India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
SMV బెంగళూరు నుంచి రేణిగుంట, విజయవాడ మీదుగా నడుస్తున్న SMV బెంగళూరు – హౌరా ఎక్స్‌ప్రెస్ (12864) శనివారం 10:35 గంటలకు బయలుదేరడానికి బదులుగా 14:00 గంటలకు బయలుదేరనుంది. విశాఖకు రేపు ఉదయం 8:00 గంటలకు చేరుకోవచ్చు కావున ప్రయాణికులు ఈ మార్పును గమనించగలరని రైల్వే అధికారులు కోరారు.
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఈనెల 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం 9 గంటలకు నిర్వహించే వరలక్ష్మి వ్రతం పూర్తిగా ఉచితమని పేర్కొన్నారు. భక్తులకు ఆ రోజు కొండ దిగువ నుంచి కొండపై వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు కుంకుమ, జాకెట్, ప్రసాదం ఉచితంగా అందిస్తామన్నారు. స్వామివారి దర్శనం కూడా ఉచితంగా కల్పిస్తామన్నారు.
రైళ్లలో మహిళలు, దివ్యాంగులకు రిజర్వ్ చేసిన బోగీలలో ఇతర ప్రయాణికులు ఎక్కితే ఆర్‌పీఎఫ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆ బోగీలలో ఎక్కిన 100 మందిని అదుపులోకి తీసుకొని ఆర్పీఎఫ్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసులు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. బోగీలలో కాలు మోపేందుకు కూడా అవకాశం లేకపోవడంతో మహిళల, దివ్యాంగుల బోగీలలో ఎక్కుతున్నారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ప్రమాదం జరిగిన ఎసెన్షియా కంపెనీని యాజమాన్యం తాత్కాలికంగా మూసివేసింది. లోపల ప్రమాదంలో దెబ్బతిన్న భవనాల పునర్ నిర్మాణ పనులు ప్రారంభించడానికి శకలాలను తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నం అయ్యారు. దీనిని 2019 ఏప్రిల్‌లో ప్రారంభించారు. రూ.200 కోట్ల వ్యయంతో 40 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడ మైగ్రేన్, క్యాన్సర్ నివారణ మందులు తయారవుతాయి. 400 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్‌లో 270 మంది ఇంజినీరింగ్ ఇన్‌ఛార్జ్ అధికారులకు యాజమాన్యం శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న కాంట్రాక్ట్ పనుల్లో పాల్గొంటున్న ఒప్పంద కార్మికుల విధులకు, కాంట్రాక్టర్ సమర్పించిన హాజరు సరిపోకపోవడంతో ఉద్దేశపూర్వకంగా చేసినట్లు తెలుస్తోందని ఆ నోటీసులో యాజమాన్యం పేర్కొంది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భూ పరిరక్షణ జిల్లా స్థాయీ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, దేవాదాయ శాఖకు చెందిన భూములు ఆక్రమణ కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జిల్లాలోని 11 దేవాలయాలకు చెందిన భూములు ఆక్రమణలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల ఈఓలు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు పాల్గొన్నారు.
శాసనమండలిలో వైసీపీ తరఫున ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు శాసనమండలి సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు. కాగా బొత్స ఇటీవల విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, జగన్ ప్రభుత్వంలోను ఆయన కీలక పాత్ర పోషించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో జెన్‌ప్యాక్ట్‌లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆ సంస్థ విశాఖ జిల్లా అధికారి సాయికృష్ణ చైతన్య వెల్లడించారు. ఏదైనా బీటెక్, డిగ్రీ, చదివి.. 2022, 23, 24లో పాసైన విద్యార్థులు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు ఈ డ్రైవ్‌లో పాల్గొనాలని కోరారు. వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వచ్చే దరఖాస్తులను బట్టి ఇంటర్వ్యూ జరిగే తేదీ, స్థలం వివరాలు వెల్లడిస్తామన్నారు.
పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. హోం మంత్రితో పాటు ఇతర అధికారులు ఘటనా స్థలానికి వెంటనే వెళ్లాలని ఆదేశించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ వాడాలని సూచించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. మరోవైపు గాయపడిన నలుగురిలో ఒకరి కండిషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన వాళ్లు సైతం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్న విషయం తెలిసిందే.
ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఫార్మా సంస్థల్లో వరుస ప్రమాదాలు అందరిలో భయాందోళనలు రేపుతున్నాయి. మొన్న అచ్యుతాపురం సెజ్‌లో 17 మంది చనిపోగా.. నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థలో నలుగురు గాయపడ్డారు. బాధితులు ఝార్ఖండ్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదంపై ఇంత వరకు ఆ కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదని సమాచారం.
Sorry, no posts matched your criteria.