Visakhapatnam

News April 25, 2024

ఎన్నికల్లో పౌరులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: విశాఖ కలెక్టర్

image

వంద శాతం ఓటింగ్ లక్ష్యంగా అందరూ కలిసి రావాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఓటు ప్రాముఖ్యత తెలుసుకొని, ఓటర్ చైతన్యం, హోమో ఓటింగ్ విధానం అంశాలపై ఆయన ఈరోజు ఆలిండియా రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

News April 24, 2024

విశాఖ జిల్లాకు కేంద్రమంత్రి రాజ్ నాథ్ రాక

image

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని ఉత్తర నియోజకవర్గంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ర్యాలీ, బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 6 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణమవుతారు.

News April 24, 2024

విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ స్పెషల్ రైళ్లు

image

వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖ-చెన్నై ఎగ్మోర్-విశాఖ వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 27 నుంచి జూన్ 29 వరకు ప్రతి శనివారం విశాఖ నుంచి ఈ రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 28 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదివారం చెన్నై ఎగ్మోర్ నుంచి విశాఖకు నడుపుతున్నట్లు తెలిపారు.

News April 24, 2024

విశాఖలో మృతి చెందిన యువకుల వివరాలు ఇవే

image

విశాఖలో <<13107489>>అంబులెన్స్ ఢీకొని<<>> మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన రామకృష్ణ, విజయవాడకు చెందిన చందు మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు. రామకృష్ణ తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడంతో అనాథల పెరిగాడు. చందు తల్లి నిరుపేద కావడంతో ఛార్జీలకు పోలీసులు కొంత నగదు ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఇద్దరు మృతదేహాలు కేజీహెచ్ ఆస్పత్రిలో భద్రపరిచారు.

News April 24, 2024

విశాఖలో ముగిసిన సీఎం జగన్ యాత్ర

image

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి ఈరోజు విశాఖపట్నం జిల్లా ప్రజలు ఘన వీడ్కోలు పలికారు. మొన్న విశాఖ జిల్లాలో ప్రవేశించిన బస్సు యాత్ర నిన్నటి విరామంతో ఎండాడ వద్ద ఆగిపోయింది. నేడు అక్కడి నుంచి ముఖ్యమంత్రి తన యాత్రను ప్రారంభించి విజయనగరం జిల్లాకు చేరుకున్నారు.

News April 24, 2024

ఎవరైనా దాడి చేస్తే నాకు చెప్పండి: సీఎం జగన్

image

వైసీపీ సోషల్ మీడియాకు చెందిన వారిపై ఎవరైనా దాడి చేస్తే తనకు చెప్పాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆనందపురంలో వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ‘అవతలి వారు మన మీద దాడి చేస్తే మనం విజయానికి చేరువలో ఉన్నామని.. అలాగే వారు విజయానికి దూరంలో ఉన్నట్లు భావించాలి’అని అన్నారు. ఈ సమావేశంలో భీమిలి అభ్యర్థి అవంతి శ్రీనివాస్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.

News April 24, 2024

విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తుల వివరాలు

image

➤ అభ్యర్థి: బొత్స ఝాన్సీ
➤ చరాస్తులు: రూ.4.75 కోట్లు
➤ స్థిరాస్తులు: రూ.4.46 కోట్లు
➤ అప్పులు: రూ.2.32కోట్లు
➤ భర్త బొత్స పేరిట చరాస్తులు: రూ.3.78కోట్లు
➤ భర్త పేరిట స్థిరాస్తులు: రూ.6.75 కోట్ల విలువైన భవనాలు,భూములు
➤ భర్త పేరిట అప్పులు: రూ.1.92కోట్లు
➤ కేసులు: లేవు
➤➤ఆమె పేరిట 325 తులాల బంగారం, రెండు కార్లు.. భర్త పేరిట 31 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు ఉన్నట్లు అఫడివెట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

విశాఖ: సీఎం జగన్ యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే

image

సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.

News April 24, 2024

విశాఖ: ఈరోజు సాయంత్రం వరకే ఛాన్స్

image

హోమ్ ఓటింగ్ కోసం ఈరోజు సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని విశాఖ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున కోరారు. 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు, 40 శాతం వైకల్యం గల దివ్యాంగులలు హోమ్ ఓటింగ్‌కు అర్హులుగా సర్వే ద్వారా గుర్తించి వారికి ఫారం-12(డి) అందించినట్లు పేర్కొన్నారు. ఓటర్లు ఇంకా మిగిలి ఉంటే అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేయాలన్నారు.

News April 24, 2024

విశాఖ: బొగ్గు రవాణా నిలిచిపోవడంపై హైకోర్టులో కేసు

image

స్టీల్ ప్లాంట్‌కు గంగవరం అదానీ పోర్టు నుంచి బొగ్గు రవాణా నిలిచిపోవడంపై ఉక్కు అధికారుల సంఘం హైకోర్టులో కేసు వేసింది. గంగవరం పోర్టులో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన కోకింగ్ కోల్, లైన్ స్టోన్ సుమారు మూడు లక్షల టన్నులు ఉందన్నారు. ఈనెల 12 నుంచి పోర్ట్ కార్మికుల ఆందోళన వల్ల వాటి రవాణా నిలిచిపోయిందన్నారు. దీనిపై కోర్టు స్పందిస్తూ ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సంఘం ప్రతినిధి ప్రసాద్ తెలిపారు.