Visakhapatnam

News March 28, 2024

విశాఖ నుంచి నాలుగు కొత్త విమాన సర్వీసులు

image

విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కొత్తగా నాలుగు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దేశీయ సర్వీసుల్లో ఈ నెల 31 నుంచి విశాఖపట్నం–ఢిల్లీ మధ్య ఎయిర్‌ ఇండియా, విశాఖపట్నం–హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమానాలు అందుబాటులోకి రానున్నాయి. అంతర్జాతీయ సర్వీసుల్లో విశాఖ–బ్యాంకాక్‌(థాయ్‌లాండ్‌) విమానం ఏప్రిల్‌ 9 నుంచి, విశాఖ–కౌలాలంపూర్‌ (మలేసియా) విమానం ఏప్రిల్‌ 26 నుంచి మొదలవుతుంది.

News March 28, 2024

విశాఖ: ‘ఆర్ఓలు బాధ్యతగా వ్యవహరించాలి’

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఆర్ఓ కూడా తమ విధులను బాధ్యతగా వ్యవహరించాలని ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోస్టల్ బ్యాలెట్ బృందాలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్నారు. ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 27, 2024

విశాఖ: టైగర్‌ ట్రయాంఫ్‌ విన్యాసాలు

image

భారత్, యూఎస్‌ల ఆధ్వర్యంలో టైగర్‌ ట్రయాంఫ్‌–2024 సీఫేజ్‌ విన్యాసాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బుధవారం విశాఖ సముద్ర తీరానికి 40 నాటికల్‌ మైళ్ల దూరంలో విన్యాసాలు నిర్వహించారు. విపత్తు నిర్వహణ, మానవతా సహాయం పేరుతో రెండో రోజు విన్యాసాలు సాగాయి. భారత్‌కు ఐఎన్‌ఎస్‌ జలశ్వా ప్రాతినిధ్యం వహించగా, యూఎస్‌కు యూఎస్‌ఎస్‌ సోమర్‌సెట్, యూఎస్‌ఎస్‌ హాల్‌సే యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.

News March 27, 2024

గాజువాక: ‘హామీని నిలబెట్టుకున్న జగన్’

image

సీఎం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారని ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గాజువాకలో పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30లక్షల మందికి సొంత ఇంటి కలలు నిజం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. మంత్రి అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి ఝాన్సీ పాల్గొన్నారు.

News March 27, 2024

పొత్తులో భాగంగా మారిన అరకు సీటు

image

అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావును అధిష్ఠానం ఎంపిక చేసింది. నెల రోజుల కిందట టీడీపీ అభ్యర్థి దున్నుదొరని ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా బీజేపీకి పాడేరు అసెంబ్లీ ముందు కేటాయించినా పోటీలో సరైన అభ్యర్థి లేనందున అరకు అసెంబ్లీ సీటుని కోరుకున్నారు. దీంతో అరకు నియోజకవర్గ అభ్యర్థిగా పాంగి రాజారావుకు సీటు కేటాయించారు.

News March 27, 2024

విశాఖ నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థి

image

బీజేపీ కూటమిలో భాగంగా విశాఖ నార్త్‌ సీటుకి విష్ణుకుమార్ రాజు పేరును ప్రకటించింది. ఈయన 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందగా, 2019లో ఓడిపోయారు. 2014లో 18,240 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో నియెజకవర్గంలో నమోదు అయిన అత్యధిక మెజారిటీ ఇదే కావడం విశేషం. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, జనసేన , టీడీపీ కూటమిలో భాగంగా మరోసారి బరిలో నిలుస్తున్నారు.

News March 27, 2024

సింహాచలం: యజ్ఞంలో పాల్గొన్న పీఠాధిపతులు

image

సింహాచలం వరాహ లక్ష్మి నృసింహ ఆలయాన్ని విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సందర్శించారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సుదర్శన నరసింహ మహా యజ్ఞంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాగశాలలో పూజలు చేశారు. అనంతరం స్వామీజీలను వేద పండితులు ఆలయ ఈఓ శ్రీనివాసమూర్తి సత్కరించారు.

News March 27, 2024

విశాఖ: ఎన్నికల ఏర్పాట్లపై ప్రధాన అధికారి సమీక్ష

image

విజయవాడ నుంచి ఎన్నికల ప్రధాన అధికారి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సి విజిల్ ఫిర్యాదులు పరిష్కారం ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ జిల్లా నుంచి జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి మల్లికార్జున జీవీఎంసీ కమిషనర్ సాయి కాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్ తదితరులు ఎన్నికల నిర్వహణపై వివరించారు.

News March 27, 2024

విశాఖ: ఇగ్నోలో అడ్మిషన్లకు గడువు పెంపు

image

ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో అడ్మిషన్ల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు వర్సిటీ గాజువాక స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఎస్వీ కృష్ణ తెలిపారు. యూనివర్సిటీ అందిస్తున్న అన్ని సర్టిఫికెట్, డిప్లమా, పీజీ డిప్లమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎంబీఏ ప్రవేశాలకు అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 0891-3514734 నెంబర్‌కు సంప్రదించాలని కోరారు.

News March 27, 2024

విశాఖ: ధోనీ క్రేజ్.. ఓపెన్ అయిన గంటలోనే..!

image

ఈనెల 31న విశాఖలో చెన్నై సూపర్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసందే. మ్యాచ్‌కు సంబంధించి ఈరోజు ఉ.10 గంటలకు ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులో ఉంచారు. ఓపెన్ అయిన గంటలోపే వెయ్యి, రూ.2వేలు, రూ.3వేలు, రూ.4 వేల టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోగా.. మ.12.30కి మొత్తం టికెట్లు అయిపోయాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ధోనీ క్రేజ్ వల్లే టికెట్లు త్వరగా అయిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు.