Visakhapatnam

News April 8, 2024

ఉమ్మడి విశాఖ వ్యాప్తంగా 873మంది వాలంటీర్ల రాజీనామా

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో వాలంటీర్ల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. నిన్నటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 873 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. తాజాగా సోమవారం సైతం చాలాచోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేశారు. ఎస్.రాయవరం మండలంలోని 24 గ్రామ సచివాలయాల పరిధిలో సుమారు 100 మంది మూకుమ్మడి రాజీనామా చేశారు. ఎంపీడీవోకు రాజీనామా లేఖలు అందజేసినట్లు వారు పేర్కొన్నారు.

News April 8, 2024

అనకాపల్లిలో చిన్నారిని ఎత్తుకున్న పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనకాపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ప్రజలను ఆకట్టుకునే విధంగా వ్యవహరించారు. ఓ చిన్నారిని ఎత్తుకున్న సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే అనకాపల్లి ప్రజల సెంటిమెంట్ అయిన నూకాంబిక అమ్మవారిని తలుచుకుని ప్రసంగాన్ని ప్రారంభించారు. కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక జాతరకు రాష్ట్రస్థాయి గుర్తింపు కల్పిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 8, 2024

విశాఖ రైల్వే స్టేషన్‌లో పాక్షికంగా కుంగిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్

image

విశాఖ రైల్వే స్టేషన్‌లో మూడవ ఎంట్రన్స్ ఎదురుగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది. వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. కుంగిన ఫుట్ ఓవర్ వంతెన మీద రాకపోకలను నిలిపివేశారు. రైళ్ల రాకపోకలకు ప్రయాణికులకు ఎటువంటి అంతరాయం లేదని రైల్వే అధికారులు తెలిపారు. దీని మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు.

News April 8, 2024

విశాఖ: ఈ స్థానాల్లో సైకిల్ గుర్తు లేనట్లేనా..!

image

పొత్తులో భాగంగా ఈసారి విశాఖ ఎంపీ సీటు TDPకి, అనకాపల్లి, అరకు స్థానాలను BJPకి కేటాయించారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో TDP-9, జనసేన-4, BJP-2 ఇచ్చారు. అయితే అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి అసెంబ్లీ స్థానాల్లో జనసేన..అరకులో BJP అభ్యర్థి బరిలో ఉన్నారు. దీంతో ఆయా నియోజవర్గాల్లో ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేసే అవకాశం లేనట్లే. దీంతో స్థానిక టీడీపీ నేతలు ఉమ్మడి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు.

News April 8, 2024

పరవాడ: ‘మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం’

image

పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో రెండు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించినట్లు సీఐటీయూ నాయకుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. సిరిపురానికి చెందిన ఆళ్ల గోవిందు కుటుంబానికి రూ.32.50 లక్షలు, పూసపాటిరేగ మండలానికి చెందిన రమణ కుటుంబానికి రూ.35 లక్షలు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని పేర్కొన్నారు.

News April 8, 2024

విశాఖ: ‘ఇంకా అందని జగనన్న విద్యా దీవెన’

image

విద్యా సంవత్సరం ముగుస్తున్న జగనన్న విద్యాదీవెన నిధులు ఇంతవరకు జమ కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నట్లు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తెలిపారు. దీంతో ఆయా కళాశాలకు ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు చెబుతున్నాయన్నారు. మార్చి 1 తేదీన బటన్ నొక్కి 9 లక్షల మంది విద్యార్థులకు రూ.708 కోట్లు విడుదల చేసామని ప్రభుత్వం గొప్పలు చెప్తుందని అన్నారు.

News April 8, 2024

విశాఖ: పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బిల్లు బకాయిలు

image

ఆరోగ్యశ్రీలో పేదలకు ఉచిత వైద్యం అందించిన నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లులు పేరుకుపోయాయి. జిల్లాలో 55 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలుచేస్తుండగా వాటికి సుమారు ఏడు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. దీంతో సుమారు రూ.70 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఒక్కో ఆస్పత్రికి కనిష్టంగా రూ.25 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

News April 8, 2024

విశాఖ: ఈనెల 15 నుంచి సముద్రంలో వేట నిషేధం

image

సముద్ర జలాల్లో 61 రోజులపాటు చేపల వేట నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. 15 ఏప్రిల్ నుంచి జూన్ 14 వరకు యాంత్రిక పడవలు, మెకనైజ్డ్ మోటర్ బోట్ల ద్వారా చేపల వేటను నిషేధిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కాలంలో చేపల, రొయ్యల జాతుల సంతానోత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఎవరైనా చేపలు వేట చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

News April 7, 2024

అనకాపల్లి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

image

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో అనకాపల్లి చేరుకున్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనకాపల్లి పట్టణం నెహ్రు చౌక్ వద్ద ఎన్డీఏ శ్రేణులు బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

News April 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌ని వదులుకునే ప్రసక్తే లేదు: బొత్స ఝాన్సీ

image

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ని వదులుకునే ప్రసక్తే లేదని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి స్పష్టం చేశారు. ఆదివారం గాజువాకలో మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. వైవీ సుబ్బారెడ్డి, గాజువాక అభ్యర్థి గుడివాడ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.