India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పలు రైళ్లును రీ షెడ్యూల్ చేసిన డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి పేర్కొన్నారు. నిజాముద్దీన్-విశాఖ(12808) ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 15, 18 తేదీల్లో ఒక గంట ఆలస్యంగా 8 గంటలకు రీషెడ్యూల్ చేశారు. విశాఖ-భగత్ కీ కోఠి (18573)ను ఈనెల 18న 2గంటల 30నిమిషాల ఆలస్యంగా రాత్రి 7.50 గంటలకు రీషెడ్యూల్ చేశారు. నిజాముద్దీన్-విశాఖ12808) ఎక్స్ ప్రెస్ ఈ నెల 22న 2గంటల ఆలస్యంగా 9గంటలకు రీషెడ్యూల్ చేశారు.
భీమిలి మండలం తగరపువలసలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న మజ్జి రాజేష్ కుమార్ (41) గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ వివాహం కూడా చేసుకోలేదు. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పేవాడు. గురువారం తరగతి గదిలో పాఠాలు చెబుతూ నోటి నుంచి నురగలు కక్కుకుంటు కుప్పకూలి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాజ్యాంగం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. గురువారం సీపీఐ నగర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీలకు సీట్లు ఓట్లు రాకపోయినా ప్రజల తరపున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, సీపీఐ అభ్యర్థి అత్తిలి విమల, పార్టీ నేత పైడిరాజు పాల్గొన్నారు.
విశాఖ నుంచి చెన్నై మీదుగా పోర్ట్ బ్లెయిర్‌కు సర్వీస్ నడిపేందుకు ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ సిద్ధం అవుతుంది. ఈనెల 29వ తేదీన ఈ షిప్ విశాఖ చేరుకుంటుంది. రేట్లు, బెర్తింగ్, టైమ్స్ తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలో విశాఖ పోర్టుకు ది వరల్డ్ సంస్థ ప్రతినిధులు రానున్నారు. విశాఖ పోర్టు నుంచి 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఇది బయలుదేరుతుంది. ఇక్కడి నుంచి చెన్నై మీదుగా పోర్ట్ బ్లెయిర్‌కు వెళుతుంది.
వచ్చే నెల 10న జరగనున్న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవానికి అధికారిక ప్రొటోకాల్ పరిధిలోని వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతిస్తారు. తొలిపావంచా నుంచి భక్తులను ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో కొండపైకి తరలిస్తారు. నగర పరిధిలోని ఆరు ఏడు చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేసి రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లు విక్రయించాలని నిర్ణయించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ప్రొటోకాల్ వుండదు.
రుషికొండ బీచ్‌లో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కంచరపాలెం ఊర్వశి జంక్షన్‌కు చెందిన తేజ (20) గురువారం సాయంత్రం తన స్నేహితులతో రుషికొండ బీచ్‌కు వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో వారు స్నానాలకు దిగారు. పెద్ద కెరటం రావడంతో తేజా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. లైఫ్ గార్డ్స్ గాలించినప్పటికీ తేజ ఆచూకీ లభ్యం కాలేదు. బ్లూకోర్టు పోలీసులు గాలిస్తున్నారు. తేజ ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు.
రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా జిల్లాలో గురువారం పర్యటించారు. దీనిలో భాగంగా గాజువాక నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో ఏర్పాటుచేసిన వివిధ కంట్రోల్‌రూమ్‌లను, అనుమతి జారీ కేంద్రాలను తనిఖీ చేశారు.
విశాఖపట్నం- బెనారస్ రైళ్ల మార్గం మళ్లింపు చేసినట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
ఈ నెల 21న విశాఖపట్నం నుంచి బయలుదేరే (18311) విశాఖపట్నం-బెనారస్ ఎక్స్ ప్రెస్, ఈ నెల 22న బెనారస్ నుంచి బయలుదేరే (18312) బెనారస్- విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ రైళ్లు విజయనగరం- ఖుర్దా రోడ్- అంగుల్-సంబల్పూర్ సిటీ-జార్సుగూడ మీదుగా మళ్లించిన మార్గంలో ప్రయాణిస్తాయని తెలిపారు.
విశాఖ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని గాజువాక మినహా విశాఖ తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పురుష ఓటర్లు ఎక్కవగా ఉంటే.. 2024 నాటికి మహిళా ఓటర్లు వారిని అధికమించారు. లోక్ సభ పరిధిలో ఇప్పటి వరకు 19,03,175 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుషులు 9,36,667, మహిళలు 9,66,389, ఇతరులు 119 మంది ఉన్నారు.
విశాఖ తొట్లకొండ బీచ్ రోడ్డులో జరిగిన <<13024927>>రోడ్డు ప్రమాదంలో<<>> మృతిచెందిన వారి వివరాలు వెల్లడయ్యాయి. చింతపల్లి వీరభద్ర అనే యువకుడు భీమిలి నుంచి బైక్‌పై విశాఖ వెళ్తున్నాడు. అదే సమయంలో రుషికొండకు చెందిన దౌలపల్లి చిన అప్పలరాజు రుషికొండ నుంచి ఉప్పాడ వైపు బైకుపై వస్తున్నాడు. వంతెన పాడైన కారణంగా వన్ వే దారిలో ఎదురెదురుగా వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం వాటిల్లింది. ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
Sorry, no posts matched your criteria.