India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ స్టీల్ ప్లాంట్ సిఎండి అతుల్ భట్‌ను సెలవుపై వెళ్లాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సీఎండీ బాధ్యతలను వెంటనే అదనపు డైరెక్టర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా సీఎండీపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తీవ్ర అసంతృప్తితో ఉండడం వల్లే ఆయనను సెలవు వెళ్లాలని ఆదేశించినట్లు తెలిసింది. సీఎండీగా అతుల్ భట్ 2021 సెప్టెంబర్ 13న బాధ్యతలు స్వీకరించారు.
భారీ వర్షాలకు అనకాపల్లి జిల్లాలో 4,420 మంది రైతులకు సంబంధించిన 1,528 హెక్టార్లలో వరి పంట నీట మునిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు తెలిపారు. పొలాల్లో నీరు బయటకు పోయిన తర్వాత ఎకరం విస్తీర్ణం వరి పొలంలో 20 కిలోల యూరియా, 20 కిలోల పొటాష్ ఎరువులు వేయాలన్నారు. చీడపీడలు సోకకుండా గ్రాము కార్బండిజం పొడిని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.
అల్లూరు జిల్లాలో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు వర్తిస్తుందని చెప్పారు.
విశాఖ కైలాసగిరిపై ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బస్సులో ప్రయాణిస్తున్న 18 మంది వరకు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
విశాఖ కైలాసగిరి కొండపై సోమవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై నుంచి కిందకు దిగుతున్న బస్సుకు బ్రేక్ ఫెయిల్ అయ్యింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి మొదటి మలుపు వద్ద గోడను ఢీకొట్టారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న 16 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కోస్తాంధ్రలోను అతి భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సమాచరం నేపథ్యంలో రాబోయే 72 గంటలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి అనిత సూచించారు. ఉత్తరాంధ్రను వానలు ముంచెత్తడంతో విజయవాడ నుంచి ఆమె విశాఖకు బయలుదేరారు. విపత్తుల నిర్వహణ శాఖను అప్రమత్తం చేశారు. వంశధార, నాగావళి, బహుదా పరివాహక ప్రాంతాల ప్రజల మొబైళ్లకు ఎప్పటికప్పుడు అలెర్ట్ సందేశాలు పంపి అప్రమత్తం చేయాలని సూచించారు.
తీవ్ర సంక్షోభంలో ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. ద్వారక నగర్ పౌర గ్రంథాలయంలో స్టీల్ ప్లాంట్ పరిస్థితిని వివరించారు. వేతనాలు అందక ప్లాంట్ కార్మికులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
విజయవాడ వరదల్లో మరణాలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రచారం కోసం చంద్రబాబు జేసీబీపై తిరగారని విమర్శించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పంట పొలాలు అన్ని మునిగిపోయాయని అన్నారు. ఒక్క అధికారి జిల్లాలో కనిపించడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను జగన్ కాపాడినట్లు పేర్కొన్నారు.
స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఈనెల 10వ తేదీన కూర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించనున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.శంకరరావు, ప్రధాన కార్యదర్శి జీ.కోటేశ్వరరావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. 13 రోజులుగా కార్మిక సంఘాలు నిరసన తెలుపుతున్నా కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.
అరకులోయ-విశాఖపట్నం మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను సోమవారం పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు బాగా దెబ్బతింది. మట్టి, రాళ్లు రహదారిపైకి ఎక్కువగా వచ్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బస్సు సర్వీసులు రద్దు చేశారు. ప్రయాణీకులు గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.