Visakhapatnam

News October 23, 2024

నవంబర్ 18 నుంచి అయోధ్యలో విశ్వశాంతి మహాయాగం

image

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ యాగాన్ని నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

News October 23, 2024

విశాఖ: మన్యం బిడ్డకు అరుదైన అవకాశం

image

అల్లూరి జిల్లా హుకుంపేట మండలం తడిగిరి పంచాయతీ ఉక్కుర్భకి చెందిన పరదాని రమణమూర్తికి అరుదైన అవకాశం లభించింది. పర్యావరణ అధ్యయనం కోసం అంటార్కిటికా ఖండంలో 2నెలల పాటు అధ్యయనం చేసేందుకు ఎంపికైన ఐదుగురు భారత శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించే గౌరవం దక్కింది. రమణమూర్తి ఏయూలో మాస్టర్ డిగ్రీలో బయోఫిజిక్స్ పూర్తి చేశారు. విశాఖపట్నం భూ అయస్కాంత పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు.

News October 23, 2024

విశాఖకు 724 కి.మీ. దూరంలో ‘దానా’

image

విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 724 కి.మీ. దూరంలో ‘దానా’ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇది క్రమేపి ఒడిశా వైపు కదులుతోందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, జాగ్రత్తలు పాటించాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.

News October 23, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె రద్దు

image

ఈ నెల 28వ తేదీన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె రద్దయింది. ఈ మేరకు మంగళవారం స్టీల్ ప్లాంట్ లో జరిగిన అఖిల పక్ష కార్మిక సంఘాల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ప్లాంట్ పరిస్థితి దృష్ట్యా యజమాన్యం అభ్యర్థన మేరకు సమ్మె చేయకూడదని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఆ రోజు సమ్మెకు బదులుగా అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా నిర్వహించాలని తీర్మానంలో పేర్కొన్నారు.

News October 23, 2024

నాలుగు గంటలు ఆలస్యంగా బొకారో

image

పలురైళ్లు బయలుదేరే సమయాలను మార్పు చేసినట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. అల్పూజా-ధన్బాద్(13352) బొకారో ఎక్స్ ప్రెస్ ఈరోజు ఉదయం 6 గంటలకు బదులు 4.10గంటలు ఆలస్యంగా ఉదయం 10.10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశారు. ప్రయాణీకులు ఈ మార్పును గమనించి తదనగుణంగా తమ ప్రయాణాన్ని మార్పు చేసుకోవాలని సూచించారు.

News October 23, 2024

విశాఖ: డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ అన్ని న్యాయస్థానాల్లో నిర్వహించనున్నారు. కోర్టుల్లో పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్ట వ్యవహారాల కేసులు, బ్యాంక్ మనీ రికవరీ కేసులు, కార్మిక, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాల కేసులు పరిష్కరించుకోవచ్చునని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తెలిపింది.

News October 23, 2024

అనకాపల్లి: ‘ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి’

image

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ సూచించారు. మంగళవారం ఢిల్లీ పార్లమెంట్ భవనంలో రైల్వే స్టాండింగ్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ఇతర అంశాలపై ఆయన సమీక్షించారు. రైల్వే వ్యవస్థ కార్యకలాపాల్లో భాగంగా భద్రతను పెంపొందించాలన్నారు.

News October 22, 2024

జల వనరుల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా విశాఖ

image

జల వనరుల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా విశాఖ ఎంపికైంది. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఢిల్లీలో భార‌త రాష్ట్రప‌తి చేతుల మీదుగా జాతీయ నీటి అవార్డును విశాఖ కలెక్ట‌ర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ అందుకున్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.

News October 22, 2024

విశాఖ: ఈనెల 23,24,25 తేదీలలో రైల్లు రద్దు

image

దానా తుఫాన్ నేపథ్యంలో ఈనెల 23 ,24, 25 తేదీల్లో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ మంగళవారం వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో ముందస్తుగా 23న సికింద్రాబాద్- భువనేశ్వర్- విశాఖ, హౌరా మెయిల్‌తో సహా 16, 24న హౌరా-MGR చెన్నై, విశాఖ భువనేశ్వర్ వందేభారత్, పూరి- తిరుమల సహా 35, 25న 11 ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు దీనిని గమనించాలని ఆయన కోరారు.

News October 22, 2024

విశాఖ: ఈనెల 23,24,25 తేదీలలో రైల్లు రద్దు

image

దానా తుఫాన్ నేపథ్యంలో ఈనెల 23 ,24, 25 తేదీల్లో పలు ట్రైన్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే.సందీప్ మంగళవారం వెల్లడించారు. తుఫాను నేపథ్యంలో ముందస్తుగా 23న సికింద్రాబాద్- భువనేశ్వర్- విశాఖ, హౌరా మెయిల్‌తో సహా 16, 24న హౌరా-MGR చెన్నై, విశాఖ భువనేశ్వర్ వందేభారత్, పూరి- తిరుమల సహా 35, 25న 11 ట్రైన్లు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు దీనిని గమనించాలని ఆయన కోరారు.