Visakhapatnam

News November 26, 2024

విశాఖ: పాఠశాలలో హోమో సెక్సువల్ వేధింపులు..!

image

విశాఖలోని నరవ గురుకుల పాఠశాలలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల అటెండర్ నీచంగా విద్యార్థులతో ప్రవర్తించాడని ఆరోపణలొస్తున్నాయి. అటెండర్ లోకేష్ విద్యార్థులను హోమో సెక్సువల్ వేధింపులకు గురిచేశారని విద్యార్థులు ఆరోపించారు. జరిగిన ఘటనపై విద్యార్థులు ప్రిన్సిపల్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసులకు సమాచారం అందడంతో దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

News November 26, 2024

కులశేఖర్ సొంతూరు సింహాచలమే..! 

image

పాటల రచయిత కులశేఖర్ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. 100 సినిమాలకు పైగా పాటలు రాసిన కులశేఖర్ సింహాచలంలోనే పుట్టి పెరిగారు. వైష్ణవ కుటుంబానికి చెందిన ఆయన తన తల్లిదండ్రులకు ఆరో సంతానం. ఓ దిన పత్రికలో కెరియర్ ప్రారంభించి.. సిరివెన్నెల సీతారామశాస్త్రి వద్ద పాటలు రాయడం నేర్చుకున్నారు. చిత్రం, జయం, నువ్వు నేను, సంతోషం వంటి చిత్రాలకు పాటలు రాశారు.

News November 26, 2024

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో దారుణ హత్య!

image

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో సినీ తరహాలో దారుణ హత్య జరిగింది. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తిని హత్య చేసి కాలికి బరువైన రాయి కట్టేసి సముద్రంలో దుండగులు విసిరేశారు. ఈ నేపథ్యంలో ఫిషింగ్ హార్బర్‌లో జెట్టి నంబర్ 10 వద్ద సముద్రంలో మృతదేహం తేలుతూ కనిపించడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News November 26, 2024

భారతదేశపు మొట్టమొదటి ఓడ విశాఖలోనే తయారీ

image

దేశంలోనే అతి పురాతన నౌకా నిర్మాణ కేంద్రం విశాఖలోనే ఉంది. భారత దేశపు మొట్ట మొదటి ఓడ అయిన ‘జల ఉష’ ఇక్కడే తయారయ్యింది. అప్పటి ప్రధాన మంత్రి జవాహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా ఈ ఓడ జలప్రవేశం చేసింది. సముద్రంలోకి చొచ్చుకొని ఉన్న కొండ ‘డాల్ఫిన్ నోస్’ అలల తాకిడిని తగ్గించి సహజ సిద్ధమైన నౌకాశ్రయానికి అనుకూలంగా ఉండడంతో దేశంలోనే అతి పెద్ద ఓడరేవుల జాబితాలో చేరింది.

News November 26, 2024

నేషనల్ గేమ్స్‌కు విశాఖ జిల్లా జట్టు ఎంపిక

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి మండలం, చిన్నతిప్పసముద్రం ZPHSలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నెట్ బాల్ టోర్నమెంట్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో విశాఖ జిల్లా జట్టు తూర్పుగోదావరి జిల్లా జట్టుపై విజయం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు గాజువాక మండలం కణితి ZPHS పీడీ నారాయణరావు సోమవారం తెలిపారు. ఈ జట్టు డిసెంబర్ 11న లుథియానాలో జరిగే నేషనల్ స్థాయి నెట్ బాల్ టోర్నమెంట్‌లో ఆడుతుందన్నారు.

News November 26, 2024

విశాఖ: విదర్భపై చండీగఢ్ ఘనవిజయం

image

విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ముస్తాక్ ఆలీ టీ-20లో సోమవారం చండీగఢ్-విదర్భ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో చండీగఢ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చండీఘడ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం విదర్భ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. చండీఘడ్ జట్టులో శివం బాంబ్రి 40 బంతుల్లో 75 పరుగులు చేశారు.

News November 25, 2024

విశాఖ: విదర్భపై చండీగఢ్ ఘనవిజయం

image

విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ముస్తాక్ ఆలీ టీ-20లో సోమవారం చండీగఢ్-విదర్భ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో చండీగఢ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చండీఘడ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం విదర్భ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. చండీఘడ్ జట్టులో శివం బాంబ్రి 40 బంతుల్లో 75 పరుగులు చేశారు.

News November 25, 2024

విశాఖ: 40 మందికి ఎస్ఐ అర్హత పరీక్షలు

image

కైలాసగిరి ఆర్మడ్ రిజర్వు కార్యాలయంలో విశాఖ రేంజ్ పరిధిలో 40 మంది ఏఎస్ఐలకు ఎస్ఐ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో రెండు రోజులుగా ఈ పరీక్షలు జరగుతున్నాయి. సోమవారం రాత పరీక్షలు నిర్వహించగా మంగళవారం అవుట్ డోర్, మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్లైన వారు డిసెంబర్ 2 నుంచి తిరుపతిలో జరిగే ఎస్ఐ ట్రైనింగ్‌కు వెళతారు.

News November 25, 2024

విశాఖ: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి సినీ హీరో మద్దతు

image

స్వచ్ఛ విశాఖ నిర్మాణం దిశగా నగరంలో ప్రతి పౌరుడు సంకల్పం తీసుకోవాలని సినీ హీరో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ ఉద్యమానికి ఆయన మద్దతు ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణలో నగర ప్రజల భాగస్వామ్యం కోరుతూ GVMC ఆధ్వర్యంలో సోమవారం ప్రచార చిత్రం విడుదల చేశారు. జీవీఎంసీ ‘స్వచ్ఛ సంకల్పానికి’ ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని కోరారు.

News November 25, 2024

మరోసారి నెం.1గా నిలిచిన విశాఖ

image

చిన్న తరహా పరిశ్రమల(MSME) ఏర్పాటులో రాష్ట్రం వేగంగా పుంజుకుంటోంది. సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం విశాఖలో రూ.648.4 కోట్ల పెట్టుబడితో 16,505 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. దీంతో విశాఖ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు, నెల్లూరు ఉన్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 968 యూనిట్లు, పార్వతీపురం మన్యంలో 2,213 యూనిట్ల పరిశ్రమలు ఏర్పడ్డాయి.