India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
థాయ్‌లాండ్‌లో జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ పేరుతో అంతర్జాతీయస్థాయి మోడలింగ్ పోటీలు నిర్వహించారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన విశాఖ బాలుడు కార్తికేయ రెడ్డి సత్తా చాటాడు. ప్రిన్స్ వరల్డ్-2024 టైటిల్ కైవసం చేసుకున్నాడు. గతంలోనూ కాలికట్‌లో జరిగిన జాతీయ స్థాయి మోడలింగ్ పోటీల్లో మొదటి స్థానంలో నిలవడం విశేషం.
సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి శనివారం సుప్రభాత సేవ అత్యంత వైభవంగా నిర్వహించారు. కొవిడ్‌కు ముందు స్వామివారికి కొన్ని సేవలు నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ఆ సేవలను పునఃప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం సుప్రభాత సేవ అర్చక స్వాములు చేపట్టారు. కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా సీలేరుకు చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న మలసాల శ్రీను కుమారుడు సాయితేజ యూరప్‌లో ఉన్నారు. ఈక్రమంలో రష్యాలో 18,500 అడుగుల ఎత్తులో ఉన్న ఎల్ బ్రోస్ పర్వతాన్ని అధిరోహించి అక్కడ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. ఇందుకు తనకు ఆరు రోజులు పట్టిందని.. ఈ ఘనత సాధించడం చాలా ఆనందంగా ఉందని సాయితేజ పేర్కొన్నాడు.
సింహాచలంలో సహస్రనామార్చన సేవ తిరిగి ప్రారంభించారు. అంతరాలయంలో రోజూ జరిగే ఈ సేవను కొవిడ్ సమయంలో 2020లో నిలిపివేశారు. భక్తుల నుంచి పలు విన్నపాలు రావడంతో ఈ సేవను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. ఈవో శ్రీనివాసమూర్తి దంపతులు రూ.500 టికెట్ కొనుగోలు చేసి సేవలో పాల్గొన్నారు. ఆలయ ఆస్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు అప్పన్న సన్నిధిలో ఈ సేవను జరిపించారు.
వికసిత్ ఆంధ్ర-2047 లక్ష్యాలను సాధించడానికి అధికారులు సమష్టిగా కృషి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో వికసిత్ ఆంధ్రకు సంబంధించి యాక్షన్ ప్లాన్‌పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధునాతన పద్ధతులను వినియోగించడం ద్వారా ఉత్పత్తులు పెంచవచ్చునని, తద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.యాక్షన్ ప్లాన్ తయారీలో అధికారులు విజన్‌తో పని చేయాలన్నారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు ముగ్గురు శనివారం విశాఖ వస్తున్నారు. వందే భారత్ రైలులో న్యాయమూర్తులు కే.మన్మధరావు, రవి చీమలపాటి, రవినాథ్ తిల్హరి విజయవాడ నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు అక్కడి నుంచి కారులో నేరుగా సర్క్యూట్ హౌస్‌కి వెళ్తారు. అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి న్యాయమూర్తులు మధ్యాహ్నం రైలులో విజయవాడ వెళ్తారు.
ఎంతో విశేష సాంకేతిక పరిజ్ఞానం కలిగిన INS షాల్కీ జలాంతర్గామి శుక్రవారం తూర్పు నౌకాదళానికి చేరుకుంది. ఆ జలాంతర్తామిలో విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందికి స్థానిక అధికారులు జాతీయ జెండాలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో నేవీ ఉన్నత అధికారులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సమీపంలో శుక్రవారం కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. హత్యా.., ఆత్మహత్యనా అనేది తెలియాల్సి ఉందన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
హర్ ఘర్ తిరంగా స్ఫూర్తితో విశాఖ కేంద్రంగా ఉన్న ఈస్టర్న్ నావేల్ కమాండ్ ఆధ్వర్యంలో నౌకాదళ సిబ్బంది అత్యంత సాహసంతో డైవింగ్ చేస్తూ నీటి లోపల జాతీయ జెండాను ఎగరవేసి పలువురి ప్రశంసలు అందుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజలు దేశభక్తిని చాటుకున్నారు. దాని స్ఫూర్తితో ఈ సాహస కార్యక్రమాన్ని నిర్వహించామని X (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు ఎన్డీఏ దూరంగా ఉండగా, నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి దాన్ని ఉపసంహరించుకోవడంతో బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆర్వో ధ్రువీకరణ పత్రం అందించారు. శాసనమండలిలో త్వరలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసే అవకాశాలను వైసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.