Visakhapatnam

News July 3, 2024

విశాఖ: పలు రైళ్లకు అదనపు బోగీలు జత

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలు రైళ్లకు అదనపు బోగీలను జత చేసి నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. విశాఖ-సాయినగర్ శిర్డీ(18503) రైలుకు ఈనెల 4న, సాయినగర్ శిర్డీ-విశాఖ(18504) రైలుకు ఈనెల 5న అదనంగా ఒక జనరల్ బోగీ, అదేవిధంగా విశాఖ-చెన్నై సెంట్రల్(22869) రైలుకు ఈనెల 8న, చెన్నై సెంట్రల్-విశాఖ(22870) రైలుకు ఈనెల 9న అదనంగా ఒక జనరల్ బోగీని జత చేస్తారని పేర్కొన్నారు.

News July 3, 2024

విశాఖ: సీబీసీఎస్సీ స్థలంలో తవ్వకాలపై గనుల శాఖ ఆరా

image

సిరిపురం కూడలి సమీపంలో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు చెందిన ఎంవీవీ పీక్ ప్రాజెక్టులో జరిపిన తవ్వకాలపై గనుల శాఖ ఆరా తీసింది. అనుమతులు పొందిన ప్రాంతంలో ప్రత్యేక పరికరాలతో సర్వే నిర్వహించి అనుమతులు పొందిన దాని కంటే ఎక్కువగా తవ్వకాలు జరిపినట్లు తేల్చారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని సంబంధిత ప్రాజెక్టు ప్రతినిధులకు నోటీసులు జారీ చేశారు. కాగా కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు.

News July 3, 2024

మాతృ భాషా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి: ఐటీడీఏ పీవో

image

అల్లూరి మన్యంలోని మారుమూల గిరిజన గ్రామాల పాఠశాలల్లో బోధించే ఆదివాసీ మాతృ భాషా వాలంటీర్లు నేటి(బుధవారం)నుంచి విధుల్లో చేరాలని ఐటీడీఏ పీవో వీ.అభిషేక్ సూచించారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయని తెలిపారు. మాతృ భాషా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఎంఈవోలకు పీవో మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.

News July 2, 2024

రాష్ట్రపతిని కలిసిన అరకు ఎంపీ తనూజారాణి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మంగళవారం అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతంలో నెలకొన్న సమస్యలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. జీవో నంబర్-3ని అమలు చేయాలని కోరారు. గిరిజన కాఫీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, గిరిజన కాఫీ సొసైటీ స్థాపించాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ తెలిపారు.

News July 2, 2024

అల్లూరి, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లుగా భార్యాభర్తలు

image

అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా విజయకృష్ణన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈమె ఇటీవల అల్లూరు జిల్లా కలెక్టర్‌గా నియమితులైన దినేశ్ కుమార్ భార్య కావడం విశేషం. అల్లూరి జిల్లాలో దినేశ్ కుమార్, అనకాపల్లి జిల్లాలో ఆయన భార్య విజయకృష్ణన్ సేవలు అందించనున్నారు. గతంలో వీరిరువురూ ప్రకాశం, బాపట్ల జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేశారు.

News July 2, 2024

వైజాగ్ వారియర్స్‌కు మరో విజయం

image

APLలో వైజాగ్ వారియర్స్ ఘన విజయం సాధించింది. విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో రాయలసీమ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటి బ్యాటింగ్ చేసిన రాయలసీమ కింగ్స్ 20 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన వైజాగ్ వారియర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

News July 2, 2024

విశాఖ కలెక్టర్‌గా హరీంద్ర ప్రసాద్

image

విశాఖ కలెక్టర్‌గా హరీంద్ర ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌‌గా ఉన్న డా.ఎ.మల్లికార్జున వారం క్రితం బదిలీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తాత్కాలికంగా కలెక్టర్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పార్వతీపురం మన్యం కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్, అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా కె.విజయ నియమితులయ్యారు.

News July 2, 2024

విశాఖ నుంచి పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

image

పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ఈనెల 6, 14, 16 తేదీల్లో విశాఖ-పూరీ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖలో బయలుదేరి అదే రోజు రాత్రి పూరీ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో పూరీ-విశాఖ స్పెషల్ ఈనెల 8, 16, 18 తేదీల్లో అర్ధరాత్రి 1.45 గంటలకు బయలుదేరి అదే రోజు ఉదయం పదిన్నర గంటలకు విశాఖ చేరుకుంటుందని తెలిపారు.

News July 2, 2024

శారదా పీఠానికి కేటాయించిన భూములు పరిశీలన

image

విశాఖ శారదా పీఠానికి కేటాయించిన కొత్తవలసలోని 15 ఎకరాలకు పైగా కొండను సాధు పరిషత్ స్వామీజీలు, హిందూ సంస్థల ప్రతినిధులు పరిశీలించారు. కాగా ఆ భూకేటాయింపులను తమ వాణిజ్య అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతివ్వాలని గతంలో శారదాపీఠం ప్రభుత్వాన్ని కోరింది. దీంతో కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సాధు పరిషత్ స్వామీజీలు, హిందూ ధార్మిక సంస్థలు.. శ్రీనివాసానంద సరస్వతి నేతృత్వంలో ఈ రోజు సందర్శించారు.

News July 2, 2024

AU: బి-ఫార్మసీ, ఫార్మా-డి పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బి-ఫార్మసీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలతోపాటు ఫార్మా-డి 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఫలితాలను వెబ్ సైట్ నుంచి నేరుగా పొందవచ్చని సూచించారు.