Visakhapatnam

News May 2, 2024

అనకాపల్లి: రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ

image

అనకాపల్లి జిల్లాలో ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రవి సుభాశ్ ఆధ్వర్యంలో ఎన్నికల పరిశీలకులు దల్జీత్ సింగ్ మంగత్, రాకేశ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థులు, వారి ఏజెంట్లు హాజరయ్యారు. రెండో విడతలో కంప్యూటర్ ద్వారా ర్యాండమైజేషన్, బ్యాలెట్ యూనిట్ కంట్రోల్ వీవీ ప్యాట్లను అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు.

News May 1, 2024

కన్నబాబురాజు కాదు.. కన్నాలబాబు: పవన్ కళ్యాణ్

image

అచ్చుతాపురంలో ఎన్నికల ప్రచార సభలో కన్నబాబుపై పవన్‌ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు కాదు.. కన్నాలబాబు’ అని అన్నారు. కన్నబాబు లేఔట్ల కోసం చుట్టుపక్కల ఉన్న భూములను కబ్జా చేస్తున్నాడన్నారు. 22 ఏలో ఉన్న భూములు తన పేరు మీద మార్చుకుంటున్నారు అన్నారు. కన్నబాబు లాంటి వారు ఉంటే న్యాయం జరగదని, తను బాధ్యతగా ఉంటానని భరోసా కల్పించారు.

News May 1, 2024

డుంబ్రిగుడలో దారుణ హత్య

image

డుంబ్రిగుడలో దారుణ హత్య జరిగింది. నూతనంగా నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయంలో ప్లాస్టిక్ వినియోగ పరికరాలు సేకరించే  ఓ వ్యక్తి బుధవారం హత్యకు గురయ్యాడు. అరకు సీఐ రుద్రశేఖర్, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుడు ఎస్.కోట మండలం రాజిపేట గ్రామానికి చెందిన బత్తిన శివ శ్రీనివాస్‌గా గుర్తింమన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 1, 2024

ఉత్తరాంధ్రలో రెండు రోజుల పాటు బాలకృష్ణ పర్యటన

image

సినీ నటుడు, హిందూపరం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు విశాఖ చేరుకున్నారు. ఉత్తరాంధ్రలో రేపటి నుంచి రెండు రోజులపాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. రేపు విజయనగరం జిల్లాలో చీపురుపల్లి, విజయనగరం పట్టణంలో పర్యటిస్తారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు భీమిలిలోను, సాయంత్రం 6.45 గంటలకు వైజాగ్ రోడ్‌షోలో పాల్గొంటారు.

News May 1, 2024

అచ్యుతాపురం చేరుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో అచ్యుతాపురం చేరుకున్నారు. ఎలమంచిలి కూటమి అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మద్ధతుగా సాయంత్రం 3 గంటలకు అచ్యుతాపురంలో జరిగే సభలో పాల్గొననున్నారు. అక్కడ నుంచి పెందుర్తి జంక్షన్‌లో కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

News May 1, 2024

చింతపల్లిలో రూ.5.5కోట్ల లిక్విడ్ గంజాయి స్వాధీనం

image

చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీలు గంజాయి లిక్విడ్‌ను స్వాధీనం చేసుకొని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివ కిషోర్ బుధవారం తెలిపారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని, తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ సుమారు రూ.5.5 కోట్లు ఉంటుందని, వేరే రాష్ట్రాలలో విలువ మరింత ఎక్కువ ఉంటుందన్నారు.

News May 1, 2024

పెందుర్తిలో పవన్.. పాయకరావుపేటలో జగన్

image

ఉమ్మడి విశాఖలో నేడు జనసేన, వైసీపీ అధినేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు పెందుర్తి నాలుగు రోడ్ల కూడలిలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సీఎం జగన్ పాయకరావుపేటలోని సూర్యా మహాల్ సెంటర్‌లో సాయంత్రం 3 గంటలకు జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పొలిటికల్ హీట్ నెలకొంది. ఈ నేపథ్యంలో జనసమీకరణపై ఆయా పార్టీల నాయకులు దృష్టి పెట్టారు.

News May 1, 2024

విశాఖ ఎంపీ స్థానానికి మూడు ఈవీఎంలు

image

విశాఖ లోక్‌సభ ఎన్నికల బరిలో 33 మంది అభ్యర్థులు నిలిచారు. 2019 ఎన్నికల్లో కేవలం 14 మంది పోటీ చేశారు. 39 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఆరుగురివి తిరస్కరణకు గురయ్యాయి. 33 మంది మిగలగా, ఒక్కరూ ఉపసంహరించుకోలేదు. నోటాతో కలిపితే 34 మందితో బ్యాలెట్ పేపరు రానుంది. ఒక బ్యాలెట్ యూనిట్(ఈవీఎం)లో 16 పేర్లకు మాత్రమే అవకాశం ఉంది. ఈ లెక్కన 34 పేర్లకు 3 ఈవీఎంలు వినియోగించాల్సి ఉంది.

News May 1, 2024

విశాఖ జిల్లాలో మహిళల ప్రాతినిధ్యం 14 శాతం మాత్రమే

image

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలుస్తున్న మహిళల శాతం విశాఖ జిల్లాలో తక్కువగా ఉంది. విశాఖ లోక్ సభ స్థానానికి 33 మంది, ఏడు అసెంబ్లీ స్థానాలకు 101 మంది మొత్తం 134 మంది ఎన్నికల బరిలో ఉండగా, వీరిలో 20 మంది మహిళలు ఉన్నారని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. వీరి శాతం పరిశీలిస్తే కేవలం 14 % ఉంది. ఎన్నికల బరిలో నిలిచే వారి సంఖ్య తక్కువగా ఉంటే విజయం సాధించి చట్టసభల్లో అడుగిడే మహిళల సంఖ్య మరింత తక్కువ.

News May 1, 2024

సంబల్ పూర్-బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు

image

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. సంబల్ పూర్- ఎస్ఎంవీ బెంగళూరు (08321) ప్రత్యేక రైలు మే 9, 16 తేదీల్లో సాయంత్రం 6.45 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి మర్నాడు తెల్లవా రుజామున 4.55 గంటలకు దువ్వాడ వచ్చి.. అక్కడి నుండి 5 గంటలకు బెంగళూరుకు వెళుతుందన్నారు.