India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రమబద్ధీకరించని పథకాల నిషేధ చట్టం కింద రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విశాఖలో రెండు కేసులు నమోదు చేసినట్లు కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు. కమిషనరేట్లో ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా డిపాజిట్లు సేకరించే కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తీసుకు వచ్చిందన్నారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు నమోదు చేశామని చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గర్భాం మాంగనీస్ గనుల లీజును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించడంపై చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బట్ హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, విశాఖ ఎంపీ శ్రీభరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఓ పాత నేరస్థుడు అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు మేరకు.. జీవీఎంసీ 52వ వార్డులో ఇద్దరు బాలికలు (6, 12ఏళ్లు) శనివారం సాయంత్రం ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నారు. వారిని చూసిన పాత నేరస్థుడు మోహన్ కన్నా అలియాస్ పండు(24) వారి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారాని ప్రయత్నించాడు. ఇది చూసిన స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై వైద్యులు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈక్రమంలో విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద వైద్యుల సెలవులు రద్దు చేశారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావంతో కేజీహెచ్ క్యాజువాలిటీ విభాగం రోగులు లేక శనివారం వెలవెలబోయింది. అత్యవసర రోగుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 25 మంది వైద్యులను ఓపీతో పాటు వార్డుల్లో నియమించి సేవలు అందించారు.
కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ సోమవారం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) ద్వారా వినతుల స్వీకరణ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఆ రోజు ఉదయం నుంచి కలెక్టరేట్ మీటింగ్ హాలులో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరిని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణణ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల స్థితిగతులను గురించి జడ్జికి వివరించారు.
విశాఖలోని రుషికొండ బీచ్‌లో స్నానానికి దిగి మునిగిపోతున్న ముగ్గురు పర్యాటకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారు. హైదరాబాద్‌కు చెందిన 20 మంది శనివారం రిషికొండ బీచ్‌లో సరదాగా గడిపేందుకు వచ్చారు. వారిలో దీపక్ (15), నితిన్ (15), కౌశిక్ (18) సముద్రంలో కొట్టుకుపోతుండగా లైఫ్ గార్డులు సతీష్, రాజు గమనించారు. వెంటనే సముద్రంలోకి వెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.
వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈగలపాటి యువశ్రీ బీజేపీలో చేరారు. శనివారం విశాఖ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ కన్వీనర్ నరసింగరావు ఆధ్వర్యంలో చేరిక జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన నచ్చి బీజేపీలో చేరినట్లు ఆమె తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వివరించారు.
అరకు అందాలు అద్భుతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. శనివారం జస్టిస్ దంపతులు అరకులో పర్యటించారు. వారికి జేసీ అభిషేక్, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ ఘన స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ దంపతులు ట్రైబల్ మ్యూజియం సందర్శించారు. అక్కడ గిరిజన సంస్కృతి సంప్రదాయాలను తిలకించారు. ఆపై గిరిజన సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.
విశాఖ నగరం గురజాడ కళాక్షేత్రంలో ఈనెల 22వ తేదీన 3వేల మంది కళాకారులతో ఉత్తరాంధ్ర జాతర నిర్వహించనున్నట్లు రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వీవీ రమణమూర్తి తెలిపారు. ఉత్తరాంధ్ర కళలకు సంబంధించి జాలారి నృత్యం, తప్పెట గుళ్లు, పులి వేషాలు, కర్రసాము, తదితర ప్రదర్శనలు నిర్వహించనున్నట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారన్నారు.
Sorry, no posts matched your criteria.