Visakhapatnam

News June 8, 2024

విశాఖ జిల్లా DCCB ఛైర్మన్ పదవికి కోలా రాజీనామా

image

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఛైర్మన్ పదవికి విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కోలా గురువులు రాజీనామా చేశారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీ పరంగా వచ్చిన ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తన రాజీనామా లేఖను రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతో తాను పదవికి రాజీనామా చేస్తున్నానని ఆమోదించాలని లేఖలో పేర్కొన్నారు.

News June 8, 2024

ఈనెల 9,10,11వ తేదీల్లో రక్తదాన శిబిరం: సబ్ కలెక్టర్ ధాత్రి

image

రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్నవారు ముందుకు రావాలని పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డి శుక్రవారం కోరారు. అత్యవసర సమయంలో రక్తం లభించక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈమేరకు ఈనెల 9,10,11వ తేదీల్లో జరగనున్న మోదకొండమ్మ పండుగ సమయంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రాంగణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధాత్రి తెలిపారు. ఆసక్తి గల వారు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.

News June 7, 2024

జర్నలిస్టుల సహకారం మరువలేనిది: విశాఖ కలెక్టర్

image

ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని, పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని కలెక్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పన, సవరణ ప్రక్రియకు సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేశారన్నారు. వివిధ మార్గాల్లో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు.

News June 7, 2024

టీచర్ల బదిలీలలో అక్రమ వసూళ్లు: గండి బాబ్జి

image

టీచర్లను బదిలీ చేస్తామంటూ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని విశాఖ టీడీపీ అధ్యక్షుడు గండి బాబ్జి ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల బదిలీల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.3నుంచి 6 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై టీచర్లు ఫిర్యాదు చేసారన్నారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News June 7, 2024

పాడేరు: ఐదురోజుల భారీ వాహనాలు నిషేధం

image

మోదకొండమ్మ జాతర సందర్భంగా రేపటి నుంచి ఐదు రోజులపాటు పాడేరు ఘాట్‌లో భారీ వాహనాలను నిషేధించామని కలెక్టర్ విజయ సునీత తెలియజేశారు. అమ్మవారి జాతర ఈనెల 9,10,11 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లపై ఉత్సవ కమిటీతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులతో పాటు ఉత్సవ కమిటీకి సూచించారు.

News June 7, 2024

ఆ ఫైల్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి: జనసేన

image

ఉత్తరాంధ్రాలో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల అసైన్డ్ భూములు జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్‌లపై నిఘా పెట్టాలని, సంబంధిత ఫైళ్లు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలక్టరేట్ల నుంచి అసైన్డ్ ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండు చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

News June 7, 2024

AU: జూలై 31 నుంచి బీఈడీ నాలుగో సెమిస్టర్

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలను జూలై 31 నుంచి ఆగస్టు 3వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టార్ (పరీక్షలు) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 నిమిషాల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 31న కాంటెంపరరీ ఇండియన్ ఎడ్యుకేషన్, ఒకటో తేదీన జెండర్ స్కూల్ అండ్ సొసైటీ, 2వ తేదీన ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ 3వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి.

News June 7, 2024

AU: జూలై 9 నుంచి బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలను జూలై 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్టర్ (ఎగ్జామినేషన్స్) జె.రత్నం తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి5 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. తేదీల వారీగా పరీక్షలు వివరాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షలు వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.

News June 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై దృష్టి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రతినిధులు గురువారం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సత్కరించి అభినందించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెడతానన్నారు. ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.

News June 7, 2024

విశాఖ: రేపు ఎడ్ సెట్ ప్రవేశపరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీ ఎడ్ సెట్ కన్వీనర్ టీవీ కృష్ణ తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. నిర్దిష్ట సమయానికి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.