India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గాజువాక పోలీస్ స్టేషన్ వద్ద చిట్టీల పేరిట మోసపోయామంటూ సుమారు 200 మంది బాధితులు ఆందోళన చెపట్టారు. వారి వివరాల ప్రకారం.. వాంబే కాలనీకి చెందిన మరడాన.పరుశురాం చిట్టీలు, రియల్ ఎస్టేట్ పేరిట సుమారు రూ.30 కోట్లతో పరారయ్యడని తెలిపారు. పరుశురాం గాజువాక పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ చేస్తుంటానని నమ్మించి తమను మోసం చేశాడని వాపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు సీనియర్ IASలను స్పెషల్ ఆఫీసర్స్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖకు హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సౌరభ్ గౌర్‌ను నియమించింది. అల్లూరి జిల్లాకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె.కన్నబాబు, అనకాపల్లికి ఇండస్ట్రీస్ డైరెక్టర్ సీహెచ్.శ్రీధర్‌ను నియమించింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రిని కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. సమస్యలపై ప్రజలు అందజేసిన వినతి పత్రాలను స్వీకరించారు. అందర్నీ పలకరించారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
విశాఖ నగరంలో తొలిసారిగా BSNL 4జీ సేవలను ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్ హౌస్ బాంకెట్ హాల్‌లో ప్లాంట్ సీఎండీ అతుల్ బట్, డైరెక్టర్ సురేశ్ చంద్ర పాండే, BSNL అధికారి సత్య ప్రసాద్, ఐటీఎస్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ విలియమ్స్ తదితరులు లాంఛనంగా 4జీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ అధికారి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాలలో నూతనంగా మాస్టర్స్ ఇన్ క్లినికల్ ఎంబ్రియాలజీ కోర్సును వీసీ ఆచార్య జి.శశిభూషణరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ఎంబ్రియాలజీ నిపుణుల అవసరం పెరుగుతోందని అన్నారు. సమాజ అవసరాలు, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రాధాన్యత కలిగిన ఇటువంటి కోర్సును ప్రారంభించడం పట్ల వీసీ కళాశాల ఆచార్యులను అభినందించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేవ్ తన పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖ జిల్లాలోని నాలుగు పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠశాలల భవనాల స్థితిగతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యాబోధన తదితర అంశాలను ఆయన పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మంత్రి పర్యటన ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నగర పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలను కలుస్తారు.
వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ ఏడాది సింగిల్ విండో సిస్టమ్‌ను తీసుకువచ్చింది. విశాఖలో హోంమంత్రి వంగలపూడి అనిత, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీకి ఈ విధానాన్ని గురువారం ప్రారంభించారు. ఈ విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మండపాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తారు. గతంలో అన్ని శాఖల నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాల్సి వచ్చేది.
వివిధ దళాల్లో అను శక్తి మరింత బలోపేతం చేయనున్నట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గురువారం ఆయన INS హరి ఘాత అనే జలాంతర్గామిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సాంకేతిక వ్యవస్థలను మన శక్తి సామర్థ్యాలను శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. ఈ జలాంతర్గామి దేశం సాధించిన మరో ప్రగతి అని ప్రశంసించారు.
ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి అదనపు కోచ్‌లతో రైళ్లను పెంచామని వాల్తేర్ డీసీఎం కె.సందీప్ కుమార్ తెలిపారు. సంబల్పూర్-నాందేడ్ సూపర్-ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు, నాందేడ్- సంబల్పూర్ సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 1 వరకు, సంబల్పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 25 వరకు కేటాయించిన రోజుల్లో ఒక 3rd AC కోచ్, ఒక స్లీపర్ కోచ్ పెంచినట్టు తెలిపారు.
మెరుగైన ఐటీ పాలసీతో ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను ఏపీకి రప్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ హోటల్‌లో ఐటీ ప్రముఖులతో సమావేశమయ్యారు. 100 బిలియన్ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఐటీ పరిశ్రమలకు రాయితీలను అందజేస్తామన్నారు. ఐటీలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఐటీ పరిశ్రమలు సహకరించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.