India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల ఫలితాల కోసం విశాఖ జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
టూరిజం బోటింగ్ కంట్రోల్ రూం పర్యవేక్షణలో రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో నిర్వహించే మూడు పర్యాటక స్పీడు బోట్లను శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. తుపాను కారణంగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం హెచ్చరికల మేరకు సంబంధిత అధికారులు ఆరు రోజులుగా వీటిని నిలిపివేశారు. తాజాగా పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ యధావిధిగా నడుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు జూన్ నెల 3, 4వ తేదీల్లో సెలవు ప్రకటించినట్లు ప్రిన్సిపల్ సర్కులర్ జారీ చేశారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కళాశాలలోని పలు కార్యాలయాలు, విభాగాలను ఎన్నికల కమిషన్ తమ ఆధీనంలోకి తీసుకుని ప్రాంగణాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఎన్నికల అనంతరం ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచింది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో 3,4 తేదీల్లో సెలవు ప్రకటించారు.
జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత రిటర్న్ అధికారి జారీ చేసిన ఐడీ కార్డ్, పాస్ ఉన్న వారికి మాత్రమే కౌంటింగ్ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. కౌంటింగ్ కేంద్రం లోపలకు మొబైల్ ఫోన్ అనుమతించరు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే శిక్షకు అర్హులవుతారని స్పష్టం చేశారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు అమలు అవుతాయి.
విశాఖ జిల్లాలో 1,64,452 మంది పెన్షన్ దారులు ఉండగా వీరిలో డీబీటీ పద్ధతి ద్వారా 1,17,487 మందికి పెన్షన్ అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో జూన్ 1వ తేదీన నగదు జమవుతుందని చెప్పారు. మిగిలిన 46,965 మంది పెన్షన్ దారుల ఇంటి వద్దకే ప్రభుత్వ యంత్రాంగం పెన్షన్ రూపంలో అందిస్తుందని చెప్పారు. లబ్ధిదారులు ఎక్కడకీ వెళ్లనవసరం లేదని కలక్టర్ వెల్లడించారు.
మద్దిలపాలెంకు చెందిన శ్రీనివాసరావుకు ఈనెల 24న ఫేస్ బుక్‌లో కలెక్టర్ పేరుతో ఉన్న ఫేక్ ఖాతా నుంచి హాయ్ అంటూ తన ఫోన్ నంబర్ పంపమని అడిగారు. శ్రీనివాస్ నెం. షేర్ చేయగానే మరో మెసేజ్ వచ్చింది. అందులో ‘నా ఫ్రెండ్ సంతోశ్ కుమార్ CRPF క్యాంప్ నుంచి బదిలీ అవుతున్నాడు. దీంతో రూ.2.5 లక్షల విలువైన ఫర్నిచర్ రూ.85,000 ఇచ్చేస్తున్నాం, అడ్వాన్స్‌గా రూ.10 వేలు పంపించండి’ అని ఉంది. అతడు ఫోన్ చేసి అడగగా కట్ చేశారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన బాధిత మహిళకు కేజీహెచ్ ప్రసూతి విభాగంలో గురువారం వైద్య పరీక్షలు నిర్వహించారు. లైంగిక ఆరోపణలపై కేసు నమోదు చేసిన వన్ టౌన్ పోలీసులు ఆమెను కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ రకాల పరీక్షలు చేశారు. పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.
విశాఖ <<13346298>>సాగర్ నగర్<<>> కారు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రగుంట్ల క్రాంతికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడ్డ నిందితుడు మద్యం మత్తులో రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరుకు చెందిన డెలవరీ బాయ్ ఎస్.గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని KGHకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు కుటుంబ సభ్యులతో బాలరేవుల బంధువుల ఇంటికి వచ్చి, శుక్రవారం ఉదయం బైక్‌పై తిరిగి పయనమయ్యారు. చింతవానిపాలెం ఘాట్‌లో బైక్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో బైక్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ మృతి చెందారు. మృతుడి భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు 12 గంటల సమయం పట్టొచ్చని కలెక్టర్ మల్లికార్జున అంచనా వేశారు. విశాఖ పశ్చిమలో ఈవీఎం ఓట్ల లెక్కింపు మ.2 గంటలకు, పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల సాయంత్రం 4 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తొలిత పశ్చిమ, తర్వాత విశాఖ దక్షిణ, చివరగా భీమిలి నియోజకవర్గ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున 98 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.