Visakhapatnam

News April 11, 2024

విశాఖ: కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం

image

విశాఖలో ద్వారక నగర్ ఐఓబీలో ఎస్పీఎఫ్ <<13030401>>కానిస్టేబుల్ శంకరరావు<<>> ఆత్మహత్య ఘటన ఆయన కుటుంబంలో పెను విషాదం నింపింది. ఉ.5 గంటలకు విధులకు వచ్చిన శంకర్రావు..7 గంటలకు తుపాకీతో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిది వంగర మండలం పొత్తిస గ్రామంగా సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. కాగా.. కానిస్టేబుల్ ఛాతీపై కాల్చుకున్నట్లు తెలుస్తోంది.

News April 11, 2024

విశాఖ: పలు రైళ్లు రద్దు

image

ప్రీ-నాన్ -ఇంటర్లాకింగ్, నాన్ -ఇంటర్లాకింగ్ పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేస్తునట్లు రైల్వే శాఖ అధికారి ఏ.కె. త్రిపాఠి తెలిపారు. 08527 విశాఖ- రాయ్ పూర్, 08528 రాయ్‌పూర్ -విశాఖ, 08504 విశాఖ-భవానీపట్నం ప్యాసింజర్, 18301 సంబల్పూర్ – రాయగడ, 18302 రాయగడ -సంబల్పూర్ ఇంటర్ సిటీని ఈనెల 15 నుంచి 24వ తేదీ వరకు… 08503 భవానీపట్న-విశాఖ ప్యాసింజర్ ఈనెల 16 నుంచి 25వ వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

News April 11, 2024

విశాఖలో ప్రత్యర్థుల ఆత్మీయ ఆలింగనం

image

వారిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు. ఒకే నియోజకవర్గం నుంచి ఒకరు వైసీపీ తరఫున.. మరొకరు జనసేన నుంచి పోటీ పడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దక్షిణ నియోజకవర్గానికి చెందిన వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ వన్ టౌన్ ఏరియా మసీదులో ఎదురుపడటంతో ఒకరికొకరు పలకరించుకుని ఆలింగనం చేసుకున్నారు.

News April 11, 2024

విశాఖలో గన్‌తో కాల్చుకుని కానిస్టేబుల్ సూసైడ్

image

విశాఖ ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో SPF కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్ శంకర్రావు గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఉ. 5 గంటలకు డ్యూటీ‌కి హాజరైన శంకర్రావు.. తన వద్ద ఉన్న SLRతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఓబి బ్యాంకులో గన్ మ్యా‌న్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 11, 2024

విశాఖలో ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలు విస్తరణ

image

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కార్యకలాపాలను విశాఖలో విస్తరించనుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విశాఖలో గ్రోసరీ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. 77 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న జీ.ఎఫ్.సీ ద్వారా స్థానికులు వెయ్యి మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

News April 11, 2024

విశాఖ: ‘ప్రస్తుతానికి వంతెనపై అనుమతి లేదు’

image

విశాఖ రైల్వే స్టేషన్ లో 3,4 ప్లాట్ ఫామ్స్ మధ్య కుంగిన ఫూట్ ఓవర్ వంతెన నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. యుద్దప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 3, 4ప్లాట్ ఫామ్స్ ను ట్రైన్స్ రాకపోకలకు సిద్ధం చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా ప్రస్తుతానికి ప్రయాణికులను ఈ వంతెనపై ప్రయాణికులను అనుమతించడం లేదని తెలిపారు.

News April 11, 2024

అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన ఫిక్స్

image

అనకాపల్లి జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారైనట్లు జిల్లా టీడీపీ అధ్యక్షులు బుద్ధ నాగ జగదీష్ తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు పాయకరావుపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారని వెల్లడించారు. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు చోడవరంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.

News April 11, 2024

విశాఖ: రైళ్లను రద్దు చేసిన అధికారులు

image

దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లో ఈనెల 11 నుంచి 28 వరకు రోలింగ్ స్టాక్ కారిడార్ కార్యక్రమం కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 11 నుంచి 28 వరకు రాజమండ్రి నుంచి బయలుదేరే రాజమండ్రి-విశాఖ పాసింజర్ ట్రైన్ ను రద్దు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో 11 నుంచి 28 వరకు విశాఖ నుంచి రాజమండ్రి బయలుదేరి పాసింజర్ రైలును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.

News April 11, 2024

విశాఖ: ‘అప్రమత్తంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలి’

image

ఎన్నికల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ సూచించారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎన్నికల నియమాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలన్నారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

News April 10, 2024

పెందుర్తిలో ఎవరు గెలిచినా రికార్డే..!

image

పెందుర్తి నియోజకవర్గం 1978లో ఏర్పడింది. అప్పటి నుంచి 11 సార్లు ఎన్నికలు జరగగా.. 11 సార్లు వేర్వేరు అభ్యర్థులే గెలిచారు. ఈ సారి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ మరోసారి పోటీలో ఉండగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన నేత పంచకర్ల రమేశ్ బరిలో ఉన్నారు. అయితే పంచకర్ల 2009లో పీఆర్పీ నుంచి గెలిచారు. దీంతో వీరిలో ఎవరు గెలిచినా పెందుర్తిలో రెండోసారి గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.