Visakhapatnam

News September 7, 2024

సరుకు రవాణాలో సత్తా చాటుతున్న విశాఖ పోర్టు

image

సరుకు రవాణాలో విశాఖ పోర్టు సత్తా చాటుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది. గత ఏడాది 35 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయడానికి 163 రోజులు పట్టగా ఈ ఏడాది 149 రోజుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకున్నట్లు పోర్ట్ ట్రస్ట్ అథారిటీ ఛైర్మన్ అంగముత్తు తెలిపారు. ఈ ఏడాది 90 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

News September 7, 2024

కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు

image

విశాఖ కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు అందుబాటులోకి రానున్నాయి. కోత లేకుండా లేజర్ విధానంలో సకాలంలో శత్రు చికిత్సలు నిర్వహించేలా కేజీహెచ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో విమ్స్ ఆసుపత్రికి లేజర్ వైద్య పరికరాలు అందజేశారు. వీటిని వినియోగించకపోవడంతో కలెక్టర్ అనుమతితో విమ్స్ డైరెక్టర్ రాంబాబు కేజీహెచ్‌లో వీటిని అందజేశారు. దీంతో కేజీహెచ్‌లో లేజర్ ఆపరేషన్లు జరగనున్నాయి.

News September 6, 2024

విశాఖ- మహబూబ్‌నగర్ SF ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

విశాఖ- మహబూబ్‌నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (12861) ఈరోజు విశాఖపట్నం నుంచి సాయంత్రం 6:40కు బయలుదేరవలసి ఉండగా 5 గంటలు ఆలస్యంగా నడవనుంది. రాత్రి 11:40కు బయలుదేరే రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ట్రైన్ రేపు మధ్యాహ్నం 2:20కు మహబూబ్ నగర్ చేరుకుంటుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 6, 2024

విశాఖలో డీజీ యాత్ర సేవలను ప్రారంభించిన మంత్రి

image

విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్ర పేరుతో రూపొందించిన బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టం సేవలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎంపీ శ్రీభరత్ తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ తరహా సేవలు ఇప్పటికే వారణాసి, ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, విమానయాన శాఖ అధికారులు పాల్గొన్నారు.

News September 6, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు బొగ్గు కొరత తీవ్రతరమవుతోంది. ఒకటో నంబరు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను చాలా రోజుల క్రితమే పూర్తిగా మూసేశారు. గత 15 రోజుల నుంచి కొన్ని రోజులు బీఎఫ్‌-2, మరికొన్ని బీఎఫ్‌-3 నడుపుకుంటూ వస్తున్నారు. గత రెండు రోజుల నుంచి బీఎఫ్‌-2 కూడా షట్‌డౌన్‌ చేశారు. ఇప్పుడు బీఎఫ్‌-3 ఒక్కటి నడపడానికి కూడా బొగ్గు పూర్తిగా లేదు. కేవలం 36 గంటలు దానిని నడపడానికి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది.

News September 6, 2024

విశాఖ: వందేభారత్ రైలు రద్దు

image

విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలును నేడు(శుక్రవారం) రద్దు చేస్తున్నట్లు డీసీఎం సందీప్ తెలిపారు. సికింద్రాబాద్-విశాఖ(20707), విశాఖ-సికింద్రాబాద్(20708), విశాఖ-సికింద్రాబాద్(20833), సికింద్రాబాద్-విశాఖ(20834) రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News September 5, 2024

మంచి మనసు చాటుకున్న హోం మంత్రి అనిత కుమార్తె

image

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుమార్తె రేష్మిత చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నారు. విజయవాడ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్‌లో సర్వం కోల్పోయిన మహిళలకు 50 చీరలతో పాటు నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, అరటి పళ్ళు పంపిణీ చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా రేష్మిత మాట్లాడుతూ.. తన వంతుగా కొందరు బాధితులకు సాయం అందించానని అన్నారు.

News September 5, 2024

విశాఖ: ‘ఫ్రాడ్ కాల్ నిందితుడు అరెస్టు’

image

విశాఖ నగరానికి చెందిన ఓ మహిళకు హైదరాబాద్‌కు చెందిన నిందితుడు రాహుల్ గిరి గోస్వామి కాల్ చేసి మీ మీద మనీ లాండరింగ్ కేసు ఉందని రూ.37 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. మహిళ భయపడి అకౌంట్‌కి రూ.37 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసింది. మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు.

News September 5, 2024

ఏయూ నుంచి తొలి డాక్టరేట్ అందుకున్న సర్వేపల్లి

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అందుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1931లో అదే వర్సిటీకి రెండో ఉపకులపతిగా వచ్చారు. 1931 నుంచి 1936 వరకు 5 సంవత్సరాలు సేవలు అందించారు. కేవలం 4 విభాగాలతో ప్రారంభమైన ఏయూను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ గ్రహీత సీవీ రామన్ వంటి వారు ఏయూను సందర్శించడమే కాకుండా కొద్ది రోజులు ఇక్కడ ఉండడం విశేషం.

News September 5, 2024

విశాఖ: మీకిష్టమైన టీచర్ ఎవరు?

image

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్‌లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునేందుకు ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరిస్తున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.