India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ జరిగే విధంగా పోలీసులు భారీ భద్రత చర్యలు చేపడుతున్నట్లు పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. 3000 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. నగరం అంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. 133 సున్నితమైన ప్రాంతాలను గుర్తించామన్నారు. 137 పోలీస్ పికెట్, 79 పెట్రోలింగ్ పార్టీలతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక క్విక్ రియాక్షన్ టీంలను సిద్ధం చేసినట్లు తెలిపారు.
సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ఈ నెల 15 తో ముగియనుంది.ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో అప్పుఘర్,వాసవానిపాలెం, పెద్ద జాలరి పేటలో మత్స్యకారులు వేటకు సన్నద్ధం అవుతున్నారు. చేపల వేటకు అవసరమైన వలలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వేట నిషేధం కారణంగా రెండు నెలలపాటు మత్స్యకారులు ఇంటికే పరిమితం అయ్యారు.
ఎన్నికల కౌంటింగ్ నేపాథ్యంలో ఏయూకి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈవీఎంలను ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని భద్రపరిచారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ఏయూ కళాశాలలో మంగళవారం చేపడుతున్నారు. వర్సిటీలో స్థాయిలో పోలీసులు పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏయూకు సెలవు ప్రకటించారు.
బస్ పాస్ దరఖాస్తు మార్పుల కారణంగా ఈ నెల 6, 7 తేదీల్లో బస్ పాస్ కౌంటర్లకు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎ.అప్పలరాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరల తిరిగి ఈ నెల 8వ తేదీ నుంచి యధావిధిగా బస్ పాసు కౌంటర్లు పని చేస్తాయని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి బస్ పాసు చేయించుకునే వారు కొత్తగా గుర్తింపు కార్డులు పొందాలని సూచించారు. పాత కార్డులు చెల్లవని ఆయన స్పష్టం చేశారు.
పోలీస్ సిబ్బంది వారికి కేటాయించిన స్థానాలకు మంగళవారం ఉదయం నాలుగు గంటలకే చేరుకోవాలని పోలీస్ కమిషనర్ రవిశంకర్ సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రాంగణంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి కమిషనర్ సూచనలు సలహాలు ఇచ్చారు. మద్యం సేవించారని అనుమానం కలిగితే బ్రీత్ ఎనలైజర్స్ ఉపయోగించాలన్నారు. విధులు సక్రమంగా సమయస్ఫూర్తితో నిర్వహించాలన్నారు. ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసే విధంగా విధులు నిర్వహించాలన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వెంటనే రౌండ్ వారీ ఫలితాలను ఎప్పటికప్పుడు వెల్లడించాలని, ఆయా నియోజకవర్గాల ఆర్వోలకు కలెక్టర్ మల్లికార్జున సూచించారు. వెంటవెంటనే నిర్దేశిత వెబ్ సైట్లలో అప్లోడ్ చేయటంతో పాటు మీడియాకు కూడా ఫలితాలను ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. సోమవారం కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు, సూచనలు సలహాలు ఇచ్చారు.
ఉమ్మడి విశాఖలో 15 స్థానాల్లో TDP-8, YCP-2, జనసేన 4, BJP ఒక స్థానంలో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది. అరకు, మాడుగలలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలిపింది. విశాఖ నార్త్‌లో విష్ణుకుమార్ రాజు గెలుస్తారని అభిప్రాయ పడింది. జనసేన పోటీ చేసిన నాలుగు స్థానాలు పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్, యలమంచిలిలో జెండా ఎగువేస్తుందని అంచనా వేసింది. మిగిలిన 8 స్థానాల్లో TDP గెలుస్తుందని తెలిపింది.
గోపాలపట్నం రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్ ఫారం నంబర్-2లో సోమవారం రైలు నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు యశ్వంత్ పూర్‌కు వెళ్ళే రైలు నుంచి జారిపడి ఉంటాడని స్థానికులు, అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ సోమవారం చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు.మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా రావడంతో పాటు.. రేపు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఫలితాలు తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో మరోసారి జగన్ సీఎం అవుతారని చోడవరంలో తాను రెండోసారి గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.
కొయ్యూరు మండలంలోని బూదరాళ్ల నుంచి గూడెం కొత్తవీధి మండలం పెదవలస వెళ్లే రహదారి మధ్యలో ఉన్న బొంతువలస ఘాట్ రోడ్డులో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పెదవలస వైపు నుంచి కొయ్యూరుకు వస్తున్న ఓ గ్యాస్ వాహనం ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఘాట్ దిగుతున్న సమయంలో బ్రేక్ లు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వాహనంలో సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.