India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నర్సీపట్నంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ రెండు వర్గాల మధ్య కొట్లాటకు దారి తీసిందని టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు అవతల వర్గం వారిపై చేసిన వ్యాఖ్యల వల్ల జోగినాథునిపాలెం, బీసీ కాలనీ ప్రాంతాలలో ఇరు వర్గాలు కొట్టుకున్నాయని తెలిపారు. కొట్లాటలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు. ఇరు వర్గాలకు చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రాబోయే పండగల సీజన్ లో విశాఖ-సికింద్రాబాద్-విశాఖ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈనెల 8 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు సికింద్రాబాద్-విశాఖ స్పెషల్ ట్రైన్ ప్రతి ఆదివారం సికింద్రాబాద్‌లో సాయంత్రం బయలుదేరుతుందని మరుసటి రోజు విశాఖ వస్తుందని తెలిపారు. అలాగే విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు ఈ నెల 9 నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు ప్రతి సోమవారం నడుస్తుందన్నారు.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు క్యాబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై క్యాబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్సకు అవసరమైన ప్రొటోకాల్, మర్యాదలు ఇవ్వాలని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పిఓ అభిషేక్ తనిఖీ చేశారు. విద్యార్థుల అదృశ్యం పట్టించుకోకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్, కుక్‌లకు పీఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులుగా విద్యార్థులు బయట ఉంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంపై డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూఓ తిరుపాల్‌లను మందలించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహరావు తెలిపారు. విశాఖ సీఐటీయూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు. ఫలితంగా ఉత్పత్తి 73 లక్షల నుంచి 45 లక్షలకు పడిపోయిందన్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపిస్తున్నారన్నారు.
వాలంటీర్లతో పింఛన్ల పంపిణీ చేశారన్న వార్తలు అల్లూరి జిల్లాలో కలకలం రేపాయి. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొయ్యూరు మండలంలో కొందరు సచివాలయ ఉద్యోగులు తాము చేయాల్సిన పనిని పాత వాలంటీర్లతో చేయించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎంపీడీవో మేరీ రోజ్‌ను వివరణ కోరగా.. ఈ ఘటనపై విచారణ చేయిస్తానని చెప్పారు..
రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3వ తేదీన రెండు జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ విశాఖ జిల్లా అధికారి సాయి కృష్ణచైతన్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెదగంట్యాడలోని నేషనల్ అకాడమీ కన్స్ట్రక్షన్ దగ్గర, విశాఖ జైల్ రోడ్ గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయని చెప్పారు.
నిండు గర్భిణి 2 కిలో మీటర్లు కష్టపడి నడక సాగించిన దుస్థితి అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసింది. దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ రామన్నపాలేనికి చెందిన గర్భిణి దుంబరి నూకాలమ్మకు ప్రసవ సమయం దగ్గర పడింది. భారీ వర్షాల దృష్ట్యా ఆమెను ముందుగానే ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. ఈక్రమంలో ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేకపోవడంతో గర్భిణి కొంతదూరం నడక సాగించాల్సి వచ్చింది.
వాల్తేరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం విశాఖపట్నంలో 0891-2746330, 0891-2744619.. విజయనగరంలో 8712641260, 08922 221202 నెంబర్లతో హెల్ప్‌డెస్క్‌లను అందుబాటులోకి తెచ్చారు.
అమెరికాలోని అట్లాంటాలో జరిగిన అందాల పోటీల్లో విశాఖ నగరానికి చెందిన డాక్టర్ తిరుమలిని దాసరి మెరిశారు. మిస్సెస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్నారు. విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాలలో MBBS చదివారు. ప్రస్తుతం అమెరికాలో రుమటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. మిస్సెస్ ఇండియా యూఎస్ఏ టైటిల్ గెలుచుకున్న ఆమెకు సినీ నటి అమీషా పటేల్ టైటిల్ అందజేశారు.
Sorry, no posts matched your criteria.