India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి విశాఖ జిల్లాలో అనేక ప్రాంతాల్లోని రసాయనిక పరిశ్రమల్లో 2019 నుంచి 2024 ఆగస్టు వరకు ఎన్నో ప్రమాదాలు, పేలుళ్లు జరిగాయి. అచ్యుతాపురంలో తాజాగా జరిగిన ప్రమాదంలో సుమారు 17 మంది మృతిచెందారు. అంతకుముందు అనేక పరిశ్రమల్లో మరో 43 మందికి పైగా మృతిచెందారు. పరవాడ, అచ్యుతాపురం, రాంబిల్లి, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
అచ్యుతాపురం ఘటన బాధితులను పరామర్శించేందుకు సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకున్నారు. స్థానిక ఎయిర్‌పోర్టులో ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. మరికాసేపట్లో ఆయన రోడ్డు మార్గాన మెడికోవర్ హాస్పిటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ క్షతగాత్రులకు భరోసా కల్పించి నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన ఇస్తారని సమాచారం.
ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం లేదని విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్ చెప్పారు. కేజీహెచ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మొత్తం 41 మంది గాయపడ్డారు. చాలా మందికి 30 నుంచి 40 శాతం గాయాలయ్యాయి. నష్టపరిహారంపై మృతుల బంధువులు తొలుత ఆందోళన చేశారు. మేము వాళ్లతో మాట్లాడాం. రూ.కోటి ఇస్తామని ప్రకటించడంతో పోస్టుమార్టానికి వాళ్లు ఒప్పుకున్నారు’ అని చెప్పారు.
అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. దేశ ప్రధాని మోదీ సైతం స్పందించారు. మృతిచెందిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తామని మోదీ ప్రకటించారు. మరోవైపు విశాఖ కలెక్టర్ మృతులకు రూ.కోటి అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.1.02 కోట్లు అందనుంది.
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల్లో ఎక్కువ మంది యువతరమే కావడం విషాదాన్ని నింపుతోంది. ఉపాధి కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చారు. నైపుణ్యం లేకపోయినా ఫార్మా కంపెనీలోనే ఎక్కువగా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. దీంతో యువకులు ఫార్మా పరిశ్రమలో చేరుతున్నారు. చనిపోయిన వారిలో ఆరుగురు 30 ఏళ్ల లోపు, మరో ఆరుగురు 40 ఏళ్ల లోపు వాళ్లు కాగా.. వీరిలో కొందరికి ఇంకా వివాహం కాలేదు.
అచ్యుతాపురం ఫార్మా ప్రమాద ఘటనపై వైఎస్ షర్మిల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన కుటుంబాలకు తక్షణ పరిహారం ప్రకటించాలని కోరారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో విచారణ నిర్వహించాలన్నారు.
యాదగిరి పెండ్రీ అనే వ్యక్తి ఎసెన్షియా కంపెనీనీ తొలిసారి 2007లో అమెరికాలో స్థాపించారు. తర్వాత హైదరాబాద్, విశాఖపట్నానికి ఆ కంపెనీ విస్తరించింది. అచ్యుతాపురం సెజ్‌లో ఈ కంపెనీ 2016లో రిజిస్టర్ అయ్యింది. 2019 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. వివిధ రకాల సిరప్‌లతో పాటు కొత్ మెడిసిన్ కోసం ప్రయోగాలు చేస్తుంటారు. కాగా ప్రస్తుతం పెండ్రీ అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది.
అచ్యుతాపురం దుర్ఘటనలో ఒక్కొక్కరదీ ఒక్కో విషాద గాథ. అచ్యుతాపురం(M) మోటూరుపాలేనికి చెందిన పూడి మోహన్(20), నానిబాబు అన్నదమ్ములు. రోజువారీ కూలీలుగా ఎసెన్షియా కంపెనీలో పనిచేస్తున్నారు. తమ్మడు నాని బాబు ఏ షిప్ట్ కావడంతో 2 గంటలకు డ్యూటీ దిగాడు. అదే సమయంలో మోహన్.. నానిని పలకరించి డ్యూటీ ఎక్కాడు. తర్వాత అరగంటలోనే మోహన్ చనిపోవడంతో నాని బోరున విలపించాడు. మరోవైపు కార్మికుల బంధువులు పరిశ్రమ బయట రోదించారు.
అచ్యుతాపురం ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలడంతో మొత్తం 18 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అందులో మొదటి అంతస్తు శిథిలాల కిందే 9 మృతదేహాలను అధికారులు గుర్తించారు. వీటిని బయటకు తీయడానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మృతుల్లో ఎక్కువమంది ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారే ఉండటంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
అనకాపల్లి జిల్లాలో ప్రసూతి మరణాలు సంభవించకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో గత ఆరు నెలలుగా జరిగిన మాతృ మరణాలపై ఆరా తీశారు. తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై ఆమె సమీక్షించారు. రక్తపోటు, రక్తహీనత వంటి సాధారణ పరీక్షలతో పాటు డెలివరీకి వచ్చిన ప్రతి గర్భిణీకి జ్వర పరీక్షలు నిర్వహించాలన్నారు.
Sorry, no posts matched your criteria.