India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ పాలనలో స్త్రీలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వాడకం బాగా పెరిగాయన్నారు. భూకబ్జాలు, దాడులకు హద్దులేకుండా పోయిందని ఆరోపించారు. వీటన్నింటినీ తమ ప్రభుత్వంలో సరిదిద్దుతానన్నారు. ఆడపిల్లలు కిడ్నాప్‌కు గురికాకుండా పటిష్ఠమైన చర్యలు చేపడతామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.
పాప్ కార్న్ కొనేందుకు వెళ్లిన చిన్నారి విగతజీవిగా మారింది. కంచరపాలెం జాషువా నగర్‌లో ఉంటున్న బీ.సురేశ్, శృతి దంపతులకు పూజిత (9) ఒక్కగానొక్క కూతురు. దీంతో వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి పాప్‌కార్న్ కోసం అని తండ్రి బైక్‌పై మార్కెట్‌కు వెళ్తుండాగా జరిగిన ప్రమాదంలో పూజిత మృతిచెందింది. చిన్నారిని తలుచుకుంటూ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
వరాహాలక్ష్మీనృసింహస్వామికి పైపూతగా వేసేందుకు మూడో విడత చందనం అరగదీత ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఏటా పన్నెండు మణుగుల శ్రీచందన ముద్దను నాలుగు విడతలుగా స్వామి వారికి సమర్పించడం ఆనవాయితి. తొలి విడతగా వైశాఖ మాస శుక్లపక్ష తృతీయ అనగా చందన యాత్ర నాటి రాత్రి, రెండవ విడతగా వైశాఖ మాస శుక్లపక్ష పౌర్ణమి నాడు మూడేసి మణుగుల (125 కిలోలు) చొప్పున చందనం సమర్పించారు. మూడో విడత చందనం ఈ నెల 22న సమర్పిస్తారు.
హోంశాఖ, పాయకరావుపేటను రెండుకళ్లుగా భావిస్తూ సమ ప్రాధాన్యత ఇస్తానని మంత్రి అనిత అన్నారు. వారంలో 3 రోజులు నియోజకవర్గంలోనే ఉంటానని, మిగతా రోజులు హోంశాఖకు కేటాయిస్తానన్నారు. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించి, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా పేటను మార్చుతానన్నారు. ప్రజలకు పోలీసులను దగ్గర చేస్తానని, దిశ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లుగా మారుస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్‌ని అరికడతామన్నారు.
విశాఖ జిల్లాలో ఆదివారం యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ మోహన్ కుమార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 26 కేంద్రాల్లో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రెండవ సెషన్ పరీక్ష జరుగుతుందన్నారు. మొత్తం 9,635 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
జల్సాలకు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చడానికి ఇద్దరు యువకులు అమ్మవారి గుడిలో చోరీకి పాల్పడిన సంఘటన జీ.ధర్మవరంలో వెలుగు చూసింది. మార్టూరుకు చెందిన అభిషేక్, కిషోర్ మద్యానికి బానిసై అప్పులు చేశారు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడంతో ఈనెల 9న అర్ధరాత్రి జీ.ధర్మవరం దుర్గమ్మ గుడి తలుపులు పగలగొట్టి ఐదు సీసీ కెమెరాలు, హుండీలో ఉన్న రూ.5వేలు చోరీ చేశారు. పూజారి ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రావికమతం మండలం టి.అర్జాపురం గ్రామంలో శనివారం పిడుగు పడి రైతు రాజాన పెంటయ్య మృతి చెందాడు. పెంటయ్య తన పశువులను మేతకు తీసుకువెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో ఇంటికి వెళ్లే ప్రయత్నంలో రైతుకు సమీపంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు వంతెన మరమ్మతుల కారణంగా17న పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. 17న పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 17న బయలుదేరే విశాఖ-బ్రహ్మపూర్, 18న బయలుదేరే బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
కొయ్యూరు మండలం చీడిపాలెం పంచాయతీ పరిధిలో ఉన్న వట్టి కాలువ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శనివారం స్థానికులు వట్టి కాలువ వైపు వెళ్లగా అక్కడ ఉన్న చెట్టుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించింది. దీంతో ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఓడిపోయినా జగన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఐదు హామీలను అమలు చేస్తూ సంతకాలు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్నారు. జగన్ రెడ్డిని ప్రజలు వ్యతిరేకించినా ఆయనలో పశ్చాత్తాపం కనిపించలేదన్నారు.
Sorry, no posts matched your criteria.