Visakhapatnam

News March 20, 2024

విశాఖకు చేరుకున్న ఐపీఎల్ జట్ల ప్రతినిధులు

image

విశాఖ వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఈ నెల 31న జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు జట్ల ప్రతినిధులు విశాఖకు చేరుకున్నారు. మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌరభ్‌ గంగూలి, డేవిడ్‌ వార్నర్, షఫాలీ వర్మ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాడిసన్‌ బ్లూ హోటల్‌కు వెళ్లారు. సాయంత్రం ఏసీఏ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

News March 20, 2024

సముద్ర దొంగల ఆట కట్టించేందుకు వ్యూహాత్మక అడుగులు: యూఎస్ రాయబారి

image

సాగర జలాల సరిహద్దుల్లో చొరబాట్లు, సముద్రపు దొంగల ఆట కట్టించేందుకు భారత్‌తో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని భారత్‌–యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టి వెల్లడించారు. ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ తూర్పు నావికాదళ ప్రధాన కార్యలయానికి వచ్చిన ఆయన ఐఎన్‌ఎస్‌ జలశ్వ యుద్ధ నౌకలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భారత్, అమెరికా మధ్య రక్షణ విభాగ బంధం మరింత బలోపేతం అవుతుందన్నారు.

News March 20, 2024

విశాఖ: ‘ప్రభుత్వ భవనాలపై ప్రకటనలకు అనుమతి లేదు’

image

ప్రభుత్వ భవనాలు ప్రాంగణాల ఆవరణలో రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల కలెక్టర్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు తీసుకున్నట్లు తెలిపారు.

News March 19, 2024

వైజాగ్ అందాలు అద్భుతం: యూఎస్ రాయబారి

image

టైగర్‌ ట్రయంఫ్‌ యుద్ధ విన్యాసాల కోసం విశాఖ వచ్చిన భారత్‌లో యూఎస్‌ రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ దంపతులు మంగళవారం కైలాసగిరిని సందర్శించారు. అక్కడి నుంచి విశాఖ అందాలను చూసి మంత్ర ముగ్ధులై ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ‘కైలాసగిరి నుంచి వైజాగ్‌ అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ అద్భుత ప్రాంతాన్ని సంరక్షిస్తూ మరింత అందంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దిన GVMCకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.

News March 19, 2024

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారుకు ఇంకా సమయముంది: వైవీ

image

అనకాపల్లి ఎంపీ సీటు ఖరారు చేసేందుకు ఇంకా సమయం ఉందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. మంగళవారం విజయవాడ నుంచి విశాఖకు వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో త్వరలోనే అందరికీ తెలుస్తుందన్నారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుందన్నారు.

News March 19, 2024

భీమిలిలో చెడ్డీ గ్యాంగ్ ఫొటోలు విడుదల

image

భీమిలి పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా తిరుగుతున్నారని పోలీసులు ఫొటోలు విడుదల చేశారు. ఈ మేరకు చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి పూట గ్రామాలలో తిరుగుతున్నారని, అనుమానం రాకుండా ప్రజల మధ్యలో ఉంటున్నారు.. కావున ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

News March 19, 2024

‘బండారుకే పెందుర్తి టికెట్ ఇవ్వాలి’

image

పెందుర్తి టికెట్ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బండారుకు మద్దతుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెన్నెలపాలెం నుంచి పరవాడ వరకు పాదయాత్ర చేపట్టారు. బండారు టికెట్ ఇవ్వని పక్షంలో జనసేన అభ్యర్థికి సహకరించేది లేదని తేల్చి చెప్పారు. మంత్రిగా చేసిన ఒక సీనియర్ నేతకు టికెట్ ఇవ్వకుండా అవమానించడం సమంజసం కాదన్నారు.

News March 19, 2024

అనకాపల్లి: భవనం మీద నుంచి పడి మృతి   

image

కోటవురట్ల మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఇసరపు రామకృష్ణ (25) కోటవురట్లలో మంగళవారం నాలుగు అంతస్తుల భవనం నిర్మాణ పనులు చేస్తూ అదుపుతప్పి కిందకు జారిపడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. మృతునికి మూడు నెలల క్రితమే వివాహమైంది. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.

News March 19, 2024

సింహాచలం: మే 10న జరిగే చందనోత్సవంపై సమీక్ష

image

సింహాచలం ఆలయంలో మే 10వ తేదీన నిర్వహించనున్న చందనోత్సవం పై మంగళవారం వివిధ శాఖల అధికారులతో ఈఓ శ్రీనివాసమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను వివరించారు. ముఖ్యంగా కొండపైన ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు క్యూలైన్ల ఏర్పాటు తదితర విషయాలపై అధికారులతో ఈఓ చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ పాల్గొన్నారు.

News March 19, 2024

అనకాపల్లి: ఇద్దరు వాలంటీర్స్ తొలగింపు

image

గొలుగొండ మండలం కొత్తమల్లంపేటలో వాలంటర్లు వైసీపీ తరఫున ప్రచారం చేసిన సంగతి తెలిసింది. ఈ విషయంపై సోమవారం ఎంపీడీవో ఆధ్వర్యంలో గ్రామంలో విచారణ చేపట్టి, కలెక్టర్‌కి నివేదిక అందించారు. ఎన్నికల అధికారి జయరాం వాలంటీర్స్ ఓంకార విజయలక్ష్మి, సింగంపల్లి భవానీలను తొలగించినట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్న వాలంటీర్స్ ఏ పార్టీ తరఫున ప్రచారం చేయకూడదని హెచ్చరించారు.