Visakhapatnam

News June 8, 2024

విశాఖ: టికెట్ చెకింగ్ సిబ్బందికి బాడీ వోర్న్ కెమెరాలు

image

విశాఖ రైల్వే డివిజన్ పరిధిలో చెకింగ్ సిబ్బందికి డీఆర్ఎం సౌరం ప్రసాద్ బాడీ వోర్న్ కెమెరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారదర్శకత, జవాబుదారీతనం భద్రతను పెంచడానికి ఈ కెమెరాలు దోహద పడతాయన్నారు. రైళ్లలోను, రైల్వే స్టేషన్లలోనూ తనిఖీ ప్రక్రియను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News June 8, 2024

అల్లూరిలో అభ్యర్థి ఎవరైనా వైసీపీదే విజయం

image

అరకు, పాడేరు నియోజకవర్గాలు YCPకి కంచుకోటగా మారాయి. రెండింటిలోనూ YCP ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 2014 నుంచి YCP పోటీలో నిలవగా.. 3సార్లు వేర్వేరు అభ్యర్థులే పోటీచేసి గెలిచారు. అరకులో 2014లో కిడారి సర్వేశ్వరరావు, 2019లో చెట్టి ఫాల్గుణ, 2024లో రేగం మత్స్యలింగం గెలిచారు. ఇటు పాడేరులో 2014 గిడ్డి ఈశ్వరి, 2019లో భాగ్యలక్ష్మి, 2024లో విశ్వేశ్వర రాజు గెలిచారు. అరకు MP స్థానంలో కూడా ఇదే ఫార్ములా నడిచింది.

News June 8, 2024

విశాఖలో డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి

image

విశాఖలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని ఓ డ్రైన్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికులకు సహాయంతో గెడ్డలో పడిపోయిన వ్యక్తిని పోలీసులు బయటకు తీశారు. మృతుడు 45 వయస్సు పోలీసులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

విశాఖతో రామోజీరావుకి విడదీయరాని అనుబంధం

image

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావుకు విశాఖతో విడదీయరాని అనుబంధం ఉంది. పత్రికా రంగంలో కొత్త ఒరవడలు సృష్టించిన ఈనాడు దినపత్రిక విశాఖ నుంచే ఆయన ప్రారంభించారు. అనతి కాలంలోనే ఆ పత్రిక అపూర్వ ప్రజాధరణ పొందింది. అదేవిధంగా నగరంలో డాల్ఫిన్ హోటల్‌ను ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పటికీ నగరంలో ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ ఆ డాల్ఫిన్ హోటల్‌కు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.

News June 8, 2024

విశాఖ బీచ్‌లో గుర్తుతెలియని యువకుడి మృతదేహం

image

విశాఖ ఆర్.కె బీచ్‌లో గుర్తు తెలియని ఓ యువకుడి మృతదేహం కొట్టుకువచ్చింది. నలుపురంగు టీషర్ట్ వేసుకొని.. చేతిపై జైశ్రీరాం అని పచ్చబొట్టు ఉందని మహారాణిపేట ఎస్.ఐ లక్ష్మీ తెలిపారు. ముఖంపై గాయాలను గుర్తించామని వెల్లడించారు. మృతుని వివరాలు తెలిసినవారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. 94407 96010, 83310 41628 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.

News June 8, 2024

ఉమ్మడి విశాఖలో మంత్రులు ఎవరు?

image

ఉమ్మడి జిల్లాలోని అరకు, పాడేరు మినహా మిగిలిన చోట్ల కూటమి విజయం సాధించింది. TDP నుంచి గంటా, అయ్యన్న, బండారు వంటి మాజీ మంత్రులు ఉన్నారు. మహిళా కోటాలో అనిత ఉండగా.. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన పల్లాతోపాటు ఎక్కసార్లు గెలిచిన వెలగపూడి, గణబాబు కూడా TDP అభ్యర్థులే. జనసేనలో మాజీ మంత్రి కొణతాలతో పాటు పంచకర్ల, మొదటిసారి గెలిచిన సుందరపు, వంశీ ఉన్నారు. బీజేపీ తరఫున విష్ణుకుమార్‌కు ఇది రెండో విజయం.

News June 8, 2024

విశాఖ: ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం

image

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష మరికొద్ది సేపట్‌లో ప్రారంభం కానుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 52 ఆన్‌లైన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. పరీక్షకు 10,805 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ ఆచార్య టీవీ కృష్ణ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఆయన తెలిపారు.

News June 8, 2024

అనకాపల్లిలో 40 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన బీజేపీ

image

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో 40 ఏళ్ల రికార్డును BJP బ్రేక్ చేసింది. 1962లో జరిగిన పునర్విభజనలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గ కేంద్రమయ్యింది. అప్పటినుంచి 2019వ రకు టీడీపీ ఎంపీ పి.అప్పల నరసింహం మెజారిటీ రికార్డుగా ఉండేది. ఆయన సాధించిన 1.74 లక్షల ఓట్ల మెజార్టీని 40 ఏళ్ల తర్వాత బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ అధిగమించారు. వైసీపీ అభ్యర్థి ముత్యాలనాయుడుపై 2.96 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.

News June 8, 2024

విశాఖ నుంచే ఈనాడు ప్రస్థానం

image

రామోజీ సంస్థల పేరుతో అనేక వ్యాపారాలు చేసిన రామోజీరావుకు ఈనాడు ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. 1974 ఆగస్టు 10న విశాఖలో సీతమ్మధార సమీపంలోని నక్కవానిపాలెం ఈనాడు ఆఫీసును ప్రారంభించారు. మొదట 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలైంది. అప్పట్లో చాలా పత్రికల పేర్లు ఆంధ్ర పదంలో మొదలయ్యేవి. దానికి భిన్నంగా అచ్చమైన తెలుగు పదంతో ప్రారంభించిన ఈనాడుకి ఈ ఆగస్టు 10కి యాభై ఏళ్లు. ఆ పండగ చూడకుండానే రామోజీ కన్నుమూశారు.

News June 8, 2024

ఈనెల 13న స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు

image

స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఈనెల 13న జీతాలు చెల్లించనున్నారు. ఈ విషయాన్ని కార్మిక సంఘాలకు స్టీల్ ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ తెలియజేసినట్లుకార్మిక నాయకులు తెలిపారు. శుక్రవారం స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనంలో జరిగిన సమావేశంలో జీతాలు చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సిఎండి 13న జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు కార్మిక సంఘ నాయకులు పేర్కొన్నారు.