India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విశాఖ డెయిరీపై విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బొండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్‌విఎస్ కేకే.రంగారావు, దాట్ల సుబ్బరాజులను నియమించారు. సమగ్ర విచారణ జరిపి రెండు నెలల లోపు నివేదిక సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు.

ప్రొస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యకు ఆపరేషన్ లేకుండా వాటర్ వెపర్ థెరపీతో AINU హాస్పిటల్ చికిత్స అందిస్తోంది. అంగస్తంభన, వీర్యస్ఖలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలకు ఈ వాటర్ వెపర్ థెరపీతో సరైన పరిష్కారం లభిస్తుంది. ఇది చేసిన తర్వాత నెల రోజుల్లోపు ఫలితాలు కనిపిస్తాయని, ఈ సమస్యలు ఉన్నవారికి ఈ చికిత్స ఒక వరం లాంటిదని AINU ఎండీ, చీఫ్ కన్సల్టెంట్ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు.

విశాఖ పేరు వెనుక ఒక చరిత్రే ఉంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించిందని, వైశాఖ కాస్త విశాఖగా మారిందని పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నగరంలో కుమార స్వామి ఆలయం ఉండేదని అతని నక్షత్రం విశాఖ కావడంతో నగరానికి ఆ పేరు వచ్చిందనేది మరో కథనం. కాగా బ్రిటిష్ వారు విశాఖపట్నం పేరు పలకలేక వైజాగపట్నం అనే వారు. అది కాస్త వైజాగ్‌గా మారింది. నగరానికి విశాఖ పేరు ఎలా వచ్చిందో మీకు తెలిసిన కథ కామెంట్ చేయండి.

ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో నిందితుడు పచ్చిపాల గోవింద్‌కు ఏడీజీ న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2,000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. 2022లో చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తితో గోవిందు గొడవపడ్డాడు. కాగితాలు ఏరుకునే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడ్డుతో దాడి చేసి గోవిందు హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

పరవాడ ఫార్మాసిటీ ఠాగూర్ పరిశ్రమలో ఇద్దరు కార్మికులు మృతి చెందడం పట్ల ఉత్తరాంధ్ర వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలన్నారు. పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని ఎక్స్‌లో పేర్కొన్నారు.

రాష్ట్ర కార్మిక పారిశ్రామిక మంత్రి వాసంశెట్టి సుభాష్ విశాఖ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. రోడ్డు మార్గంలో జిల్లాకు చేరుకుంటారని మంత్రి కార్యదర్శి వెంకట సురేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అనకాపల్లి జిల్లా పరవాడ టాగూర్ ఫార్మా పరిశ్రమలో పర్యటించి ప్రమాద ఘటనపై వివరాలు తెలుసుకుంటారు. అనంతరం విశాఖలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శిస్తారు.

దత్తత తీసుకున్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గురువారం ఉడా చిల్డ్రన్ థియేటర్‌లో ఫోస్టర్ అడాప్షన్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి చేతులు మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లలు కావలసిన వారు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలన్నారు. చిన్న పిల్లలను అమ్మినా,కార్మికులుగా మార్చినా కఠిన చర్యలు తప్పవని అన్నారు.

పరవాడ ఫార్మాసిటీలో విషవాయువు లీకైన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 27 మంది అస్వస్థతకు గురైనట్లు సీపీఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. విశాఖ నగరంలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికులను వారు గురువారం పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు.

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామిని న్యూఢిల్లీలో ఆయన కార్యాలయంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలపై మంత్రితో ఎంపీ చర్చించారు. ముఖ్యంగా ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్టిల్ ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేస్తున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు.

పరవాడ ఠాగూర్ ఫార్మాలో జరిగిన ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురై విశాఖ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక కార్మికుడు గురువారం ఉదయం మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడు పిఠాపురానికి చెందిన సీహెచ్.వీరశేఖర్‌గా గుర్తించారు. మరో కార్మికుడు టీ.చిన్నకృష్ణ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐటీయూ పేర్కొన్నారు. ఫార్మా యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సీఐటీయూ నేత గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.