India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆనందిని తీర్పునిచ్చారు. పెద్ద అగనంపూడిలో నివాసం ఉంటున్న బాలిక (13) 2021లో ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ కేసులో ఎదురు అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న విజయనగరం జిల్లాకు చెందిన నరేశ్(28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమపేరుతో బాలికను పలుమార్లు లోబర్చుకున్నట్లు విచారణలో తేలడంతో పైవిధంగా శిక్ష విధించారు.
విశాఖ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా కాసేపటికే తిరిగి వెనక్కి వచ్చింది. బుధవారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానం బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి తీసుకువచ్చినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం సవరించిన తర్వాత విమానం బయలుదేరింది.
దులీప్ ట్రోఫీ తొలిదశ మ్యాచ్‌లు గురువారం నుంచి బెంగళూరు, అనంతపురంలో ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంటులో విశాఖకు చెందిన భరత్, నితీశ్ కుమార్ రెడ్డి, రికీబుయ్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. నితీశ్ IPLలో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణించారు. భరత్‌కు భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. రికీబుయ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్‌లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.
వరద ముంపు బాధితులకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాసటగా నిలిచారు. విజయవాడ బాధితులకు సీఎం రమేశ్ కుటుంబం కోటి రూపాయల విరాళం ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలుకోలేని విధంగా నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వరద బాధితుల కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం 71,500 అల్పాహారం ప్యాకెట్లు, 68 వేల భోజనం ప్యాకెట్లు, 80,000 వాటర్ బాటిళ్లతో పాటు 48,500 రాత్రి భోజనం ప్యాకెట్లు సమకూర్చింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లతో పాటు బిస్కెట్లు, రొట్టెలు, కొవ్వొత్తులు సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు. ఈ ప్రక్రియను డీఆర్ఓ మోహన్ కుమార్ పర్యవేక్షించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆదేశం మేరకు వరదల్లో చిక్కుకున్న బాదితులకు ఫుడ్ ప్యాకెట్లు పంపించినట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా సమాఖ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 5000 ఆహార పొట్లాలు, 1800 మంచినీళ్ళ బాటిల్లు, 3000 టెట్రా పాల పేకెట్లు, 2000 బిస్కట్ పాకెట్లు సిద్ధం చేసి రెండు లారీలలో పంపించామన్నారు. బుధవారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వాటిని అధికారులు అందుకున్నట్లు తెలిపారు.
రానున్న 24 గంటల్లో బంగాళాఖాతం సమీప ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సముద్రతీరం వెంబడి 35-45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖకు రావాల్సిన గరీబ్‌రథ్ బుధవారం రాత్రి 8:30 కాకుండా 10:30కు, గోదావరి ఎక్స్‌ప్రెస్ నాంపల్లిలో సాయంత్రం 6:35కి బయలుదేరనున్నాయి. గోదావరి ఎక్స్ ప్రెస్‌ను పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నారు. అలాగే మహబూబ్ నగర్-విశాఖ, ముంబై ఎల్‌టీటీ-విశాఖ రైళ్లను సైతం పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి మంగళవారం సాయంత్రం 5.40 గంటలకు విశాఖ బయలుదేరిన ఏఐ 471 ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని ఢిల్లీ విమానాశ్రయానికి ఓ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయానికి తెలిపారు. రాత్రి 8.05 గంటలకు ఇక్కడికి చేరుకున్న విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అపాయం లేదని నిర్ధారించిన అధికారులు రాత్రి 12 గంటలు దాటిన తరువాత ఢిల్లీ పంపారు.
విశాఖ స్టీల్‌ప్లాంటులో ఉద్యోగులు, కార్మికుల సంఖ్య కుదింపునకు యాజమాన్యం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడున్న వారిలో మూడో వంతు 2025 మార్చికి తగ్గించాలని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు యాజమాన్యం రకరకాల పేర్లతో సిబ్బందిని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. 12 వేల మంది కాంట్రాక్టు కార్మికుల్లో 33 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆంక్షలు పేరిట కొన్ని విభాగాల్లో పనిదినాలు తగ్గించేసింది.
Sorry, no posts matched your criteria.