India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్.రాయవరం మండలం పెద్ద ఉప్పలం గ్రామంలో హోం మంత్రి అనిత ఫొటో ఉన్న ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. విత్తనాల పంపిణీ కార్యక్రమానికి హోంమంత్రి అనిత హాజరవ్వగా టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాతబ్బాయి గ్రామ సచివాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఆయన ఫొటోను చించేయడంతో తాతబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
త్వరలోనే నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో టికెట్ ఆశించిన భంగపడ్డ పలువురు నేతలకు సైతం అధిష్ఠానం నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎవరికి ఏ నామినేటెడ్ పదవి వస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చెయ్యండి.
మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయిన కుంట ఏరియా కమిటీ సభ్యురాలు సోడి సుక్కి, మడివి గంగి జనజీవన స్రవంతిలో కలిశారని అల్లూరి జిల్లా ఎస్పీ తూహీన్ సిన్హా గురువారం తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వీరు మావోయిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని అన్నారు. అయితే మావోయిస్టు పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గడం, పార్టీలో ఆదివాసేతర నాయకుల వివక్షత వల్ల లొంగిపోయారని తెలిపారు.
విశాఖపట్నంలో బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షను స్పెషల్ పోక్సో కోర్ట్ న్యాయమూర్తి విధించారు. 2021 సంవత్సరంలో ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి అప్పన్న అఘాయిత్యం చేశాడు. నిందితుడికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ.. బాలికకు రూ.3లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
మద్దిలపాలెం వి.ఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో రేపు, ఎల్లుండి(ఈనెల 28,29) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఐ.విజయ్ బాబు తెలిపారు. వైజాగ్ టెక్ మహీంద్రాలో 328 బీపీఓ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. డిగ్రీ పాస్/ఫెయిలైన నిరుద్యోగ అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గలవారు ఆరోజు ఉదయం 9:30 గంటలకు సర్టిఫికేట్స్, రెజ్యూమ్‌తో హాజరవ్వాలని సూచించారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు శుక్రవారం లాంఛనంగా అధ్యక్ష బాధ్యతల స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు, క్యాబినెట్ మంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ శ్రేణులు తెలిపాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తనను ఆర్థిక నష్టానికి గురి చేసిందని కార్మికుడు ఎస్.రామారావు కేంద్ర కార్మిక ఉపాధి శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కార్మిక శాఖ ప్రాంతీయ కమిషనర్ ఉక్కు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 5న రికార్డులతో కార్యాలయంలో హాజరుకావాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోరడం అర్థరహితమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. శాసనసభలో పదవ వంతు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుందన్నారు. దీనిపై లేనిపోని రాద్ధాంతాలు సృష్టించడం సరికాదన్నారు.
ప్రయాణికుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని డిబ్రూఘర్-కన్యాకుమారి-డిబ్రూఘర్ 22504/22503 వివేక్ ఎక్స్ ప్రెస్‌ను ప్రతిరోజూ నడపనున్నట్లు వాల్తేర్ డీసీఎం కే. సందీప్ తెలిపారు. ఇప్పటి వరకు ఈ రైలు వారానికి ఐదు రోజులు నడిచేది. జులై 8 నుంచి డిబ్రూఘర్- కన్యాకుమారి (22504), జులై 12 నుంచి కన్యాకుమారి – డిబ్రూఘర్ (22503) ప్రతిరోజు నడవనున్నాయి.
టీటీడీకి చెందిన రుషికొండ వద్దగల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జులై 1వ తేదీ నుంచి శ్రీవారి సేవలో భక్తులు పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. సుప్రభాత సేవకు రూ.100, పుష్పాలంకరణకు రూ.12,000 (నలుగురు కుటుంబ సభ్యులు) తోమాలసేవకు ఒక్కొక్కరికి రూ.200, సహస్రనామార్చనకు రూ.200 నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.