Visakhapatnam

News November 1, 2024

విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. విశాఖ- విజయవాడ-విశాఖ మధ్య జన్ సాధారణ్ రైళ్లను(అన్ రిజర్వుడు) శుక్రవారం నుంచి నడుపుతున్నారు. విశాఖ -విజయవాడ-విశాఖ మధ్య 1,3,4,6,8,10,11,13 తేదీల్లో ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం, స్టేషన్ల మీదుగా నడుస్తాయన్నారు.

News November 1, 2024

పోయిన పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి: గంటా

image

గత ప్రభుత్వ హయాంలో కుదేలైన రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు జెట్ స్పీడ్‌లో అభివృద్ధి దిశగా తీసుకు వెళుతున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఎంవీపీ కాలనీ తన నివాసంలో మాట్లాడుతూ.. విశాఖ రైల్వే జోన్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన జరగనున్నదని వెల్లడించారు. రూ.75 వేల కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. పోలవరాన్ని రెండేళ్లలో పూర్తిచేసేలా చంద్రబాబు ప్రణాళిక రూపొందించారన్నారు.

News November 1, 2024

స్టీల్ ప్లాంట్ రక్షణకై త్యాగాలకు సిద్ధం: వామపక్షలు

image

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో సదస్సును అల్లూరి విజ్ఞానం కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.లెనిన్ బాబు మాట్లాడుతూ విద్యార్థి, యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఆందోళనలతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాడుదామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కోసం విద్యార్థి యువజన సంఘాలు ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.

News November 1, 2024

‘ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు’

image

ఈ నెల 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గల శివాలయాల్లో భక్తుల దర్శనానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్ సుజాత తెలిపారు. విశాఖ తన కార్యాలయంలో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో 210 శివాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కార్తీక సోమవారాల్లో శివాలయాల్లో భక్తులకు అన్నప్రసాద వితరణ, తాగునీరు మజ్జిగ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

News November 1, 2024

అనకాపల్లిలో అగ్నిప్రమాదం

image

అనకాపల్లిలో దీపావళి రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బాలాజీ రావు పేటలోని ఎలక్ట్రికల్ షాప్‌లో జరిగిన ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో ఎలక్ట్రికల్ సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 31, 2024

IPL: విశాఖ ప్లేయర్‌కు రూ.6కోట్లు

image

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించింది. విశాఖకు చెందిన ఆల్‌రౌండ‌ర్ నితీశ్ కుమార్ రెడ్డిని రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది. గత సీజన్లో అతడి ధర కేవలం రూ.20 లక్షలు మాత్రమే.

News October 31, 2024

విశాఖలో సీఎం పర్యటనకు ఏర్పాట్లు 

image

న‌వంబ‌ర్ 02న సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నారు. ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌ను క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్, పోలీసు క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ ఇత‌ర అధికారుల‌తో క‌లిసి సీఎం హెలికాఫ్ట‌ర్ ల్యాండ్ అయ్యే కోస్ట‌ల్ బ్యాట‌రీ ప్రాంతాన్ని గురువారం ప‌రిశీలించారు. కోస్ట‌ల్ బ్యాట‌రీ వ‌ద్ద‌కు శ‌నివారం మ‌ధ్యాహ్నం చేరుకొని అక్క‌డ నుంచి రోడ్డు మార్గం ద్వారా క‌లెక్ట‌రేట్‌కు వస్తారని అన్నారు.

News October 31, 2024

విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్

image

ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్‌ప్రెసిడెంట్‌ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్‌లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.

News October 30, 2024

విశాఖలో సమీక్ష నిర్వహించనున్న సీఎం

image

జిల్లాలో ఈనెల 2వ తేదీన సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని, స‌మ‌న్వ‌య లోపం లేకుండా చూసుకోవాల‌ని అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హరేంద్రప్రసాద్ ఆదేశించారు. బుధవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలెక్టరేట్లో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News October 30, 2024

పర్యావరణహిత దీపావళి జరుపుకోండి: విశాఖ సీపీ

image

పర్యావరణహిత దీపావళిని జరుపుకోవాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి అన్నారు. విశాఖలో తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం దీపావళి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పశు, పక్షాదులకు, వృద్ధులు, పిల్లలకు హాని కలగకుండా సంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు.