India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయ్యన్నపాత్రుడు తొలిసారిగా 29న విశాఖ వస్తున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఉదయం 9 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.15 గంటలకు హోటల్ దసపల్లాకు వెళ్లి సందర్శకులను కలుస్తారు. అక్కడే లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 2.15 గంటలకు అనకాపల్లి నూకాంబికను దర్శించుకుంటారు. సాయంత్రం ఐదు గంటలకు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.
విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్‌కు బదిలీ అయింది. ఆయనను సీఐడీ అడిషనల్ డీజీపీగా బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సీపీ పోలీస్ కమిషనర్‌గా శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చీని ప్రభుత్వం నియమించింది. ఇటీవల విశాఖ కలెక్టర్‌గా పని చేసిన మల్లికార్జునను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
ముంపు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. భారీవర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో శుక్రవారం వీసీ నిర్వహించారు. ప్రస్తుతం అల్లూరి జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. వరద ముంపు గ్రామాల్లో జిల్లా, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను వరదల పట్ల చైతన్యం చేస్తున్నామన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు దంపతులు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేస్తూ పని చేయాలన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువస్తామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. సీఎం చంద్రబాబు ఫోటోను వైస్ ఛాన్సలర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేయకపోవడంపై గంటా ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి పనితీరు పట్ల ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయూను భ్రష్టుపట్టించినట్లు విమర్శించారు.
అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాషకు గుర్తింపు వచ్చేలా కృషి చేస్తున్నామని విశ్వహిందూ పరిషత్ ఛైర్మన్, పద్మవిభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఏయూ హిందీ విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ హిందీ అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందేలా కృషి చేస్తున్నారని కొనియాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని కోరారు.
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్‌లు రాజీనామా చేశారు. ఇప్పటికే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ఉండేవారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే AU వీసీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా.. ఆయన రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్‌గా కిషోర్ బాబు బాధ్యతలు స్వీకరించారు.
విశాఖ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా న్యాయమూర్తి ఎ.గిరిధర్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులు, సివిల్, బౌన్స్, బ్యాంకింగ్, మోటర్ ప్రమాదాల నష్టపరిహారం కేసులు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వరకట్న వేధింపులతో వివాహిత మృతికి కారకులైన ముగ్గురిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లికి చెందిన ఎం. పద్మిని (32) కి గాజువాకకు చెందిన సోమేశ్‌తో వివాహం అయ్యింది. అదనపు కట్నం కోసం భర్త సోమేశ్, అత్త అప్పలనర్స, మరిది శివ కలిసి తమ కుమార్తెను వేధించి పురుగుమందు తాగించి చంపేశారని పద్మిని తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.