India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ రేంజ్లో బావ బామ్మర్దులు ఎస్‌లుగా రిపోర్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం పి.పొన్నవోలుకి చెందిన పులఖండం నాని, కొరసాల దుర్గాప్రసాద్ ఎస్ఐలుగా ఎంపికయ్యారు. రైతు కుటుంబానికి చెందిన వీరు వరుసకు బావమరుదులు అవుతారు. అనంతపురంలో 52 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న వీరిద్దరూ ఆదివారం విశాఖ రేంజ్లో రిపోర్ట్ చేశారు. ఇద్దరూ ఒకేసారి ఎంపికవ్వడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధుల బృందం ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గాలబ్ ఆచార్య రొక్కం రాధాకృష్ణ ప్రసంగాలు, పరిశోధనకు సంబంధించిన పుస్తకాన్ని బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పరిశోధన, బోధనా రంగాల్లో తాము సేవలందిస్తామన్నారు.

విశాఖలో బైక్ రేసర్ల ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టారు. ప్రశాంతంగా ఉండే సాగరతీరంలో రాత్రి పగలు తేడా లేకుండా బైక్ రేసర్లు రెచ్చిపోతున్నారు. దీంతో నగరవాసులతోపాటు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. దీంతో ఎంవీపీ త్రీ టౌన్ పరిధిలో అప్పుఘర్, ఆర్కే, నావెల్ ఏరియా, సాగర్ నగర్ బీచ్ ప్రాంతాల్లో పోలీసులు నిఘాపెట్టి 50 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు అయ్యింది. బీచ్ నిర్వహణ అధ్వానంగా మారడంతో ఎస్ఈకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు గుర్తింపు రద్దు చేసి జెండాలను కిందకి దించేశారు. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతాన్ని బ్లూఫాగ్ బీచ్‌గా ధ్రువీకరిస్తూ 2020లో డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ న్విరాన్మెంట్ ఎడ్యుకేషన్(ఎఫ్ఈఈ) సంస్థ సర్టిఫికెట్ అందించింది.

చిన్నగదిలి తహశీల్దార్ కార్యాలయం వెనుక గల ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) విద్యార్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఒక విద్యార్థిని శనివారం మొదటి సంవత్సరం పరీక్ష రాసింది. రెండో సంవత్సరం పరీక్షలకు మరో విద్యార్థిని సిద్ధమవుతోంది. కాగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు 8 మంది సిద్ధమవుతున్నారని హోమ్ సూపరింటెండెంట్ సునీత తెలిపారు.

విశాఖ జూపార్క్‌లో అరుదైన జాతికి చెందిన ఆసియాటిక్ లయన్‌కు రెండు సింహపు కూనలు జన్మించాయి. వీటిలో ఒక కూన అనారోగ్యంతో శనివారం మృత్యువాత పడింది. మిగిలిన మరో పిల్లను జూ క్యూరేటర్ మంగమ్మ ఆధ్వర్యంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఒక కూన మృతి చెందటంతో జంతు ప్రేమికులు ఆవేదన చెందున్నారు.

కంచరపాలెంలోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్న ఎం అజయ్ సంపత్ సాయి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ చదువుతున్న సాయి గత నెల 9న రాంబిల్లి బీచ్‌లో ఇద్దరు స్నేహితులు చనిపోగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. సంపత్ సాయి ఇంటి పక్కనే స్నేహితులు నివాసం ఉంటున్నారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్లో దాడులతో మిగతా స్పా సెంటర్లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రైళ్లలో ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక సమావేశం రైల్వే డీఎస్పీ రామచందర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రైల్వే పోలీసులు జీఆర్పీ పోలీసులు హాజరయ్యారు. ముఖ్యమైన రైలు తనిఖీ చేయడమే కాకుండా సీసీ కెమెరాలతో నిఘా మరింత పెంచాలని అనుమానితుల కదలికలు పరిశీలన ఎప్పటికప్పుడు చేయాలని పలు అంశాలపై చర్చ చేశారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

➤ ఏయూ వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.పి.రాజశేఖర్ ➤ ప్రశాంతంగా ప్రారంభమైన మొదటిరోజు ఇంటర్ పరీక్షలు➤ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాలలో 95 % మంది మొదటిరోజు పరీక్షకు హాజరైన విద్యార్థులు➤ KGHలో శిశువులు మార్పిడి.. ఒకరు సస్పెండ్, ఇద్దరికి చార్జీ మెమోలు➤ సింహాచలం ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సుబ్బారావు➤జిల్లా వ్యాప్తంగా మూడు మిస్సింగ్ కేసులు ఛేదించిన పోలీసులు
Sorry, no posts matched your criteria.