Visakhapatnam

News June 30, 2024

అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

image

భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

News June 30, 2024

విశాఖలో ప్రారంభమైన ఏపీఎల్ సీజన్-3  

image

విశాఖ వైయస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3 పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి‌ మండిపల్లి రాంప్రసాద్ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు సత్తా చాటి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణు కుమార్ రాజు, ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

News June 30, 2024

విశాఖ: Pic Of The Day

image

చింతపల్లి మండలంలోని కొత్తబంద గ్రామానికి సరైన రహదారి లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామంలోని బడి ఈడు పిల్లలు పక్క గ్రామమైన పొట్టిబంద ఎంపీపీ పాఠశాలలో చదువుతున్నారు. అయితే రహదారి సౌకర్యం లేకపోవడం, రెండు గ్రామాల మధ్యలో కొండవాగు ఉండడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి వాగుపై కర్రలతో తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు.

News June 30, 2024

బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి: మత్స్యకార జేఏసీ

image

మత్స్యకార సొసైటీలకు గతంలో వలే కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని మత్స్యకార జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల అమ్మోరయ్య, ప్రధాన కార్యదర్శి పిక్కి.కొండలరావు విజ్ఞప్తి చేశారు. ఏపీ మత్స్యకార ఎన్నికల అధికారికి వినతి పత్రం అందిస్తున్నట్లు నక్కపల్లిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. చేతులెత్తే పద్ధతి ద్వారా మత్స్యకారులు మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు తెలిపారు.

News June 30, 2024

అల్లూరి జిల్లా: భర్తకు మూడో పెళ్లి చేసిన భార్యలు

image

భర్తకు ఇద్దరు భార్యలు దగ్గరుండి ఈనెల 25న మూడో పెళ్లి చేశారు. అల్లూరి జిల్లా పెదబయలు మండలంలో ఈ తంతు జరిగింది. గ్రామానికి చెందిన పండన్న మొదటి భార్యకు పిల్లలు లేరని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 2007లో బాబు పుట్టాడు. మరో సంతానం కావాలంటూ భర్త ఇద్దరికీ చెప్పాడు. దీంతో ఇద్దరు భార్యలు కలిసి మూడో పెళ్లికి కార్డులు కొట్టించి, బ్యానర్లు కట్టించారు. ఈ నెల 25న అందరి సమక్షంలో అక్షింతలు వేసి పెళ్లి చేశారు.

News June 30, 2024

విశాఖ: అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు రూ.3.2 కోట్లు

image

టీడీపీ హయాంలో విశాఖ నగరంలో నిర్మించిన అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు జీవీఎంసీ చర్యలు చేపట్టింది. వాటి పునరుద్ధరణకు రూ.3.2 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఇంజినీరింగ్ అధికారులు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నారు. ఆరేళ్ల క్రితం నగరంలో 25 ప్రాంతాలలో అన్న క్యాంటీన్లను జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ఒక్కొక్క భవన నిర్మాణానికి రూ.40 లక్షలు వెచ్చించింది.

News June 30, 2024

విశాఖ: రిమ్ పెక్ విన్యాసాల్లో ఐఎన్ఎస్ శివాలిక్

image

ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాదళ విన్యాసం రిమ్ ఆఫ్ ది పసిఫిక్(రిమ్ పెక్)లో పాల్గొనేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ శివాలిక్ హవాయిలోని పెరల్ హార్బర్‌కు చేరుకుంది. ఇండియా-జపాన్ మధ్య దైపాక్షిక వ్యాయామం జిమెక్స్-2024 పూర్తయిన తర్వాత ఐఎన్ఎస్ శివాలిక్ పెరల్ హార్బర్‌కు చేరుకున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. ఈనెల 27న ప్రారంభమైన విన్యాసాలు జాలై 7 వరకు కొనసాగుతాయని విశాఖలో నేవీ అధికారులు తెలిపారు.

News June 30, 2024

దంతెవాడ-కిరండోల్ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తి

image

వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలోని కెకె లైన్‌లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సువోమోయ్ మిత్ర భద్రతా పరమైన తనిఖీలను శనివారం నిర్వహించారు. దంతేవాడ-కములూర్ సెక్షన్‌లో డబ్లింగ్ పనులు పరిశీలించారు. మోటార్ ట్రాలీపై వెళ్లి పట్టాలు, కొత్త సిగ్నలింగ్ వ్యవస్థలు, వంతెనలను పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు. వేగానికి సంబంధించి ట్రైల్ రన్ నిర్వహించారు. దంతెవాడ-కిరండోల్ మార్గంలో డబ్లింగ్ పనులు పూర్తయినట్లు తెలిపారు.

News June 30, 2024

అరకు ఎమ్మెల్యేగా విజయం.. జడ్పీటీసీకి రాజీనామా

image

హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం శనివారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను శనివారం విశాఖపట్నం ఇన్‌ఛార్జ్ కలెక్టర్ కే.మయూర్ అశోక్ ‌కు అందజేసినట్లు మీడియాకు తెలిపారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అరకు ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హుకుంపేట జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు.

News June 29, 2024

పాడేరు: ఎన్నికల ఖర్చును రెండు రోజుల్లో సమర్పించాలి

image

సార్వత్రిక ఎన్నికలలో పోటీచేసిన అభ్యర్థులు ఖర్చుల వివరాలను రెండు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల ఏజెంట్లు, ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియలో చేసిన ఖర్చులను సంబంధిత రికార్డులలో నమోదు చేసి నియోజకవర్గం వ్యయ పరిశీలకులతో రికన్సిలేషన్ చేసి సమర్పించాలన్నారు. వాటిని ఎలక్షన్ కమిషన్‌కు పంపిస్తామన్నారు.