India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ కలెక్టరేట్‌లో మంగళవారం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సులు, 22 ఏ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై మంత్రి సమీక్షిస్తారు. ముందుగా ప్రజల నుంచి మంత్రి వినతి పత్రాలు స్వీకరిస్తారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు.

ఎలమంచిలి పట్టణ రామ్మూర్తి నగర్‌లో గల రిటైర్డ్ ఎక్సైజ్ ఉద్యోగి బీవీ రమణ ఇంటిలో దొంగలు పడి రూ.4 లక్షలు, 4 తులాల బంగారం దోచుకుపోయారు. ఇంటికి తాళాలు వేసి రమణ కుటుంబ సభ్యులు బళ్లారి వెళ్లారు. సోమవారం పనిమనిషి వచ్చి చూడగా తాళం తీసి ఉంది. రమణ ఇంటికి వెళ్లమనడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా నగదు, బంగారం పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్‌లో బాల శేఖర్ (19) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మొబైల్ షాప్‌లో పనిచేస్తున్న బాల శేఖర్ ప్రేమ విఫలం కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలంలో ప్రేమలేఖ లభ్యమయింది. సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 117 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. ప్రజలు నుంచి నేరుగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడాలని ఆదేశించారు.పిర్యాదు దారుల సమస్యలను తెలుసుకొని చట్టపరంగా సమస్య పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలన్నారు.

దివ్యాంగులు, వయోవృద్ధుల సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరాలను ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం తెలిపారు. దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు అందించేందుకు ఈ నెల 19న భీమిలి రెడ్డిపల్లి జెడ్పీ హై స్కూల్ ఆవరణలో, 20న విశాఖ నీలమ్మ వేపచెట్టు వద్ద ఉన్న ఎం.జి.ఎం హైస్కూల్లో, 21న విశాఖ వెస్ట్ పరిధిలో క్వీన్ మేరీ హైస్కూల్ వద్ద ఈ శిబిరాలు నిర్వహిస్తామన్నారు.

మాకవరపాలెం(M) జంగాలపల్లిలో కోళ్లఫారంలో పనిచేస్తున్న గిరిజన యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పాడేరు మండలం బడిమెలకు చెందిన గోల్లూరి సంతి(19) భర్త కొర్రా చరణ్‌తో కలసి జంగాలపల్లిలో కోళ్లఫారంలో పనిచేసేందుకు చేరారు. సోమవారం కోళ్లకు మేత వేసే విషయంలో ఇద్దరికీ వివాదం తలెత్తింది. దీంతో మనస్తాపానికి గురై ఆమె ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ దామోదర్ తెలిపారు.

అనకాపల్లి జిల్లా పోలీసు కార్యలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, చీటింగ్ తదితర ఫిర్యాదులు అందాయి. ఈ సందర్బంగా ఎస్పీ నేరుగా ఫిర్యదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఏపీలో పర్యటక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిలో స్కై సైక్లింగ్ జిప్‌లైనర్ ఇటీవల ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూ.300గా టిక్కెట్ ధరను నిర్ణయించారు. జల విన్యాసాలపై అసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్‌లో మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు పారా గ్లైడింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు.

ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 170 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లను తొలగించారు. ఎంతోకాలంగా సేవలందిస్తూ వచ్చిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నిస్తున్నారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం అనుసరించిన విధానం కారణంగానే కోర్టు తమను తొలగించిందని వారు పేర్కొన్నారు.

చీడికాడకు చెందిన వేచలపు మణికంఠ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ చెప్పారు. మణికంఠ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తక్కువ కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని ఎవరో అవమానించడంతో ఈనెల 11న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
Sorry, no posts matched your criteria.