India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాజువాక జింక్ మైదానంలో ఈనెల 9 నుంచి 11 వరకు నిర్వహించే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్‌కు విశాఖ జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేసినట్లు నిర్వాహకులు మణికంఠ, హేమ సుందర్ తెలిపారు. మొట్టమొదటిసారిగా జరిగే దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంటులో 10 జిల్లాల నుంచి పది టీములు పాల్గొంటున్నట్లు వెల్లడించారు.
విశాఖ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరగాల్సిన ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 2 రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత కొన్ని రోజులుగా విశాఖలో మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే.
సింహాద్రి అప్పన్న స్వర్ణపుష్పార్చన ఆదివారం వైభవంగా జరిగింది. వేదపండితుల వేదమంత్రాల,నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ దేవి,భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధిష్ఠింపజేసి వేద మంత్రాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణపుష్పార్చన, సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.
విశాఖలో ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బస్సు ప్రయాణికులపై యాసిడ్ పోయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అనుమానిత వ్యక్తి ఫొటోలను విశాఖ నగర పోలీసులు విడుదల చేశారు. పైఫోటోలోని వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిస్తే కంచరపాలెం సీఐ(9014214742)కి, 112కు కాల్ చేసి చెప్పాలని కోరారు. అనుమానితుడి గురించి చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని.. భయపడాల్సిన అవసరం లేదన్నారు.
ఏయూ డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్ విద్యార్థులు విందెల గీత భార్గవి, కెంబూరి నైమిశలు ఇటీవల వెలువడిన ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి ఫలితాలలో విజయం సాధించి చిన్న వయస్సులో జడ్జిలుగా ఎంపికయ్యారు. ఈ విజయంపై కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె. సీతామాణిక్యం హర్షం వ్యక్తం చేశారు. గీత భార్గవి, నైమిశలు మరిన్ని ఉన్నత విజయాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో అల్లిపురంలో శనివారం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వైజాగ్ మీడియా క్రికెట్ టోర్నీ పోస్టర్ ఆవిష్కరించారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ పోటీలు జర్నలిస్టులకు ఆటవిడుపుగా పేర్కొన్నారు. డిసెంబర్ 16 నుంచి 22 వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పోటీలు జరుగుతాయని శ్రీనుబాబు తెలిపారు.
విశాఖలోని వడ్లపూడికి చెందిన జి.తులసి అనే మహిళను నగర పోలీస్ కమిషనర్ డా.శంఖబ్రత బాగ్చి శుక్రవారం సత్కరించారు. తులసి తన ఇంటికి సమీపంలో ఐదేళ్ల బాలిక ఒంటరిగా తిరగడం గమనించి, బాధ్యతగా డయల్ 112కి కాల్ చేశారు. వెంటనే పోలీసులు బాలిక కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని వారికి అప్పగించారు. దీంతో కమిషనర్ ఆమెను శుక్రవారం అభినందించి సత్కరించారు.
విశాఖపట్నం లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ టోర్నమెంట్లో శుక్రవారం ఒడిస్సా, పాండిచ్చేరి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వాతావరణం సహకరించకపోవడం వలన 20 ఓవర్ల మ్యాచ్‌ను 6 ఓవర్లకు కుదించారు. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన పాండిచ్చేరి 6 ఓవర్లలో 91/2 చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఒడిశా 6 ఓవర్లలో 75/3 పరుగులు చేసింది. 35 పరుగులు చేసిన కె.బి.అరుణ్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ మ్యాచ్‌గా నిలిచాడు.
పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై షీలా నగర్లో చికిత్స పొందుతున్న కార్మికులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి శుక్రవారం పరామర్శించారు. ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి ఆరా తీశారు. భద్రత ప్రమాణాలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.