India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విశాఖ <<13346298>>సాగర్ నగర్<<>> కారు ప్రమాద ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఎర్రగుంట్ల క్రాంతికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు భయపడ్డ నిందితుడు మద్యం మత్తులో రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరుకు చెందిన డెలవరీ బాయ్ ఎస్.గణపతి తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతనిని KGHకి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాం గ్రామానికి చెందిన వెలమ రాంబాబు కుటుంబ సభ్యులతో బాలరేవుల బంధువుల ఇంటికి వచ్చి, శుక్రవారం ఉదయం బైక్‌పై తిరిగి పయనమయ్యారు. చింతవానిపాలెం ఘాట్‌లో బైక్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో బైక్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాంబాబు, అతడి కుమారుడు ప్రశాంత్ మృతి చెందారు. మృతుడి భార్య, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు 12 గంటల సమయం పట్టొచ్చని కలెక్టర్ మల్లికార్జున అంచనా వేశారు. విశాఖ పశ్చిమలో ఈవీఎం ఓట్ల లెక్కింపు మ.2 గంటలకు, పోస్టల్ బ్యాలెట్లు ఓట్ల సాయంత్రం 4 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. తొలిత పశ్చిమ, తర్వాత విశాఖ దక్షిణ, చివరగా భీమిలి నియోజకవర్గ ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి 14 చొప్పున 98 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ఈసెట్‌లో యారాడకుకి చెందిన మనోహర్ సత్తా చాటాడు. తెలంగాణ ఈసెట్‌లో మొదటి ర్యాంకు, ఏపీ ఈసెట్‌లో రెండో ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తండ్రి గురనాథరావు ప్రైవేట్ సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా.. తల్లి పాపాజీ గృహిణి. ఈ సందర్భంగా మనోహర్‌ను పలువురు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి తన తల్లిదండ్రల కష్టాలు తీర్చడమే లక్ష్యమని మనోహర్ తెలిపాడు.
ఫోన్ మాట్లాడుతూ నేలబావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన కే.కోటపాడులో చోటుచేసుకుంది. బస్టాండ్ వద్ద గ్రామానికి చెందిన బర్ల వెంకటరమణ(55) గురువారం సాయంత్రం ఫోన్ మాట్లాడుతూ నేలబావిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు అతడిని బయటకు తీశాయి. అప్పటికే అతడు మృతిచెందాడు. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు.
పెన్షన్ కోసం లబ్ధిదారులు ఎక్కడికి వెళ్ళవద్దని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి జిల్లాలో లబ్ధిదారులందరికి సకాలంలో సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో1,64,452 మందికి డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నేరుగా 1వ తేదీన జమ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన 46,965 మందికి వారి ఇంటి వద్దనే పెన్షన్లు అందజేయడం జరుగుతుందన్నారు.
అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం అనకాపల్లి కలెక్టరేట్‌లో జరుగుతున్న శిక్షణా తరగతులలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుందన్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుందన్నారు.
సాగర్ నగర్ జూ పార్క్ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్‌లో కారు నడపడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కార్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు ఎర్నాకులం టాటానగర్ మధ్య నడిచే రైలును విజయనగరం, కుర్థరోడ్, కటక్, జక్కాపుర, జరోలి మీదుగా మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. జూన్ 7 నుంచి 14 వరకు టాటా నుంచి బయలుదేరే టాటా ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ జరోలీ, ఖాజాపూర్, కటక్, కుర్థరోడ్, విజయనగరం మీదుగా మళ్లించారు. సంబల్పూర్ డివిజన్‌లో జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా రైళ్లు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఎస్.రాయవరం మండంలం అడ్డరోడ్డు సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం విశాఖ నుంచి కాకినాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్ పెదగుమ్ములూరు గ్రామానికి చెందిన జూమాల రాంబాబు(45) బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందినట్లు ఎస్సై విభీషణరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.