India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంబల్పూర్ కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. వచ్చే నెల 17, 24 (2 ట్రిప్పులు) తేదీల్లో నడపనున్న సంబల్పూర్ కాచిగూడ రైళ్లను రద్దు చేసామన్నారు. అలాగే కాచిగూడ సంబల్పూర్ వేసవి ప్రత్యేక రైళ్లను వచ్చే నెల 18, 25(రెండు ట్రిప్పులు) తేదీల్లో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తక్కువ ఆక్యుపెన్సి కారణంగా వీటిని రద్దు చేశాయన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీపై భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిమితి ఎత్తివేసింది. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 40 వరకు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, సుమారు 20 వేల వరకు సీట్లు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఒక్కో బ్రాంచ్‌లో 240 సీట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి ఆ పరిమితిని ఏఐసీటీఈ ఎత్తేసింది.
జైళ్ల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేంద్ర కారాగారంలో ఈ-ములాఖత్ విధానం సోమవారం నుంచి అమలులోకి తెచ్చినట్లు కారాగారం పర్యవేక్షకుడు ఎస్.కిషోర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడాలంటే జైలుకి వచ్చి జైలు నిబంధనలు మేరకు మాట్లాడే అవకాశం ఉండేది. దూరం నుంచి రావటం.. సమయంతో పాటు ప్రయాణ ఖర్చులు కూడా ఖైదీల కుటుంబ సభ్యులకు భారమవుతుందనే ఉద్దేశంతో ఈ విధానం అమల్లోకి తెచ్చారు.
విశాఖలో 9వ తరగతి చదువుతున్న పూర్వి రజాక్‌కు ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. పొడిమట్టిని ఉపయోగించి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంప్రదాయ ఆహార పదార్థాల సూక్ష్మ నమూనాలను ఈమె తయారు చేసింది. ఈ కళానైపుణ్యానికి పూర్వి రజాక్ పేరును ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పొందుపరిచారు.
విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సోమవారం సంచలన తీర్పు వెల్లడించింది. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్నారి 5వ తరగతి చదువుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెపై తాత శ్యాం సుందర్ చాలాసార్లు అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ జడ్జి ఆనంది తీర్పు వెలువరించారు.
కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి వరసాల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 1201 రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు.
నిరుద్యోగులను కంబోడియాకు తరలిస్తున్న మరో ఇద్దరు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించగా గాజువాకకు చెందిన ఏజెంట్ కె.వీరేంద్రనాథ్ 17 మందిని కాంబోడియాకు పంపించినట్లు గుర్తించారు. వీరేంద్రనాథ్‌తో పాటు మరో ఏజెంట్ కె.ప్రవీణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
పాలీసెట్ కౌన్సిలింగ్ నేటి నుంచి జూన్ 3 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కౌన్సిలింగ్‌కు తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్ల వివరాలు.
➣ ప్రాసెసింగ్ ఫీజు రశీదు
➣ పాలీసెట్ హాల్ టికెట్, ర్యాంకు కార్డు
➣ పది, తత్సమాన మార్కుల జాబితా
➣ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్
➣ EWS కోటా అభ్యర్థులు సంబంధిత EWS సర్టిఫికేట్
➣ 1-1-2021 తర్వాత నాటి కుల, ఆదాయ సర్టిఫికేట్
➣ టీసీ
➣➣Share it
మామిడి కాయలను కాల్షియం కార్బైట్‌తో మగ్గబెట్టవద్దని ఉద్యాన శాఖ అధికారి జి.రాధిక తెలిపారు. ఈ విధంగా మగ్గపెట్టిన పండ్లను తింటే ఆరోగ్యానికి హానికరమని హెచ్చరించారు. పక్వానికి వచ్చిన మామిడికాయలను ఇథలిన్ వాయువు సహాయంతో మగ్గబెడితే కొంత ముప్పు తప్పుతుందని తెలిపారు. పక్వానికి వచ్చిన మామిడి కాయలను గాలి చొరబడకుండా ఉండే గదిలో ఉంచి మగ్గపెట్టాలన్నారు.
సముద్ర తీరానికి సమీపంలో ఉన్నా జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పద్మనాభం ప్రాంతంలో 45 డిగ్రీలు దాటుతున్నాయి. మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం అనకాపల్లి జిల్లాలో 14, అల్లూరిలోని 10 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముంది. మంగళవారం ఉమ్మడి జిల్లాలో 42 మండలాల్లో వడగాలులు వీయొచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Sorry, no posts matched your criteria.