖ: ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలు

image

టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80 కాగా, రైతు బజార్లలో రూ.66కి విక్రయిస్తున్నారు. రాయితీపై టమాటాను విక్రయించాలని విశాఖ నగర ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వారం రోజుల కిందట కిలో టమాటా ధర రూ.66 ఉండగా అదనంగా రూ.22 పెరిగింది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు టమాటా జోలికి వెళ్లటం లేదు. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.