Visakhapatnam

News April 20, 2024

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి: అబ్జర్వర్

image

ఏపీలో ఎన్నికలను పూర్తి పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకురాలు నీనా నిగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. ఓటర్లు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులను కల్పించాలన్నారు.

News April 19, 2024

R.K బీచ్‌లో గుర్తు తెలియని మృతదేహం

image

విశాఖ ఆర్.కె బీచ్ నోవాటెల్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని మహారాణిపేట పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడు సర్ఫ్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్ పాంట్ వేసుకున్నాడని, వయసు 55 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు మహారాణిపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. మహారాణిపేట సీఐ, ఎస్.ఐ నెంబర్లు 94407 96010, 94407 96052కు సమాచారం ఇవ్వాలన్నారు.

News April 19, 2024

సింహాచలంలో కళ్యాణ మహోత్సవం ప్రారంభం

image

సింహాచలం ఆలయంలో శ్రీ వరహాలక్ష్మి నృసింహ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భువిలో జరిగే సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవానికి దివిలో దేవతలను ఆహ్వానిస్తూ ద్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి దంపతులు పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి రథోత్సవం అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.

News April 19, 2024

ఆర్థిక లావాదేవీలపై పటిష్ట నిఘా ఉంచాలి: కలెక్టర్

image

ఎన్నికల నిర్వహణలో భాగంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చులు, ఇతర వ్యయాలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా అధికారులను రాష్ట్ర వ్యయ పరిశీలకులు నీనా నిగం ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఆర్థిక లావాదేవీలు, నగదు బట్వాడా, బహుమతులు, ఇతర వస్తువులు తరలింపు, మద్యం రవాణా తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ వివరించారు.

News April 19, 2024

ఈనెల 30న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం

image

ఈనెల 30వ తేదీన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎం.పోలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున, ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన, జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం నిర్వహించబడుతుందని వెల్లడించారు.

News April 19, 2024

విశాఖ: మే 11న జాతీయ లోక్ అదాలత్

image

విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 11న జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఈ లోక్ ఆదాలత్‌లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహారాలు కేసులను పరిష్కరించుకోవచ్చు. పారిశ్రామిక వివాదాలు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 19, 2024

విశాఖ: సంబల్ పూర్-ఈరోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీన్ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైలు నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం ఏ.కే.త్రిపాఠి తెలిపారు. సంబల్పూర్-ఈరోడ్డు ప్రత్యేక రైలు మే 1 నుంచి జూన్ 26 వరకు ప్రతి బుధవారం దువ్వాడ మీదుగా నడపనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మే 3వ తేదీ నుంచి నుంచి జూన్ 28 వరకు ప్రతి శుక్రవారం ఈరోడ్డు నుంచి దువ్వాడ మీదుగా సంబల్పూర్ నడపనున్నట్లు పేర్కొన్నారు.

News April 19, 2024

నేడు అనకాపల్లి జిల్లాలోకి జగన్

image

ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర శుక్రవారం రాత్రి పాయకరావుపేట వద్ద అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించనుంది. కాకినాడ జిల్లా తునిలో పర్యటన ముగించుకుని రాత్రి తొమ్మిది గంటలకు జాతీయ రహదారి మీదుగా జిల్లాకి చేరుకుంటారు. ఆయన జాతీయ రహదారి మీదుగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 19, 2024

చింతూరులో ఎంపీటీసీ దారుణ హత్య

image

అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కన్నయ్య గూడెంలో ఎంపీటీసీ సభ్యుడు వర్ష బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహ కార్యక్రమం చూసుకుని వస్తుండగా, కన్నయ్య గూడెం ఊరి శివారులో ఇద్దరు దారి కాచి బండరాయితో మోది హత్య చేశారు. హత్యానంతరం ఇద్దరు నిందితులు ఎటపాక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

విశాఖ: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కాకినాడ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విశాఖలోని ద్వారం వారి వీధికి చెందిన బర్రే మధవ్ (20), అనకాపల్లికి చెందిన లాలం సతీశ్ (20), శ్రీకాకుళంకు చెందిన రామచంద్రరావు బీటెక్ చదువుతున్నారు. గండేపల్లి మ. రామేశంపేటలో గది అద్దెకి తీసుకొని ఉంటున్నారు. ముగ్గురు గురువారం రాత్రి పెద్దాపురానికి బైక్‌పై వెళ్లారు. తిరిగొస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.