India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సముద్ర ఉత్పత్తుల రవాణాలో విశాఖ పోర్టు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని పోర్టు కార్యదర్శి టీ.వేణుగోపాల్ తెలిపారు. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో రూ.17,983 కోట్ల విలువ చేసే 3,14,199 టన్నుల సముద్ర ఉత్పత్తులను రవాణా చేసి ఈ రికార్డు సాధించినట్లు పేర్కొన్నారు. విశాఖ పోర్టు 132 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో అమెరికా, చైనా ప్రధాన ఎగుమతి దారులుగా ఉన్నట్లు తెలిపారు.
విశాఖ రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు 13.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం రైల్వే స్టేషన్‌లో నిర్వహిస్తున్న తనిఖీల్లో హర్యానా రాష్ట్రంలోని పల్వాల్ జిల్లాకు చెందిన యోగేంద్ర అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. అతని వద్ద తనిఖీ చేయగా లభించిన గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఢిల్లీకి గంజాయి రవాణా చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామని తెలిపారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.
సింహాచలం అప్పన్న గిరి ప్రదక్షణను విజయవంతం చేయాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసమూర్తి విజ్ఞప్తి చేశారు. ఈనెల 20న జరిగే గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ఆలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్న సమీక్షలో ఆయన మాట్లాడుతూ 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావాలన్నారు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ డివిజన్ లో ఆధునికరణ పనులు కారణంగా రద్దు చేసిన రైళ్లల్లో కొన్నింటిని దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. రైళ్ల రద్దుపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్ రైళ్లను ఈనెల 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితోపాటు రద్దీ తగ్గించేందుకు మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది.
విశాఖ బ్యాటింగ్ డైనమెట్, SRH ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ఇండియా టీ-20 టీంకు ఎంపికైన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో విశాఖ పేరును ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన నితీష్‌ను పలువురు అభినందిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల ACA గౌరవఅధ్యక్షుడు శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
పర్యావరణహితంగా నడుచుకోవాలని సందేశాన్ని చాటుతూ నగర మేయర్ హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో, జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ సైకిల్ పై ఈరోజు విధులకు హాజరయ్యారు. ప్రతి సోమవారం జీవీఎంసీ కార్యాలయంలోకి వాహనాలను అనుమతించరు. వీలైనంతవరకు ఉద్యోగులు, ప్రజలు ప్రజారవాణా వినియోగించాలని, కాలుష్యాన్ని నివారిస్తూ పర్యావరణహితంగా ఉండాలని ఉద్దేశంతో దీన్ని అమలు చేస్తున్నారు.
విశాఖపట్నం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా కె.మయూర్ అశోక్ సోమవారం ఉదయం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.మల్లికార్జునను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన విభాగంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీగా విధులు నిర్వహిస్తున్న మయూర్ అశోక్ బాధ్యతలు చేపట్టారు.
ఏయూ పరిధిలోని ఎమ్మెస్సీ కోర్సుల రెండవ సెమిస్టర్ పరీక్షలను జIలై 27వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సులు వారీగా పరీక్షల తేదీలను ఆంధ్ర విశ్వవిద్యాలయం వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు సంబంధిత తేదీలలో పరీక్షలకు హాజరుకావాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు. పూర్తి వివరాల కోసం ఏయూ వెబ్సైట్‌ను సంప్రదించమన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తొలి మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. మంత్రులు ఉమ్మడి విశాఖ నుంచి హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేయనున్నారు. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాపై 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్న హోంమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అనేది వేచిచూడాలి.
Sorry, no posts matched your criteria.