India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బి ఫార్మసీ ఆరో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తెలిపారు. ఆగస్టు నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను ఈరోజు విడుదల చేసి ఏయూ వెబ్సైట్లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం నవంబర్ 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్సైట్ నుంచి విద్యార్థులు పొందవచ్చును.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం నుంచి స్టీల్ ప్లాంట్‌పై సానుకూల పరిణామాలు చోటు చేసుకున్నాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు. విశాఖలో జరిగిన జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.1,700 కోట్లను కేంద్రం విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధుల విడుదల ద్వారా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌పై సానుకూల దృక్పథంతో ఉన్నట్లు స్పష్టమవుతుందన్నారు.
సీఎం కుర్చీలో కూర్చోడానికి సొంత బాబాయ్‌ని వైఎస్ జగన్ చంపించేశాడని హోంమంత్రి అనిత ఆరోపించారు. తల్లీ, చెల్లి మీద ఏదోరోజు కేసు పెడతారనుకున్నాం.. అలానే కేసు పెట్టారని ఆమె అన్నారు. బాబాయ్ మృతి విషయంలో సీఐడీ పేరుతో చెల్లిని కామ్ అప్ చేశారని ఎద్దేవా చేశారు. అన్న కోసం ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన షర్మిళ.. ఎన్నికల ముందు ఎదురుతిరిగిందన్న ఆమె.. జగన్ నిజస్వరూపం ఏంటో వాసిరెడ్డి పద్మ చెప్పారని అన్నారు.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతున్న సర్వసభ్య సమావేశానికి గురువారం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సమావేశ మందిరానికి వచ్చిన హోంమంత్రికి ఉమ్మడి విశాఖ జిల్లా జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ సుభద్ర, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌తో పాటు పలువురు అధికారులు ప్రతినిధులు స్వాగతం పలికారు.
అల్లూరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగిందని విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరుగుతున్న సర్వసభ్య సమావేశంలో పంట నష్టం మంజూరుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన కలెక్టర్లు హరీంద్ర ప్రసాద్, విజయ్ కృష్ణన్, దినేశ్ కుమార్ పాల్గొన్నారు.
విశాఖకు చెందిన క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, రికీ భుయ్ భారత్-ఏ జట్టుకు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా-ఏ జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడనున్నారు. అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా టార్‌కు వెళ్లే టీం ఇండియాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. కాగా.. నితీశ్ కుమార్ రెడ్డిని బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
పెందుర్తి కేంద్రంగా గల విశాఖ శ్రీ శారదా పీఠానికి గత ప్రభుత్వం కారుచౌకగా భూములను కేటాయించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎకరం రూ.20 కోట్ల ధర పలికే భూమిని కేవలం రూ. లక్ష రూపాయలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. అందుకనే భూముల కేటాయింపును రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
విశాఖ పోలీసు శాఖలో హోమ్ గార్డుగా విధులు నిర్వర్తించిన మహమ్మద్ హాసం న్యూరో సమస్యలతో అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా కాంట్రిబ్యూషన్ ఫండ్ నుంచి సదరు హోంగార్డ్ భార్య జరీనా కౌషర్ కి బుధవారం ఆర్థిక సహాయం కింద చెక్ అందించారు. అనంతరం ఆమెకు కారుణ్య నియామకం క్రింద హోమ్ గార్డు ఉద్యోగం నియామక పత్రాన్ని కమిషనర్ శంఖబ్రాత భాగ్చి అందజేశారు.
ఏయూ విద్యార్థుల వినతిని అధికారులు పరిశీలించి ప్రస్తుతం ఉన్న సెమిస్టర్ పరీక్ష ఫీజులో రూ.450 తగ్గించి నిర్ణయం తీసుకున్నారు. ఏయూ ఆర్ట్స్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు అధికారులను కలిసి లిఖిత పూర్వకంగా పరీక్ష ఫీజును తగ్గించాలని, పరీక్ష ఫీజు చెల్లించే గడువును నవంబర్ 2వ తేదీ వరకు పొడిగించాలని వీసీ ఆచార్య జి.శశిభూషణరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావులకు వినతిపత్రం అందజేశారు.
అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.